Hanuman : ‘హనుమాన్’ సూపర్ హిట్…మరి ‘జై హనుమాన్ ‘ పరిస్థితి ఏంటి..? కథా, కథనం ఎలా ఉంది?

తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పటికే ప్రశాంత్ వర్మ లాంటి యంగ్ డైరెక్టర్స్ పాన్ ఇండియాలో తమ సత్తా చాటుతూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఇక ఈ సంక్రాంతికి ఈయన చేసిన పెను ప్రభంజనాన్ని మనం మర్చిపోలేము. హనుమాన్ సినిమాతో మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా తనకంటూ ఒక సెపరేట్ ఐడెంటిని కూడా క్రియేట్ చేసుకున్నాడు...

Written By: Gopi, Updated On : November 4, 2024 11:01 am

'Hanuman' is a super hit...and what is the situation of 'Jai Hanuman'? How is the story?

Follow us on

Hanuman : హనుమాన్ సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ…ఈయన చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో మంచి విజయాలను సాధించినప్పటికి హనుమాన్ సినిమాతో మాత్రం ఆయన పాన్ ఇండియాలో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక దాంతో పాటుగా ఇప్పుడు హనుమాన్ సినిమాకి సీక్వెల్ గా జై హనుమాన్ అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో రిషబ్ శెట్టి ని హనుమంతుడిగా చూపించబోతున్నాడు అంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇక వాటిని నిజం చేస్తూ రీసెంట్ గా దానికి సంబంధించిన పిక్ ను రిషబ్ శెట్టి రిలీజ్ చేసి హనుమంతుడు థీమ్ సాంగ్ కూడా రిలీజ్ చేశాడు. ఇక మొత్తానికైతే అవి ప్రేక్షకులను మెప్పించే విధంగా ఉన్నాయి. దాంతో ఆయన ఈ సినిమా మీద భారీ అంచనాలు పెట్టుకోవడమే కాకుండా ఈ సినిమాని ఎలాగైనా సరే సూపర్ సక్సెస్ చేయడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాడు.

అయితే హనుమంతుడి పాత్ర కోసం ఆయన భారీగా విజువల్ ఎఫెక్ట్స్ ను వాడుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక విభీషణుడి పాత్ర నుంచి మనకు హనుమంతుడి పాత్రను ఎలివేట్ చేస్తూ మొదటి పార్ట్ లో చాలా బాగా సింక్ చేస్తూ స్టోరీని అయితే రాసుకున్నాడు. ఇక దాంతోపాటుగా హనుమంతుడు రాముడికి ఇచ్చిన మాట ఏంటి అనే దానిని హైలైట్ చేస్తూ మొదటి పార్ట్ ని ఎండ్ చేశాడు.

ఇక జై హనుమాన్ సినిమాలో దాన్ని కూడా హైలెట్ చేసే విధంగా స్టోరీ రాసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. అలాగే ఈ సినిమా చివర్లో రాముడి పాత్ర కనిపించబోతుంది అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే రాముడి పాత్రను ఏఐ లో క్రియేట్ చేయాలని చూస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక కథ, కథనం లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడట…ఇక ఈ సినిమాలో కొన్ని ఎక్కువ క్యారెక్టర్స్ రావడంతో ఏఐ కి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఉన్న జనరేషన్ లో ఏఐకి చాలా ఇంపార్టెన్స్ అయితే ఉంది. ప్రతి ఒక్కరు ఏఐ తోనే డిఫరెంట్ పాత్రలను క్రియేట్ చేసుకుంటూ వాడుకుంటున్నారు. ఇక ప్రశాంత్ వర్మ కూడా అదే రీతిలో నడుస్తున్నట్టుగా తెలుస్తుంది…

ఇక కన్నడ స్టార్ హీరో అయిన రిషబ్ శెట్టి ని ఈ పాత్ర కోసం ఎంచుకొని తను చాలా మంచి పని చేశారంటూ కొంతమంది సినీ విమర్శకులు సైతం అతన్ని ప్రశంసిస్తున్నారు. ఇక తనకు పాన్ ఇండియా మార్కెట్ ఏర్పడింది. కాబట్టి ఈ సినిమాకి అతను హనుమంతుడిగా సెట్ అవ్వడమే కాకుండా మార్కెట్ పరంగా కూడా ఆయన చాలావరకు హెల్ప్ అవుతారని మరి కొంతమంది కామెంట్స్ చేయడం విశేషం…