https://oktelugu.com/

Ka : క సినిమాలో చూపింన సాయంత్రం ఎరుగని చిఊరు ఎక్కడుందో తెలుసా..?దాన్ని బేస్ చేసుకొనే దర్శకులు ఈ కథ రాసుకున్నారా..?..

సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే వాళ్ళు చేస్తున్న సినిమాలన్నీ మంచి విజయాలను సాధించడమే కాకుండా వాళ్లకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా సంపాదించుకుంటున్నారు.

Written By:
  • Gopi
  • , Updated On : November 4, 2024 / 08:50 AM IST

    Do you know where the evening Erugani Uru shown in the movie is? Did the directors who based it write this story..?..

    Follow us on

    Ka : తెలుగు సినిమా ఇండస్ట్రీలో కిరణ్ అబ్బవరం తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక ప్రస్తుతం ఆయన చేసిన ఆ సినిమా ప్రేక్షకులందరిని మెప్పించడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా సంపాదించి పెడుతుంది. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న సినిమాల మీద ప్రేక్షకుల్లో ఇప్పుడిప్పుడే మంచి అంచనాలైతే ఏర్పడుతున్నాయి. ఇకమీదట ఆయన చేయబోయే సినిమాలు కూడా మంచి సక్సెస్ లను సాధిస్తే ఆయన చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరో రేంజ్ కి వెళ్ళిపోతారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇదిలా ఉంటే ‘క ‘ సినిమా మంచి వసూళ్లను రాబడుతూ బ్లాక్ బాస్టర్ హిట్టుగా ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో భారీ కలెక్షన్లు రాబట్టాలని కిరణ్ అబ్బవరం ముందు నుంచే చాలా ప్రీ ప్లాన్డ్ గా ఈ సినిమాని కావాలనే దీపావళికి రిలీజ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో కనక 100 కోట్ల కలెక్షన్లు రాబడితే మాత్రం కిరణ్ అబ్బవరం కి ఇక తిరుగు ఉండదనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే ఆ సినిమాలో క్రిష్ణగిరి అనే ఊర్లో నాలుగు దిక్కుల కొండలు ఉండి ఆ ఊరు మధ్యలో ఉండటం వల్ల మధ్యాహ్నం మూడు గంటలకే చీకటి పడిపోతుంది ఇక వీళ్లకు ఈవినింగ్ అనేది ఉండదు.

    అయితే ఈ సినిమాలో చూసినప్పుడు ఆ ఊరు భలే ఉందే అని అనిపించినప్పటికి నిజంగా అలాంటి ఊరు ఉంటుందా అని కొంతమంది ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. కానీ ఆ సినిమాలు చూపించినటువంటి ఊరు తెలంగాణలో ఉందనే విషయం చాలామందికి తెలియదు.

    నిజానికి తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లాకి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొదురుపాక అనే గ్రామంలో 4 దిక్కుల కొండలు ఉండడం వల్ల వాళ్లకు మూడు గంటలకే చీకటి అయిపోతుంది. దీన్ని మూడు జాముల కొదురుపాక అని కూడా అంటారు. ఇక ఏది ఏమైనప్పటికి ఈ ఊరును చూడటం వల్లే ఆ దర్శకుడికి ఇలాంటి ఒక కాన్సెప్ట్ ని తీసుకోవాలనే ఆలోచన వచ్చినట్టుగా కూడా తెలుస్తోంది.

    ఇక ఏది ఏమైనా కూడా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఒక ఊరిని ఈ సినిమా కోసం వాడుకోవడం అనేది నిజంగా చాలా మంచి విషయమనే చెప్పాలి…ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా లాంగ్ రన్ లో ఎంత కలెక్ట్ చేస్తుందనే విషయాల మీద సరైన క్లారిటీ అయితే రావడం లేదు. ఇక నాలుగు రోజులు గడిస్తే గాని ఈ సినిమా కలెక్షన్స్ ఎంత వసూలు చేస్తుంది అనేది క్లారిటీగా తెలుస్తుంది…