https://oktelugu.com/

War 2 : వార్ 2 సినిమాలో ఎన్టీయార్ నెగటివ్ క్యారెక్టర్ చేస్తున్నాడా..?

నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ఇక తనదైన రీతిలో సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే...ఇక ఏది ఏమైనా కూడా ఆయన వరుస సినిమాలను చేస్తూ పాన్ ఇండియాలో మంచి గుర్తింపు సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు...

Written By:
  • Gopi
  • , Updated On : November 5, 2024 / 11:35 AM IST

    Is NTR playing a negative character in War 2?

    Follow us on

    War 2 : ఎన్టీఆర్ తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇప్పటికే ఆయన దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఇప్పుడు ‘వార్ 2’ సినిమా కోసం మరోసారి తీవ్రమైన కసరత్తులు చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్న ఎన్టీఆర్ తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడంలో చాలావరకు కష్టపడుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక ఐడెంటిటి ని క్రియేట్ చేసుకున్న ఎన్టీఆర్ ‘వార్ 2’ లో మాత్రం డిఫరెంట్ షెడ్స్ లో కనిపించబోతున్నాడు అనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో ఆయన కొంచెం నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో నటించబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. మరి హృతిక్ రోషన్ లాంటి హీరో సినిమాలో ఎన్టీఆర్ చేస్తున్నాడు అంటే ఆ క్యారెక్టర్ కి అంత గుర్తింపు ఉంటుందా ఉండదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక ఇప్పటికే ‘త్రిబుల్ ఆర్ ‘ సినిమాతో భారీగా దెబ్బపడింది. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ కి పాన్ ఇండియాలో అసలు కలెక్షన్స్ రావడం లేదు. మరి ఇప్పుడు చేస్తున్న మల్టీస్టారర్ మూవీ ద్వారా ఆయన కెరియర్ భారీగా డ్యామేజ్ అయితే ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయంటూ కొంతమంది ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేయడం విశేషం…

    ఇక ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడం లేదు. ఎన్టీఆర్ మాత్రం పాన్ ఇండియా లో అందరికంటే వెనుకబడిపోతున్నాడు. అందుకే మిగతా హీరోలతో పోలిస్తే ఈయన సినిమాకి కలెక్షన్స్ భారీగా తగ్గుతున్నాయనే చెప్పాలి. మరి ఇప్పుడు హృతిక్ రోషన్ తో సినిమా చేస్తున్నాడు.

    మరి ఈ సినిమాలో ఆయన నెగటివ్ క్యారెక్టర్ ని పోషిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక ఇదిలా ఉంటే ఎందుకు ఎన్టీఆర్ ఇలా డిఫరెంట్ క్యారెక్టర్ ని చేయాలని అనుకుంటున్నాడు. ఇండస్ట్రీ లో ఉన్న హీరోలందరూ వేలకోట్ల కలెక్షన్లు రాబడుతుంటే ఆయన మాత్రం 300, 400 కోట్ల దగ్గరే ఆగిపోతున్నాడు. కారణం ఏదైనా కూడా ఎన్టీఆర్ ఇంకా బాగా ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరమైతే ఉంది.

    ఇక నటన పరంగా గాని సక్సెస్ ల పరంగా గాని మంచి విజయాన్ని అందుకుంటున్న ఆయన కలెక్షన్స్ పరంగా మాత్రమే భారీ వసూళ్లను రాబట్టకపోవడం అనేది నిజంగా చాలా బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి…ఇక ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల మీదనే ఆయన భారీ ఆశలు పెట్టుకున్నాడు. చూడాలి మరి ఇక మీదట రాబోయే సినిమాలతో ఎలాంటి కలెక్షన్స్ ని వసూలు చేస్తాడు అనేది…