https://oktelugu.com/

Hanuman : హనుమాన్ ఇలా ఉంటాడా..? రిషబ్ శెట్టి కోసం ‘హనుమాన్’ లుక్ నే మార్చేసిన ప్రశాంత్ వర్మ.. విమర్శల వెల్లువ…

సినిమా ఇండస్ట్రీ లో ఉన్న చాలామంది నటులు వాళ్లను వాళ్ళు స్టార్ హీరోలుగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తుంటారు. ముఖ్యంగా ఇప్పుడు పాన్ ఇండియా హవా నడుస్తుంది. కాబట్టి ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క హీరో టార్గెట్ కూడా పాన్ ఇండియా సినిమాలు చేయడమే అనేది చాలా స్పష్టంగా తెలిసిపోతుంది...

Written By:
  • Gopi
  • , Updated On : November 5, 2024 9:16 am
    Is Hanuman like this..? Prashant Varma who changed the look of 'Hanuman' for Rishabh Shetty.. Flood of criticism...

    Is Hanuman like this..? Prashant Varma who changed the look of 'Hanuman' for Rishabh Shetty.. Flood of criticism...

    Follow us on

    Hanuman : ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో చాలా మార్పులు వస్తున్నాయి ఒకప్పుడు వచ్చే మూస ధోరణి కథలకు చెక్ పెడుతూ కొత్త దర్శకులు తమదైన రీతిలో ఎక్స్పరిమెంట్లను చేస్తూ మంచి విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ ఇప్పుడు వచ్చే దర్శకులు పురాణాలను, ఇతిహాసాలను కథాంశంగా తీసుకుని సినిమాలను చేస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే వీళ్ళు ఉన్న కథలను కథంశంగా చెప్పకుండా వీళ్లకు నచ్చినట్టుగా మార్చి ఆ కథలను చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నారంటూ ఆయా సినిమా మేకర్స్ భారీ విమర్శలను ఎదుర్కొంటున్నారు. నిజానికి ప్రభాస్ హీరోగా వచ్చిన ‘ఆది పురుషు’ సినిమా రామాయణాన్ని బేస్ చేసుకొని తీశారు…కానీ ఈ సినిమా చిత్రీకరణ కానీ, వాళ్ళ గెటప్ లు కానీ అసలు బాగాలేవు. అసలు ఏ మాత్రం రామాయణం మీద రెస్పెక్ట్ లేకుండా చేసిన సినిమాగా మనకు కనిపిస్తుంది…ఇక దర్శకుడు ఓం రావత్ తనకు నచ్చినట్టుగా ఈ సినిమాను తీశాడు తప్ప మన రామాయణాన్ని బేస్ చేసుకొని సినిమాను తీయలేదు అంటూ భారీ విమర్శలను ఎదుర్కొన్నాడు. ఇక అలాగే కల్కి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న నాగ్ అశ్విన్ కూడా కొన్ని విషయాల్లో మహాభారతాన్ని వక్రీకరించి కొన్ని సీన్లు యాడ్ చేశాడు అంటూ కొంతమంది వాళ్ల అభిప్రాయాలను వ్యక్తం చేశారు…ఇక ఇదిలా ఉంటే ‘హనుమాన్ ‘ సినిమాతో మంచి దర్శకుడిగా గుర్తింపును సంపాదించుకున్న ప్రశాంత్ వర్మ లాంటి యంగ్ డైరెక్టర్ సైతం ఇప్పుడు ‘జై హనుమాన్’ సినిమా కోసం భారీ కసరత్తులను చేస్తున్నాడు. ఇక అందులో భాగంగానే హనుమంతుని పాత్రను పోషిస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా ఈ సినిమా నుంచి హనుమంతుడి క్యారెక్టర్ ను ఎస్టాబ్లిష్ చేస్తూ ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశాడు…ఈ పోస్టర్లో హనుమంతుడు కోతి అవతారంలో మనకు కనిపించాలి కానీ కానీ రిసెప్ట్ శెట్టి క్యారెక్టర్ కి అలాంటి అవతారాన్ని పెట్టలేదు అ ప్రశాంత్ వర్మ అలా చేయలేదు…

    అతనికి భారీగా గడ్డం కూడా ఉంది. ఋషులు మునులు పెంచుకునే గడ్డాన్ని హనుమంతుడు ఎందుకు పెంచుకుంటాడు. ఆయన ఎప్పుడు నీటుగా ఉంటాడు. అతనికి గడ్డం అనేది ఉండదు. ఇక దాంతో ప్రశాంత్ వర్మ రిలీజ్ చేసిన పోస్టర్ మీద విపరీతమైన విమర్శలైతే చేస్తున్నారు…నిజానికి రిషబ్ శెట్టి అనే యాక్టర్ హనుమంతుడి పాత్ర చేస్తున్నాడు అంటూ ఎస్టాబ్లిష్ చేయడానికి తను ఆ కోతి రూపాన్ని కాకుండా నార్మల్ మనిషి రూపంలోనే పోస్టర్ రిలీజ్ చేసినట్టుగా తెలుస్తోంది. కానీ హనుమంతుడి క్యారెక్టర్ అని చెప్పి ఇలాంటి పోస్టర్ రిలీజ్ చేయడం పట్ల విభేదాలు అయితే వస్తున్నాయి. ఎందుకు అంటే రిషబ్ శెట్టి హనుమంతుడి క్యారెక్టర్ ని పోషిస్తున్నాడు కాబట్టి తను కోతి లుక్ లోనే కనిపించాలి.

    అంతేతప్ప అతను రిషబ్ శెట్టి అని జనానికి తెలియడానికి తనకి నచ్చినట్టుగా పోస్టర్ ను రిలీజ్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్… సినిమాలు తీసే విధంగానే తీయాలి అంతేతప్ప ఎవరికో ఫేవర్ చేయడానికి మన హిందూ దేవుళ్లను కించపరుస్తూ సినిమాలు చేస్తే ఆయా దర్శక నిర్మాతల మీద ప్రేక్షకులు తీసుకునే చర్యలు చాలా కఠినంగా ఉంటాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే పురాణ ఇతిహాసాలు హిందువుల మనోభావాలకు సంబంధించిన అంశాలు వాటిని ఏమాత్రం వక్రీకరించిన లేదంటే ఏదో టైం పాస్ కోసం సినిమాల్లో కొన్ని సీన్లను ఆడ్ చేసిన, వాళ్ళ క్యారెక్టర్స్ ని ఉన్నది ఉన్నట్టుగా కాకుండా ఏదో కొత్తగా చేయాలని చాలా చెత్తగా చూపించడం లాంటివి చేస్తే ప్రశాంత్ వర్మ అనే కాదు ఏ దర్శకుడు పైన అయిన తీవ్రమైన చర్యలు తీసుకోక తప్పదు.

    అలాగే సినిమాల మీద భారీ ఎఫెక్ట్ పడే అవకాశాలు కూడా ఉన్నాయి. నిజానికి హనుమాన్ సినిమాని బాగా తీశాడు అంటూ ప్రశాంత్ వర్మ మీద ప్రశంసలను కురిపించిన చాలామంది హనుమంతుడి పోస్టర్ ఫస్ట్ లుక్ ని చూసిన తర్వాత భారీ విమర్శలను చేస్తున్నారు. ఒక సెన్సిబుల్ దర్శకుడు చేయాల్సిన పని ఇది కాదు. హనుమంతుడుని రివిల్ చేసి కావాలంటే ఆ క్యారెక్టర్ ను చేస్తుంది ప్రశాంత నీల్ అని పక్కన మెన్షన్ చేస్తే బాగుండేది. అంతేతప్ప గడ్డం పెంచుకొని కోతి రూపం లేకుండా ఒక తోకను మాత్రమే పెట్టి ఆయన హనుమంతుడు అని చెప్తే ఎవరు నమ్ముతారు. చూసేవాళ్ళు పిచ్చోళ్ళు అయితే కాదు… అలాగే పురాణాలను తీసుకొని సినిమాలుగా చేసేటప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా చేయాల్సిన అవసరం కూడా ఉంది.

    ఇలాంటి చిన్న మిస్టేక్ జరిగిన కూడా విమర్శలను ఎదుర్కోవడమే కాదు దర్శకుడి కెరియర్ మీద కూడా భారీ ఎఫెక్ట్ పడే ప్రమాదం అయితే ఉంది. ఇక ఈ విషయం మీద ఇప్పటివరకు ప్రశాంత్ వర్మ ఎలాంటి స్పందనను తెలియజేయలేదు. కానీ ప్రశాంత్ వర్మ ఇలాగే చేస్తే మాత్రం ఈ సినిమా నెగటివ్ అభిప్రాయాన్ని సంపాదించుకోవడమే కాకుండా సినిమా డిజాస్టర్ దిశగా వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి…

    దీనిద్వారా అందరికీ తెలియజేసేది ఏంటంటే మీకు నచ్చినట్టుగా సినిమాలు చేయాలంటే ఫిక్షన్ కథలను తీసుకోండి, కమర్షియల్ స్టోరీ లను రాసుకోండి. అంతేకానీ పురాణాలు తీసుకొని అందులో రాముడు ఇలాగే ఎందుకు ఉండాలి, హనుమంతుడు అలానే ఎందుకు ఉండాలి అంటు ఫిక్షన్ ఆడ్ చేస్తా అంటే మాత్రం ఒక్కొక్కడి బాక్స్ లు బద్దలవుతాయి… రిషబ్ శెట్టి అనే యాక్టర్ కోసం మా దేవుడి రూపం మార్చడానికి నువ్వెవ్వడు అంటూ ప్రశాంత్ వర్మ మీద హిందూ సంఘాలు చాలా కోపంతో ఉన్నాయి…