https://oktelugu.com/

Rajamouli : రాజమౌళి సినిమాలో అవకాశం కోసం గత 10 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న తమిళ్ స్టార్ హీరో ఎవరో తెలుసా..?

ప్రస్తుతం తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళుతున్న దర్శకుడు రాజమౌళి... ఈయన సినిమాల్లో విలనిజం భారీ రేంజ్ లో ఉంటుంది. ఇక దానికి మించి హీరోయిజం ఉన్నప్పుడే అది వర్కౌట్ అవుతుందనే ఉద్దేశ్యంతో మొదట ఆయన విలన్ ను చాలా భారీ ఎత్తున చూపిస్తూ ఉంటాడు. ఇక దాంతో విలనిజమే కాకుండా అలాంటి విలన్ ని కొట్టినప్పుడే హీరోయిజం కూడా భారీగా ఎలివేట్ అవుతుందని రాజమౌళి తరచుగా చెబుతూ ఉంటాడు...

Written By:
  • Gopi
  • , Updated On : November 5, 2024 / 04:56 PM IST

    Do you know who is the Tamil star hero who has been waiting for an opportunity in Rajamouli's film for the last 10 years..?

    Follow us on

    Rajamouli : ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో దర్శక ధీరుడిగా తనకంటూ ఒక మార్క్ ని క్రియేట్ చేసుకున్న డైరెక్టర్ రాజమౌళి… ఆయన చేసిన ‘స్టూడెంట్ నెంబర్ వన్’ సినిమా నుంచి ‘త్రిబుల్ ఆర్’ సినిమా వరకు ఏ ఒక్క సినిమా కూడా ప్లాప్ అవ్వకుండా అన్ని సినిమాలు వరుసగా విజయాలను సాధించడం అనేది నిజంగా ఒక గొప్ప విషయమనే చెప్పాలి.ఇక కెరియర్ మొదట్లో మాస్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఆయన ఇప్పుడు మాత్రం హైలీ గ్రాఫిక్స్ ఓరియెంటెడ్ సినిమాకి పెద్ద పీట వేస్తూ ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేయడంలో ఎప్పుడు సక్సెస్ అవుతూనే ఉన్నాడు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆయన పాన్ వరల్డ్ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ‘జేమ్స్ కామెరూన్’ లాంటి దిగ్గజ దర్శకులు సైతం తన ప్రతిభను చూసి మెచ్చుకోవాలనే ఉద్దేశ్యంతో ఒక భారీ సినిమాకి తెర లేపుతున్నాడు. ఇక అందులో భాగంగానే మహేష్ బాబు హీరోగా ఈ సినిమా ఎంటైర్ వరల్డ్ లో 3000 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబడుతుందనే అంచనాలో రాజమౌళి అయితే ఉన్నాడు. ఇక ఈ సినిమా కోసం దాదాపు 1200 కోట్ల వరకు బడ్జెట్ ను కేటాయిస్తున్నట్టుగా తెలుస్తోంది.

    ఇక రాజమౌళి సినిమాలో హై ఎలివేషన్స్ ఏవిధంగా ఉంటాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ సినిమాలో కూడా అలాంటి ఎలివేషన్స్ తో కూడిన ఎమోషన్స్ కూడా భారీ లెవెల్లో ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది… ఇక ఇదిలా ఉంటే రాజమౌళి సినిమాలో నటించడానికి తమిళ్ స్టార్ హీరో అయిన కమల్ హాసన్ 10 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాడట.

    కానీ రాజమౌళి మాత్రం కమల్ హాసన్ కి సరిపడా కథను చెప్పడంలో గాని ఆయనతో సినిమా చేయడంలో గాని పెద్దగా ఇంట్రెస్ట్ అయితే చూపించడం లేదు. ఇక ఎట్టకేలకు పాన్ వరల్డ్ సినిమా చేస్తున్న రాజమౌళితో కమల్ హాసన్ తనకు సరిపడా పాత్ర ఉంటే చెప్పండి నేను చేస్తానని రాజమౌళితో చెప్పారట… ఈ దాంతో ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ కోసం కమల్ హాసన్ ను తీసుకోవాలనే ఉద్దేశ్యంలో ఉన్నాడట.

    ఇక రీసెంట్ గా కల్కి సినిమాతో విలనిజాన్ని పండించిన కమల్ హాసన్ ఈ సినిమాలో కనక చేస్తే పాన్ వరల్డ్ లో మంచి గుర్తింపైతే సంపాదించుకుంటాడు. మరి ఈ సినిమాలో రాజమౌళి కమల్ హాసన్ ను తీసుకుంటాడా లేదా అనేది ఇప్పుడు తెలియాల్సిన అవసరం అయితే ఉంది…