https://oktelugu.com/

NTR : ఎన్టీయార్ తో సినిమా చేయాలంటే డైరెక్టర్స్ కి ఘట్స్ ఉండాలి అంటున్న అభిమానులు…కారణం ఏంటి..?

సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అనేది అంత ఈజీగా రాదు. సక్సెస్ ఫుల్ హీరోగా కొనసాగాలంటే మాత్రం అహర్నిశలు కష్టపడాల్సిన అవసరమైతే ఉంది. అలాగే వాళ్లని వాళ్లు చాలా స్ట్రాంగ్ గా ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంది. లేకపోతే మాత్రం సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరు కూడా పట్టించుకునే పరిస్థితి అయితే లేదు. అందుకే స్టార్ హీరోలు వరుస సక్సెస్ లను సాధిస్తూ నెంబర్ వన్ హీరోగా ఎదిగే ప్రయత్నం చేస్తుంటే కుర్ర హీరోలు మాత్రం సక్సెస్ లను సాధిస్తూ వాళ్ళకంటూ ఒక మంచి మార్కెట్ ని క్రియేట్ చేసుకునే ప్రయత్నం లో ఉన్నారు...

Written By:
  • Gopi
  • , Updated On : November 7, 2024 / 10:02 AM IST

    Fans who say that directors should have guts to make a film with NTR...what is the reason..?

    Follow us on

    NTR : తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి తారక రామారావు గారికి ఎనలేని గుర్తింపు అయితే ఉంది. ఇక ఇప్పటికే ఆయన చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో మంచి విజయాలను సాధించడమే కాకుండా తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన హీరోగా కూడా ఆయన మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక ఆయన తర్వాత బాలయ్య బాబుతో పాటు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆ ఫ్యామిలీ బాధ్యతలను తమ భుజాల మీద మోస్తూ ముందుకు దూసుకెళుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం తమదైన రీతిలో సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇప్పటికే ఆయన చేసిన చాలా సినిమాలు మంచి విజయాలను సాధించడమే కాకుండా స్టార్ హీరోగా కూడా ఆయనకు ఒక మంచి గుర్తింపు అయితే వచ్చింది. ఇక రీసెంట్ గా కొరటాల శివ దర్శకత్వంలో ఆయన చేసిన దేవర సినిమా రిలీజ్ అయి ప్రేక్షకుల్లో విశేషమైన స్పందన ను అయితే సంపాదించుకుంది. ఈ సినిమాతో ఎన్టీఆర్ తనదైన రీతిలో సత్తా చాటుకోవాలని చూశాడు. కానీ ఆయన అనుకున్నంత రేంజ్ లో ఈ సినిమా సక్సెస్ అయితే సాధించలేదు. దాంతో ఇప్పుడు ఎన్టీఆర్ ఆచితూచి దర్శకులను ఎంచుకుంటున్నట్టుగా తెలుస్తోంది.

    ఇక ప్రభాస్ లాంటి స్టార్ హీరో ఎంచుకున్న ప్రతి డైరెక్టర్ కూడా తనకు మంచి విజయాన్ని అందిస్తుంటే, ఎన్టీఆర్ ఎంచుకుంటున్న దర్శకులు మాత్రం పెద్దగా అతనికి సక్సెస్ లను అందించలేకపోతున్నారు. ఇక కారణం ఏదైనా కూడా ఇకమీదట ఎన్టీఆర్ తమదైన రీతిలో సినిమాలు చేస్తూ ముందుకు సాగితేనే పాన్ ఇండియాలో భారీ మార్కెట్ అయితే క్రియేట్ అవుతుంది.

    లేకపోతే మాత్రం ఆయన కేవలం తెలుగు సినిమా ఇండస్ట్రీకి మాత్రమే పరిమితం అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఇక ఏది ఏమైనా కూడా జూనియర్ ఎన్టీఆర్ తనదైన రీతిలో సత్తా చాటుతున్నాడు. ఇక ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయాలంటే దర్శకుడికి ఘట్స్ ఉండాలి అంటూ చాలామంది ఎన్టీఆర్ అభిమానులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేయడం విశేషం.

    ఇక ఏది ఏమైనా కూడా ఆయనలాంటి స్టార్ హీరోతో సినిమాలు చేసే దర్శకులు కూడా తమదైన రీతిలో వాళ్ళ సత్తా చాటుకోవాల్సిన అవసరమైతే ఉంది. చూడాలి మరి ఇకమీదట రాబోయే సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు అనేది…