Ghajini : తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న నిర్మాతలు చాలామంది ఉన్నారు. తమదైన రీతిలో సత్తా చాటుతూ ముందుకు దూసుకెళ్తున్న ప్రొడ్యూసర్లు ఉన్నప్పటికి ఒకప్పుడు వరుస బ్లాక్ బాస్టర్ సక్సెస్ లను అందుకుంటూ ఇండస్ట్రీలో టాప్ ప్రొడ్యూసర్లు గా ఎదిగి అప్పటినుంచి ఇప్పటివరకు వరుస సినిమాలను చేసుకుంటూ వస్తున్న ఏకైక ప్రొడ్యూసర్ అల్లు అరవింద్…ఈయన తెలుగులో చాలా సినిమాలు చేశాడు. ముఖ్యంగా చిరంజీవి, పవన్ కళ్యాణ్ లతో ఎక్కువ సినిమాలను చేయడమే కాకుండా అల్లు అర్జున్ తో కూడా భారీ సినిమాలను తీశాడు.
ఇక ఇదిలా ఉంటే రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వచ్చిన మగధీర సినిమాని కూడా ఇతనే ప్రొడ్యూస్ చేయడం విశేషం…ఇక ఏది ఏమైనా కూడా అల్లు అరవింద్ స్టార్ ప్రొడ్యూసర్ గా మారడానికి చాలా కసరత్తులైతే చేశాడు. ఇక అందులో భాగంగానే తమదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఈయన 2005వ సంవత్సరంలో సూర్య హీరోగా వచ్చిన గజిని సినిమాని తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశాడు. ఇక ఈ సినిమా ఈయనకి చాలా మంచి ప్రాఫిట్స్ ని తీసుకొచ్చిందనే చెప్పాలి.
కేవలం 30 లక్షలకు కొనుగోలు చేసిన ఈ సినిమా 5 కోట్ల వరకు కలెక్షన్లను రాబట్టడమే కాకుండా అల్లు అరవింద్ స్టార్ ప్రొడ్యూసర్ అని గుర్తు చేయడంలో ఈ సినిమా మరోసారి కీలకపాత్ర వహించిందన చెప్పాలి. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో అల్లు అరవింద్ తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా ఆయన కంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఇక మొత్తానికైతే ఈ సినిమా ద్వారా అల్లు అరవింద్ తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు.
ఇక ఇదేవిధంగా 2008వ సంవత్సరంలో ఈ సినిమాని మురుగదాస్ డైరెక్షన్ లోనే బాలీవుడ్ లో గజిని పేరుతోనే రీమేక్ చేయించాడు. ఇక అమీర్ ఖాన్ హీరోగా చేసిన ఈ సినిమా భారీ సక్సెస్ ని సాధించింది. అక్కడ కూడా ఈ సినిమాకు అల్లు అరవింద్ వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ గా కొనసాగడం విశేషం…ఇక ఏది ఏమైనా కూడా సూర్యకు తెలుగులో మంచి గుర్తింపుని తీసుకొచ్చిన సినిమా కూడా ఇదే కావడం విశేషం…