Telugu News » Photos » Cinema Photos » How many crores did mahesh babu get in krishnas property do you know the real value of mahesh babus assets
Ad
Mahesh Babu & Krishna : కృష్ణ ఆస్తిలో ఎన్ని కోట్లు మహేష్ బాబుకి వచ్చింది..? అసలు మహేష్ బాబు ఆస్తుల విలువెంతో తెలుసా..?
సినిమా ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న హీరోలు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా స్టార్ స్టేటస్ ని అందుకోవాలంటే అంతా ఆషామాషీ వ్యవహారం అయితే కాదు. సినిమాల మీద సినిమాలు చేస్తూ భారీ సక్సెస్ లను అందుకున్న వాళ్లు మాత్రమే ఇక్కడ స్టార్ స్టేటస్ ని అనుభవిస్తూ ఉంటారు...
How many crores did Mahesh Babu get in Krishna's property? Do you know the real value of Mahesh Babu's assets?
Follow us on
Mahesh Babu & Krishna : తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ ఒకప్పుడు స్టార్ హీరోగా వెలుగొందడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. ఇక అప్పట్లో కృష్ణ ఎన్టీయార్, నాగేశ్వరరావుల తర్వాత తన నటనతో తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద చెరగని ముద్ర వేశాడు. ఇక తనను తాను స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకోవడమే కాకుండా యావత్ తెలుగు ప్రేక్షకులందరిలో చిరస్మరణీయమైన ముద్రను వేశాడనే చెప్పాలి. అలాంటి నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండడం నిజంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టమనే చెప్పాలి. ముఖ్యంగా కృష్ణ ను ప్రొడ్యూసర్స్ హీరో అని పిలుస్తూ ఉండేవారు. ఎందుకంటే ప్రొడ్యూసర్స్ కి సినిమాలు ప్లాప్ అవ్వడం వల్ల ఏదైనా నష్టం వస్తే తన రెమ్యూనికేషన్ వెనక్కి తిరిగి ఇచ్చేవాడట. అలాగే ఆ ప్రొడ్యూసర్ తో మరొక సినిమా చేసి తనని సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా నిలిపే ప్రయత్నం చేస్తూ ఉండేవారట…ఇక ఇదిలా ఉంటే కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు మాత్రం ప్రస్తుతం తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే కృష్ణ హీరోగా ఉన్నప్పుడు చాలా ఎక్కువ మొత్తంలో డబ్బులు అయితే సంపాదించాడు. ఇక కూతుళ్ళ విషయం పక్కన పెడితే తనకు ఇద్దరు కొడుకులు అనే విషయం మనకు తెలిసిందే. అందులో ఒకరు రమేష్ బాబు కాగా, మరొకరు మహేష్ బాబు…
అయితే ఇద్దరు కొడుకులకి చెరో 3000 కోట్ల రూపాయలను ఆస్తిగా ఇచ్చినట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఇక ఈ మూడు వేల కోట్లతో పాటు మహేష్ బాబు మరొక 3000 కోట్ల ఆస్తులను కూడా సంపాదించాడు. ఇక ఏది ఏమైనా కూడా మహేష్ బాబు లాంటి స్టార్ హీరో ప్రస్తుతం సినిమాల్లో భారీ రెమ్యునరేషన్ తీసుకుంటూనే, యాడ్ ఫిలిమ్స్ తర్వాత కూడా చాలా పెద్ద మొత్తంలో రెమ్యూనరేషన్ అయితే దక్కించుకుంటున్నాడు.
తన బ్రాండ్ వాల్యూ కూడా ఎప్పటికప్పుడు పెంచుతూ వస్తున్నాడు. ప్రస్తుతం ఆయన రాజమౌళి తో చేయబోయే సినిమాతో పాన్ వరల్డ్ లో సూపర్ సక్సెస్ సాధిస్తే మాత్రం ఆయన రెమ్యూనరేషన్ తారా స్థాయిలో పెంచే అవకాశం అయితే ఉంది…
ఇక ఏది ఏమైనా కూడా మహేష్ బాబు మాత్రం చాలా డీసెంట్ గా తన సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతాడు. ఎవరితో గొడవలు పెట్టుకోవడం కానీ కాంట్రవర్సీ లలో నిలవడం కానీ ఆయనకి ఇష్టం ఉండదు. అందుకే మహేష్ బాబు అంటే ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి చాలా మంచి రెస్పెక్ట్ అయితే ఉంటుంది…