https://oktelugu.com/

Sai Pallavi : సాయి పల్లవి కి ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చిన తక్కువే అవుతుందా..? అమరన్ సినిమాలో ఏడిపించేసిందా..?

సినిమా ఇండస్ట్రీ అనేది రంగుల ప్రపంచం...ఇక బయట నుంచి చూసేవాళ్ళకు సినిమా ఇండస్ట్రీ చాలా కలర్ ఫుల్ గా కనిపిస్తుంది. కానీ అందులో ఉండి సినిమా కోసమే బతుకుతున్న వాళ్ళ లైఫ్ లు మాత్రం చాలా దారుణంగా ఉంటాయి. నిజానికి ఒక సినిమా సక్సెస్ అయింది అంటే అందులో దర్శకుడి పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే సినిమా ఫ్లాప్ అయిన కూడా దర్శకుడే దానికి పూర్తి బాధ్యతను వహించాల్సి ఉంటుంది...

Written By:
  • Gopi
  • , Updated On : November 5, 2024 / 08:28 AM IST

    How much remuneration given to Sai Pallavi will be less..? Did Amaran make you cry?

    Follow us on

    Sai Pallavi : ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి పాత్రలో అయినా నటించి మెప్పించగలిగే నటీమణులు చాలా తక్కువ మంది ఉన్నారు. ముఖ్యంగా లేడీ ఆర్టిస్ట్ ల్లో మాత్రం పెద్దగా వైవిధ్యాన్ని ప్రదర్శించే నటి మణులు లేకపోవడం సినిమా ఇండస్ట్రీ కి చాలా మైనస్ గా మారుతుందనే చెప్పాలి. ఇక ఇలాంటి నేపధ్యంలోనే ఫిదా సినిమాతో సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన సాయి పల్లవి తెలుగు, తమిళ్ భాషల్లో మంచి సినిమాలను చేస్తూ ముందుకు సాగుతుంది. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ లో రన్బీర్ కపూర్ పక్కన రామాయన్ సినిమాలో సీతగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇలాంటి క్రమంలోనే ఆమె ఎంచుకునే పాత్రలు చాలా సెలెక్టెడ్ గా ఉండడమే కాకుండా తన పాత్రకి మంచి గుర్తింపు ఉంటే గాని ఆమె పాత్రను సెలెక్ట్ చేసుకోవడం లేదు. కాబట్టి ఇలాంటి సందర్భంలో ఆమె నుంచి వచ్చే సినిమాల పట్ల ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉంటున్నాయి… ఇక దానికి తగ్గట్టుగానే ఆమె మంచి పాత్రలను ఎంచుకొని సినిమాలుగా చేస్తూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే.

    ఇక రీసెంట్ గా ఆమె శివ కార్తికేయన్ హీరోగా వచ్చిన ‘అమరన్ ‘ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. మరి ఈ సినిమాలో తను సెటిల్డ్ పర్ఫామెన్స్ ఇవ్వడమే కాకుండా ఆ సినిమా విజయంలో కీలకపాత్ర వహించింది. ఒక ఆర్మీ మేజర్ భార్య ఎలా ఉండాలి. ఆర్మీ ఆఫీసర్ కి ఏదైనా జరిగితే తనెలా రియాక్ట్ అవ్వాలి. బాధలు, బాధ్యతలు ఎలా ఉంటాయి. వాటిని తన నటనతో చేసి ప్రేక్షకులను మెప్పించిందనే చెప్పాలి. నిజానికి ఇలాంటి నటీమణులు చాలా అరుదుగా దొరుకుతూ ఉంటారు.

    ఇక ఇదిలా ఉంటే సాయి పల్లవి ప్రస్తుతం భారీ రేంజ్ లో రెమ్యూనరేషన్ ని అందుకుంటున్నారనే విషయమైతే ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది…ఇక ప్రస్తుతం ఆమె సినిమా సక్సెస్ అవ్వడంతో ఆమె 10 కోట్లకు పైన రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆల్మోస్ట్ చిన్న హీరోల కంటే తనే ఎక్కువ రెమ్యూనరేషన్ ను తీసుకోవడం విశేషం…ఇక మొత్తానికైతే సాయి పల్లవి ఈ సినిమాలో ఉంటే చాలు ఆ సినిమాకి భారీ మార్కెట్ అయితే అవుతుందట.

    ఇక దాన్ని క్యాష్ చేసుకోవడానికి ఆమె తన రెమ్యూనరేషన్ ని రోజురోజుకీ పెంచుకుంటూ పోతుంది. మరి రీసెంట్ గా అమరన్ సినిమా సక్సెస్ అవ్వడం తో తమిళం, తెలుగులో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ మరిన్ని సక్సెస్ లతో ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా తన అభిమానులను కూడా కట్టిపడేసే నటనతో మెస్మరైజ్ చేసిందనే చెప్పాలి…