https://oktelugu.com/

NTR : ఎన్టీయార్ తో 11 సంవత్సరాల వరకు మాట్లాడని ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా..?

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక సపరేట్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవడానికి చాలా రకాలుగా కష్టపడుతున్నారు. అయితే సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరోలు ఎప్పటికప్పుడు వారిని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది...లేకపోతే మాత్రం కాలగర్భంలో లో కలిసిపోతారు...

Written By:
  • Gopi
  • , Updated On : November 1, 2024 / 11:44 AM IST

    Do you know who is that star hero who did not talk to NTR for 11 years..?

    Follow us on

    NTR : తెలుగు సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ కి చాలా మంచి క్రేజ్ అయితే ఉంది. ఆయన చేసిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా నుంచి రీసెంట్ గా వచ్చిన ‘దేవర’ సినిమా వరకు ప్రతి సినిమాలో తనకంటూ ఒక స్టైల్ ను ఏర్పాటు చేసుకోవడంలో ఆయన ఎప్పటికప్పుడు సక్సెస్ అవుతూనే వచ్చాడు. డ్యాన్స్ లు వేయడం లో గానీ, డైలాగులు చెప్పడంలో గానీ ఆయనను మించిన వారు మరెవరు లేరు అనేది ఆయన్ని చూస్తే చాలా స్పష్టంగా తెలుస్తోంది… ఇక ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ హరికృష్ణ రెండోవ భార్య కొడుకు కావడం వల్ల ఆయన చిన్నతనం లో ఎక్కువగా నందమూరి ఫ్యామిలీతో కలిసేవాడు కాదు. ఎన్టీయార్ తన తల్లితోనే ఉంటూ చదువుకుంటూ డాన్సులు నేర్చుకునేవాడు. అలా చాలా చాలా సంవత్సరాల పాటు కల్చరల్ ఆక్టివిటీస్ లో పాల్గొంటూ వచ్చేవాడు. ఇక చిన్నప్పటి నుంచి హైపర్ ఆక్టివ్ గా ఉండేవాడు. ఇక ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ తో వాళ్ళ తాత అయిన సీనియర్ ఎన్టీఆర్ మాట్లాడడానికి 11 సంవత్సరాల సమయం అయితే పట్టిందట. ఆ మధ్యలో తను ఎప్పుడు వెళ్లినా కూడా సీనియర్ ఎన్టీఆర్ మాట్లాడేవాడు కాదని ఒక రోజు తనే పిలిపించుకొని మరి తనతో మాట్లాడి తన పేరుని కూడా ఎన్టీఆర్ అని పెట్టారని ఇప్పుడు చాలామంది చాలాసార్లు చెబుతూనే వస్తున్నారు…

    చిన్నతనంలో వాళ్ళ తాత అయిన సీనియర్ ఎన్టీఆర్ ఒక్క సారి మాట్లాడితే బాగుండేది అని చాలా సార్లు జూనియర్ ఎన్టీఆర్ బాధపడ్డట్టుగా కూడా వాళ్ళమ్మ ఒకానొక సందర్భంలో తెలియజేసింది. ఇక మొత్తానికైతే ఇప్పుడు సీనియర్ ఎన్టీఆర్ లెగసీని ముందుకు తీసుకెళ్లడంలో జూనియర్ ఎన్టీఆర్ చాలా వరకు కృషి చేస్తున్నాడు. నందమూరి ఫ్యామిలీ లో ఉన్న హీరోలు ఎవరు అంత పెద్దగా రాణించకపోవడంతో ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ నందమూరి ఫ్యామిలీ బాధ్యతలను మోస్తున్నట్టుగా తెలుస్తుంది.

    ఇక ఏది ఏమైనా కూడా ఆయన లేకపోతే నందమూరి ఫ్యామిలీ ఇంత చురుగ్గా సినిమాలు చేసేది కాదనేది వాస్తవం…ఇక బాలయ్య బాబు సినిమాలు చేస్తున్నప్పటికి ఆయన తరం ముగిసిపోయింది. కాబట్టి ప్రస్తుతం ఉన్న హీరోలు ఎవరు నందమూరి ఫ్యామిలీ నుంచి అంత బాగా రాణించకపోవడంతో ఎన్టీఆర్ మీద ఈ బాధ్యతలైతే పెట్టడం జరిగింది.

    మరి మొత్తానికైతే నందమూరి ఫ్యామిలీ మెంబర్స్ మధ్య చిన్న చిన్న గొడవలు వస్తున్నప్పటికి నందమూరి అభిమానులు మాత్రం వీళ్ళందరి సినిమాలను ఆదరించడానికి రెడీగా ఉన్నారు… ఇక ఏది ఏమైనా కూడా ఎన్టీయార్ లాంటి నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండటం నిజంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టమనే చెప్పాలి…