https://oktelugu.com/

RGV & Sandeep Vanga : ఆర్జీవీ కి సందీప్ వంగ అంటే ఎందుకు ఇష్టమో తెలుసా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీ దశ దిశను మార్చిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఆయన చేసిన సినిమాలు మంచి విల్మ్యాలను సాధించాయి. ఇక నాగార్జున ను స్టార్ హీరోగా మార్చిన ఘనత కూడా తనకే దక్కుతుంది. ఎందుకంటే అప్పటివరకు నాగార్జున హీరోగా పనికిరాడు అని అందరూ అనుకున్నారు. కానీ వర్మ మాత్రం అతన్ని స్టార్ హీరోగా చేసి చూపించాడు. ఇక ఏది ఏమైనా కూడా వర్మ ఇన్స్పిరేషన్ తో చాలామంది ఇండస్ట్రీకి వచ్చారు...

Written By:
  • Gopi
  • , Updated On : November 9, 2024 / 02:04 PM IST

    Do you know why RGV likes Sandeep Vanga?

    Follow us on

    RGV & Sandeep Vanga : శివ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో పెను ప్రభంజనాలను సృష్టించాడు. సినిమా అనేది ఎలా ఉండాలి అనే ఒక ఫార్మాట్ ను సెట్ చేసిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ… ఆయన తెలుగులోనే కాకుండా బాలీవుడ్ లో కూడా చాలా సినిమాలను చేసి మంచి విజయాలను అందుకున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా ఆయన తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకోవడంలో చాలా వరకు సక్సెస్ సాధిస్తూ వచ్చాడు. ఇక ఇదిలా ఉంటే ఆయన చేసే ప్రతి సినిమా ప్రేక్షకులలో విపరీతమైన హైప్ ని క్రియేట్ చేసుకుంటూ వచ్చేది. కానీ ఇప్పుడు ఆయనకు నచ్చిన సినిమాలను చేసుకుంటూ ప్రేక్షకులను పట్టించుకోకుండా ముందుకు సాగుతున్నాడు… ఇక ఇదిలా ఉంటే ఆయన అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది. ఇక సందీప్ రెడ్డి వంగ లాంటి దర్శకుడు సైతం ఆర్జీవిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ముందుకు సాగిన విషయం మనకు తెలిసిందే. కానీ ఆర్జీవీ కి మాత్రం కొంతమంది నచ్చుతుంటారు.

    అందులో సందీప్ రెడ్డివంగా ఒకరు. నిజానికి వర్మకి సందీప్ రెడ్డివంగ ఎందుకు నచ్చాడనే విషయం మీద చాలాసార్లు ఆయన క్లారిటీ అయితే ఇచ్చాడు. ఎందుకు సందీప్ వంగ అంటే వర్మకి ఇష్టం అంటే సందీప్ తను చెప్పాలనుకున్నది చాలా హానెస్ట్ గా చెప్పే ప్రయత్నం చేస్తాడని ఎవరికి భయపడడు అసలు సొసైటీ గురించి ఆలోచించడు.

    తను ఏ పాయింట్ అయితే ఎత్తుకున్నాడో దానికి న్యాయం చేయడానికి ఆయన అహర్నిశలు కష్టపడుతూ ఉంటాడని వర్మ చెప్పడం విశేషం…ఇక ఏది ఏమైనా కూడా సందీప్ రెడ్డి వంగ లాంటి దర్శకుడు ఇండియన్ ఇండస్ట్రీని షేక్ చేస్తాడని కూడా తను చాలా సార్లు చెప్పాడు. ఇక ఫ్యూచర్లో సందీప్ వంగ లాంటి దర్శకుడు ఇంకెన్ని మ్యాజికులు చేస్తాడనే విషయం మీద కూడా సరైన క్లారిటీ రావాల్సి ఉంది.

    ఇప్పటికే అర్జున్ రెడ్డి, అనిమల్ సినిమాలతో పెను ప్రభంజనాలను సృష్టించిన ఈ దర్శకుడు ఇక రాబోయే రోజుల్లో పెను విధ్వంసాలను సృష్టించడానికి కూడా రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఆయన ప్రభాస్ తో చేస్తున్న స్పిరిట్ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. చూడాలి మరి సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ తో చేస్తున్న స్పిరిట్ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తుంది. తద్వారా తను ప్రభాస్ కి ఎలాంటి సక్సెస్ ని కట్టబెడతాడు అనేది…