Hollywood adult : ఓటిటి లో దుమ్మురేపుతున్న హాలీవుడ్ అడల్ట్ మూవీ…అసలు కథ ఏంటి..?ఎక్కడ చూడవచ్చు అంటే..?

ఇప్పటివరకు హాలీవుడ్ ఇండస్ట్రీలో వచ్చిన ప్రతి సినిమా కూడా ఏదో ఒక సందర్భంలో పెను ప్రభంజనాన్ని అయితే సృష్టిస్తూ వస్తున్నాయి. ముఖ్యంగా అక్కడి సినిమాల్లో గ్రాఫిక్స్ తో పాటు అడల్ట్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది...

Written By: Gopi, Updated On : October 26, 2024 8:42 am

Hollywood adult movie that is making dust in OTT... What is the real story...? Where can you watch it...?

Follow us on

Hollywood adult : ప్రపంచ లోనే ఏ ఇండస్ట్రీ కి లేని క్రేజ్ హాలీవుడ్ సినిమాలకి ఉంది. నిజానికి ఆ సినిమాలకు ఇండియా లో ఉన్న క్రేజ్ వేరే లెవల్ అనే చెప్పాలి. అక్కడి నుంచి ఒక సినిమా వచ్చిందంటే చాలు ప్రేక్షకుల్లో విపరీతమైన అటెన్షన్ క్రియేట్ అవుతుంది. ఇక అక్కడి సినిమాల్లో  మసాలా కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. నిజానికి రొమాంటిక్ సన్నివేశాలతోనే వాళ్ళు సినిమాలను నడిపిస్తూ ఉంటారు. ఎందుకంటే హాలీవుడ్ లో శృంగారభరితమైన సినిమాలను తీయడం పెద్దగా తప్పైతే కాదు. ఎందుకంటే వాళ్ళ జీవన విధానంలో అది కూడా ఒక భాగం గానే చూస్తూ ఉంటారు. కానీ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మాత్రం అలాంటి సినిమాలు చేస్తే వాటికి సెన్సార్ వాళ్లు చాలావరకు కట్స్ విధిస్తూ ఉంటారు. ‘అమెజాన్ ప్రైమ్’ లో స్ట్రీమింగ్ అవుతున్న ‘ఎస్ గాడ్ ఎస్’ అనే మూవీ కూడా ఇదే కోవకు చెందింది. రొమాంటిక్ సన్నివేశాలతో సాగిపోయే ఈ సినిమాలో అడల్ట్ కంటెంట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ సినిమాని 18 సంవత్సరాలు పైబడిన వారు చూస్తే బెస్ట్… అసలు ఈ సినిమా ఏంటి ఈ స్టోరీలో ఏముంది అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకుందాం…
ముందుగా ఈ సినిమా స్టోరీ లోకి వెళ్తే టీనేజ్ వయసులో ఉన్న ఒక అమ్మాయి చాలా స్ట్రిక్ట్ నిబంధనలను పెట్టే ఒక క్యాథలిక్ చర్చ స్కూల్లో చదువుతూ ఉంటుంది. ఇక అందులో భాగంగానే ఒక రోజు ఒక టీచర్ వాళ్ళకి సెక్స్ గురించి పాఠాలు చెప్పే పరిస్థితి అయితే వస్తుంది. దాని వలన ఆయన సెక్స్ గురించి పిల్లలకు బోధిస్తూ సెక్స్ చాలా చెడ్డది అలా చేయడం చాలా తప్పు అన్నట్టుగా పిల్లలకు బోధిస్తూ ఉంటారు. ఇక ఇదిలా ఉంటే అలైస్ అనే అమ్మాయి స్కూల్ ముగించుకొని ఇంటికెళ్లిన తర్వాత కంప్యూటర్ ఆన్ చేసి వాడుతుంటే అందులో ఆమెకు ఒక మెసేజ్ కనిపిస్తుంది. ఆ మెసేజ్ ని ఓపెన్ చేస్తుంది అందులో నీలి చిత్రాలు కనిపిస్తూ ఉంటాయి. దాని వల్ల ఆమె అటువైపు తన మనసును మళ్లించి అసలు దాంట్లో ఏం దాగుందో తెలుసుకోవాలనే కుతుహులంతో ఇంకా ముందుకు వెళుతూ ఉంటుంది… ఇక ఆ తర్వాత వాళ్లు ఒక వెకేషన్ కి వెళ్ళినప్పుడు అక్కడ క్రిస్ అనే అబ్బాయి పరిచయం అవుతాడు.
ఇక అతనికి దగ్గర అవ్వాలని అలైస్ చాలా వరకు ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇక అందులో భాగంగానే తమకు విద్యాబుద్ధులు నేర్పే టీచర్ ఒకరోజు స్కూల్లోనే నీలి చిత్రాలు చూడడం అలైస్ గమనిస్తుంది. దాంతో ఆమెకి తీవ్రమైన భయం కలుగుతుంది. ఈ విషయాన్ని తన ఫ్రెండ్ అయిన లారా తో పంచుకుంటుంది. మరి ఇదంతా చూసిన అలైస్ ఏం చేసింది అసలు అలైస్ కంప్యూటర్ కి మెసేజ్ పంపిన వారు ఎవరు మొత్తానికైతే అలైస్ క్రిస్ ప్రేమ వ్యవహారం ఏం అయింది అనేది తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…
ముఖ్యంగా ఈ సినిమాలో చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి. కొన్ని ట్విస్టులు కూడా సినిమాల్లో చాలా బాగా వర్క్ అవుట్ అయ్యాయి. కాబట్టి ఇలాంటి సినిమాలు ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ సినిమాని చూసి చాలావరకు ఎంజాయ్ చేయొచ్చు… మరి మొత్తానికైతే ఈ సినిమా కొంచెం అడల్ట్ కంటెంట్ తో కూడుకొని ఉంది. కాబట్టి ఫ్యామిలీతో కాకుండా 18 సంవత్సరాల పైబడిన వ్యక్తులు సింగిల్ గా చూస్తే బాగుంటుంది… ఇక ఇలాంటి కంటెంట్లకి తెలుగులో ఇప్పుడిప్పుడే ఆదరణ అయితే పెరుగుతుంది. మరి ఈ సినిమా చూసి జనాలు వాళ్ల ఫీలింగ్ ఏంటో తెలియజేస్తే బాగుంటుందంటూ సినిమా మేకర్స్ కూడా ఈ సినిమా గురించి మాట్లాడుతుండటం విశేషం…