https://oktelugu.com/

Pushpa 2 : పుష్ప 2 హిట్ అయితే అల్లు అర్జున్ నెక్స్ట్ హాలీవుడ్ సినిమా చేయబోతున్నారా..?

సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్క హీరోకి చాలా మంచి క్రేజ్ అయితే ఉంటుంది. మంచి సినిమాలు చేయడం వల్ల వాళ్ళు సంపాదించుకున్న క్రేజ్ ని రెట్టింపు చేసుకోవాలనే తపన ప్రతి ఒక్కరిలో కనిపిస్తూ ఉంటుంది. కానీ దానికి తగ్గట్టుగానే వాళ్ళు ఎంచుకున్న సినిమాలు కూడా కీలక పాత్ర వహిస్తూ ఉంటాయి. సక్సెస్ లను సాధించిన హీరోలు స్టార్ డమ్ ని అందుకుంటుంటే ఫెయిల్యూర్స్ ని సాధించిన హీరోలు మాత్రం తమ మార్కెట్ ను కోల్పోతూ ఉంటారు...

Written By:
  • Gopi
  • , Updated On : October 25, 2024 / 09:33 AM IST

    If Pushpa 2 is a hit, is Allu Arjun going to do his next Hollywood film..?

    Follow us on

    Pushpa 2 : తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకుంటున్నారు. ముఖ్యంగా సుకుమార్ లాంటి దర్శకుడు ఇంటెలిజెంట్ డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా ప్రస్తుతం మాస్ డైరెక్టర్ గా కూడా తననుతాను మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక రంగస్థలం సినిమాతో ఒక్కసారిగా భారీ సక్సెస్ ను అందుకున్న సుకుమార్ ఆ తర్వాత చేసిన పుష్ప సినిమాతో పాన్ ఇండియాలో తన సత్తా చాటాడు. ఇప్పుడు ‘పుష్ప 2’ సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సినిమాలను చేయగలిగే సత్తా ఉన్న ఈ దర్శకుడు అల్లు అర్జున్ తో చేస్తున్న ఈ సినిమా సూపర్ సక్సెస్ గా నిలుస్తుందని అభిమానులతో పాటు యావత్ ఇండియన్ ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే అల్లు అర్జున్ కూడా అలా వైకుంఠపురంలో సినిమాతో నాన్ బాహుబలి ఇండస్ట్రీ రికార్డులు క్రియేట్ చేశాడు. ఆయన పుష్ప సినిమాతో 400 కోట్ల వరకు కలెక్షన్లను రాబట్టారు. ఇక ప్రస్తుతం పుష్ప 2  సినిమాతో తనను తాను మరొకసారి స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకొని ఐకాన్ స్టార్ గా ప్రేక్షకుల ముందు నిలబడాలనే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ సినిమా సక్సెస్ అయితే అల్లు అర్జున్ హాలీవుడ్ లో ఒక సినిమా చేయబోతున్నాడు అంటూ కొన్ని రోజులుగా ఒక వార్త అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మరి ఇది నిజమా? కాదా అనే విషయం పక్కన పెడితే ఈ సినిమా సక్సెస్ అయితే అల్లు అర్జున్ క్రేజ్ భారీగా పెరిగిపోతుంది.
    ప్రభాస్ తర్వాత ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అల్లు అర్జున్ నెంబర్ 2 హీరోగా అవతరించే అవకాశాలైతే ఉన్నాయి. ఇక అలాగే కొంతమంది హాలీవుడ్ దర్శకులు కూడా ప్రస్తుతం అల్లు అర్జున్ తో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా అల్లు అర్జున్ లాంటి హీరో క్రేజ్ అనేది ఎల్లలు దాటి వెళ్లడం నిజంగా ఒక అద్భుతమనే చెప్పాలి.
    ప్రస్తుతం ఆయన చేస్తున్న ప్రతి సినిమా మీద చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత చేయబోయే సినిమాల విషయంలో కూడా ఆయన ఆచితూచి అడుగులు వేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది.
    ఇక డిసెంబర్ 5వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపధ్యం లో ఈ సినిమా మీద భారీ అంచనాలైతే ఉన్నాయి. ఈ సినిమా 1500 కోట్ల వరకు కలెక్షన్లను రాబడుతుందనే అంచనాలో ప్రేక్షకులు ఉన్నారు…