https://oktelugu.com/

Dulquer Salmaan & Nani : దుల్కర్ సల్మాన్, నాని కాంబినేషన్ లో వస్తున్న మల్టీ స్టారర్ మూవీ…డైరెక్టర్ ఎవరంటే..?

సినిమా ఇండస్ట్రీ అనేది ప్రతి ఒక్కరికి సక్సెస్ లను అందివ్వదు. ఎవరైతే ఇక్కడ కష్టపడతారో వాళ్లకి మాత్రమే సక్సెస్ లు దక్కుతూ ఉంటాయి. నిజానికి ఒక సినిమా సక్సెస్ అయింది అంటే దాని వెనక దర్శకుడు పడిన కష్టం ఉంటుంది. అలాగే సినిమా యూనిట్ పెట్టిన ఎఫర్ట్స్ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి... అందుకే ఒక సినిమా కోసం డైరెక్టర్ ఎంతలా కష్టపడతాడో సినిమా యూనిట్ కూడా అదే విధంగా కష్టపడుతూ ఉంటుంది...

Written By:
  • Gopi
  • , Updated On : November 6, 2024 / 03:35 PM IST

    Dulquer Salmaan and Nani's upcoming multi starrer movie...who is the director..?

    Follow us on

    Dulquer Salmaan & Nani : తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు నాని… ఏ సపోర్టు లేకుండా ఇండస్ట్రీకి వచ్చి తనదైన రీతిలో రాణిస్తూ వైవిధ్యమైన కథాంశాలను ఎంచుకుంటూ సక్సెస్ ఫుల్ హీరోగా ముందుకు సాగడమే కాకుండా స్టోరీ సెలెక్షన్ లో కూడా తనదైన రీతిలో మార్పు చూపిస్తూ ముందుకు సాగుతున్న హీరో నాని…నిజానికి నాని గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే అవుతుంది. ఎందుకంటే ఆయన చేస్తున్న వైవిద్య భరితమైన సినిమాలను తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏ యంగ్ హీరో కూడా ట్రై చేయడం లేదు. నిజానికి అలాంటి జానర్ ని ఎంచుకొని సినిమాలు చేయడం అంటే నాని గట్స్ కి సలాం అనే చెప్పాలి. ఇక ఆయన సినిమా సినిమాకి వైవిధ్యాన్ని చూపిస్తూ ముందుకు వెళ్తున్నాడు. హిట్ ప్లాప్ తో సంబంధం లేకుండా ప్రేక్షకుడికి ఏ సినిమా అయితే కావాలో అలాంటి సినిమాలను వాళ్ళకి అందించే ప్రయత్నంలో తను బిజీగా ఉన్నాడు…

    ఇక ఇదిలా ఉంటే మలయాళం సినిమా ఇండస్ట్రీలో మమ్ముట్టి కొడుకుగా మంచి గుర్తింపును సంపాదించుకున్న దుల్కర్ సల్మాన్ తనదైన రీతిలో సినిమాల చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. రీసెంట్ గా తెలుగులో లక్కీ భాస్కర్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. అయితే ఈ ఇద్దరు కాంబినేషన్ లో ఒక మల్టీస్టారర్ సినిమా చేయాలని దర్శకుడు వెంకీ అట్లూరి ప్రణాళికలు రూపొందిస్తున్నట్టుగా తెలుస్తుంది.

    మరి వీళ్ళిద్దరి కాంబోలో ఈ సినిమా వర్కౌట్ అయితే మాత్రం ఈ సినిమాకి పాన్ ఇండియాలో భారీ రేంజ్ లో క్రేజ్ అయితే దక్కుతుంది. ఒకవేళ ఈ సినిమాని కనక వీళ్ళు చేసి సూపర్ సక్సెస్ సాధిస్తే ఇక వీళ్ళ కెరియర్ కి తిరుగు ఉండదనే చెప్పాలి. ఇప్పటికే ఈ ఇద్దరికీ పాన్ ఇండియా లో మంచి ఫ్యాన్స్ అయితే ఉన్నారు. మరి ఆ ఫ్యాన్ బేస్ ని క్యాష్ చేసుకుంటూ వీళ్ళు ముందుకు సాగుతారా లేదా అనే విషయాలు తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

    నాని లాంటి యంగ్ హీరో ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే వీళ్ళ కాంబినేషన్ లో ‘దసర’ సినిమా వచ్చింది. ఆ సినిమా మంచి విజయాన్ని సాధించడంతో నాని శ్రీకాంత్ ఓదెలకి మరోసారి అవకాశం ఇచ్చాడు… చూడాలి మరి దుల్కర్ సల్మాన్ నాని కాంబినేషన్ లో సినిమా వర్కౌట్ అవుతుందా లేదా అనేది…