https://oktelugu.com/

Ghati : ‘ఘాటి’ గ్లింప్స్ లో అనుష్క చేసిన ఆ ఒక్కటి అతిగా అనిపిస్తుందా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు ఉన్నప్పటికి ఇక్కడ కొంతమందికి మాత్రమే మంచి గుర్తింపు అయితే ఉంటుంది. ముఖ్యంగా అనుష్క లాంటి హీరోయిన్ కి తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎప్పుడు నీరాజనాలు పడుతూనే ఉంటుంది. ఆమె నుంచి ఒక సినిమా వచ్చిందంటే చాలు ఆ సినిమా కోసం యావత్ తెలుగు సినిమా అభిమానులందరు ఎదురుచూస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు ఆమె ఘాటి సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది...

Written By:
  • Gopi
  • , Updated On : November 8, 2024 / 10:10 AM IST

    Does Anushka's look in Glimpses of 'Ghati' seem too much?

    Follow us on

    Ghati : తెలుగు సినిమా ఇండస్ట్రీలో అనుష్కకి చాలా మంచి క్రేజ్ అయితే ఉంది. ఆమె క్రేజ్ ని వాడుకుంటూ తమదైన రీతిలో సినిమాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతుంది. అయితే హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలకు క్రేజ్ తీసుకొచ్చింది మాత్రం అనుష్క అనే చెప్పాలి. ఈ జనరేషన్ లో ఇలాంటి సినిమాలను చేసే ఏకైక హీరోయిన్ కూడా తనే కావడం విశేషం… అరుంధతి సినిమాతో పెను ప్రభంజనాన్ని సృష్టించిన ఆమె ఇప్పుడు క్రిష్ డైరెక్షన్ లో ‘ఘాటి ‘ అనే సినిమాతో మరోసారి సంచలనాన్ని క్రియేట్ చేయడానికి వస్తుంది. ఇక ఇప్పటికే క్రిష్ డైరెక్షన్ లో నటిస్తున్న ఈమె ఈ సినిమాలో వేశ్యగా నటించిన అనుష్క ఇప్పుడు మరోసారి ఆయన డైరెక్షన్ లోనే హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా చేస్తూ ప్రేక్షకులందరికి ఆనందాన్ని పంచడానికి సిద్ధమవుతుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి ఒక గ్లింప్స్ ను రిలీజ్ చేశారు… ఈ గ్లింప్స్ లో అనుష్క చాలా కూల్ గా కనిపించడమే కాకుండా గాంజా కొడుతూ వైల్డ్ ఉమెన్ గా మనకు కనిపించింది.

    అలాగే రౌడీలను కొడుతూ వాళ్ళ తలని కోసి మరి చేతిలో పట్టుకొని వస్తున్న ఒక విజువల్ అయితే గ్లింప్స్ మొత్తానికి హైలైట్ గా నిలిచిందనే చెప్పాలి… మరి అనుష్కకి బాహుబలి సినిమా తర్వాత అంత మంచి సక్సెస్ అయితే రాలేదు. ఇక ఈ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకోవాలని అటు అనుష్క, ఇటు క్రిష్ ఇద్దరు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.

    అలాగే క్రిష్ కూడా ‘హరిహర విరమల్లు’ సినిమా నుంచి తప్పుకున్న తర్వాత ఆయనకి ప్రస్టేజియస్ ఇష్యూ అయితే ఏర్పడింది. ఈ సినిమాతో కనక సక్సెస్ సాధిస్తేనే ఆయనకు భారీ క్రేజ్ అయితే ఉంటుంది. లేకపోతే మాత్రం భారీగా మైనస్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయంటూ పలువురు సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…ఇక ఏది ఏమైనా కూడా అనుష్క ఒక రెబల్ లేడీగా ఈ సినిమాలో కనిపించబోతుందని మనకు గ్లింప్స్ లో హింట్ అయితే ఇచ్చారు…

    ఇక అంతా బానే ఉన్నప్పటికి ఈ గ్లింప్స్ లో అనుష్క విలన్ తలను నరికి చేతిలో పట్టుకొని రావడం అనేది కొంతవరకు అతిగా అనిపించిందని విమర్శకులు ఈ సినిమా గ్లింప్స్ మీద విమర్శలైతే చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా మాత్రం అటు క్రిష్ కి ఇటు అనుష్క ఇద్దరికి కూడా టర్నింగ్ పాయింట్ గా మారాలని కోరుకుందాం…