NTR & Rajamouli : ఎన్టీయార్ మీద డబ్బులు పెడితే తిరిగి రావా..? అందుకే రాజమౌళి ఎన్టీయార్ తో భారీ సినిమా ప్లాన్ చేయడం లేదా..?

సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్ హీరోలుగా ప్రమోట్ చేసుకోవాలని చూస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు చేసే ప్రతి సినిమా కూడా ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలను కలిగి ఉంటాయి. కాబట్టి ఆ సినిమాలతో సక్సెస్ లని సాధించి స్టార్ హీరోలుగా ఎలివేట్ అవ్వాలని చూస్తుంటారు...

Written By: Gopi, Updated On : November 4, 2024 10:23 am

If you put money on NTR, will it come back? That's why Rajamouli is not planning a big movie with NTR..?

Follow us on

NTR & Rajamouli : తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు జూనియర్ ఎన్టీఆర్…ఇక తనదైన రీతిలో సత్తా చాటుతూ ముందుకు సాగుతున్న ఎన్టీఆర్ రీసెంట్ గా దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ సక్సెస్ ని సాధించాడు. అయితే ఈ సినిమాతో అందుకున్న విజయంతో ఆయన వరుసగా ఏడోవ సక్సెస్ ని కూడా సాధించి యంగ్ హీరోలేవ్వరికి సాధ్యం కాని రీతిలో తను సత్తా చాటుతూ ముందుకు దూసుకెళుతున్నాడు…ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు సక్సెస్ టాక్ ను తెచ్చుకున్నా కూడా కలెక్షన్లు మాత్రం రావడం లేదంటూ రీసెంట్ గా కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ ను ట్రోల్ చేస్తున్నారు. నిజానికి 250 కోట్లతో తెరకెక్కిన దేవర సినిమాకి కేవలం 300 కోట్ల కలెక్షన్లు మాత్రమే రావడం అనేది చాలా వరకు బ్యాడ్ లక్ అనే చెప్పాలి. ఎందుకంటే సక్సెస్ ఫుల్ టాక్ తెచ్చుకున్న తర్వాత కూడా ఏ స్టార్ హీరో సినిమా అయినా మినిమం 500 కోట్లకు పైన కలెక్షన్లను వసూల్ చేస్తుంది. కానీ జూనియర్ ఎన్టీఆర్ సినిమా మాత్రం ఇంత తక్కువ వసూళ్లను రాబట్టడం అనేది అతని ఫాన్స్ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక ఇదిలా ఉంటే రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ కూడా జూనియర్ ఎన్టీఆర్ తో ఇప్పటివరకు నాలుగు సినిమాలు మాత్రమే చేశాడు. అందులో ఏ సినిమా కూడా ఇండస్ట్రీ హిట్ కొట్టకపోవడం విశేషం. ఇక రాజమౌళి అందువల్లే జూనియర్ ఎన్టీఆర్ తో భారీ సినిమాలను ప్లాన్ చేయడం లేదనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ కి ఇండస్ట్రీ హిట్ కొట్టేంత సత్తా లేదని అందువల్లే మిగతా హీరోలతో భారీ సినిమాలను ప్లాన్ చేస్తున్నాడు గాని, ఎన్టీఆర్ తో మాత్రం మీడియం రేంజ్ కథలతోనే వచ్చి బ్లాక్ బాస్టర్ సక్సెస్ లను కొడుతున్నాడు.

ఇక ‘త్రిబుల్ ఆర్’ సినిమాలో కూడా జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇద్దరిని తీసుకొని జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ ని సెకండ్ హీరోగా ప్రమోట్ చేశాడే తప్ప మెయిన్ హీరోగా మాత్రం జూనియర్ ఎన్టీఆర్ ను పెట్టలేదు.

దానికి కారణం అతనికి భారీ కలెక్షన్లను వసూలు చేసే మార్కెట్ లేదని ముందుగానే తెలుసుకున్న రాజమౌళి ఇలాంటి స్ట్రాటజీని మెయింటైన్ చేశారంటూ కూడా కొంతమంది సినీ మేధావులు వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు… ఇక ఏది ఏమైనా కూడా రాజమౌళి ఎన్టీఆర్ కి నాలుగు సక్సెస్ లను ఇవ్వడం అనేది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి…