Telugu News » Photos » Cinema Photos » Do you know what evergreen movies prabhas likes prabhas is a big fan of that hero
Prabhas : ప్రభాస్ కి నచ్చిన ఎవర్ గ్రీన్ సినిమాలు ఏంటో తెలుసా..? ఆ హీరో కి ప్రభాస్ వీరాభిమాని…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు. అయినప్పటికి కొంతమందికి మాత్రమే ఇక్కడ స్టార్ ఇమేజ్ అయితే దక్కుతుంది. ముఖ్యంగా ప్రభాస్ లాంటి హీరో ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీని ఏలుతున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పటికే ఆయన సినిమాలతో పెను ప్రభంజనాన్ని సృష్టిస్తూ బాలీవుడ్ హీరోలకు సైతం చెమటలు పట్టిస్తున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా వాళ్లను మించిన నటులు ఎవరూ లేరు అని విర్రవీగిన బాలీవుడ్ హీరోలకు చెక్ పెట్టడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి...
Prabhas : తెలుగు సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా ముందుకు దూసుకెళుతున్న నటుడు ప్రభాస్… తనదైన రీతిలో సత్తాను చాటుతున్నాడు. ఇప్పటికే ఆయన చేసిన సినిమాలన్నీ పాన్ ఇండియాలో భారీ సక్సెస్ లను సాధిస్తున్న నేపధ్యం లో ఇకమీదట తనను తాను మరొకసారి స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక ఏది ఏమైనా కూడా తనను మించిన నటుడు మరొకరు లేరు అనెంతలా గుర్తింపు పొందుతున్న ఆయన ఇప్పుడు ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్నాడనే చెప్పాలి. ముఖ్యంగా ఆయన నుంచి ఒక సినిమా వస్తుంది అంటే చాలు ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క అభిమాని అతని సినిమా కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఒక సంవత్సరం గ్యాప్ లోనే రెండు భారీ సక్సెస్ లను అందుకున్న ఏకైక హీరోగా కూడా ప్రభాస్ ప్రస్తుతం సరి కొత్త రికార్డును క్రియేట్ చేశాడనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే ప్రభాస్ కి నచ్చిన సినిమాలు ఏంటి అనే దానిమీద కొన్ని ఆసక్తికరమైన చర్చలైతే నడుస్తున్నాయి.
నిజానికి సోషల్ మీడియా వేదికగా ఈ న్యూస్ మీద భారీ కథనాలు అయితే వెలువడుతున్నాయి. ఇక అసలు విషయానికి వస్తే వాళ్ల పెదనాన్న ఆయన కృష్ణంరాజు నటించిన ‘ భక్త కన్నప్ప ‘, ‘కటకటాల రుద్రయ్య’ అనే రెండు సినిమాలు అంటే ఆయనకి చాలా ఇష్టమట. అందుకే ఈ రెండు సినిమాలు ఆయన తరచుగా చూస్తూ ఉంటాడట.
ఇక ముఖ్యంగా ఈ రెండు సినిమాలు కూడా క్లాసిక్ సినిమాలు గా మిగిలిపోవడం అనేది గొప్ప విషయమనే చెప్పాలి. ఇక ప్రభాస్ ఎప్పుడు లో గా ఫీల్ అయిన కూడా ఈ సినిమాలను చూస్తూ హై ఫీల్ ని పొందుతారట. ముఖ్యంగా వాళ్ళ పెదనాన్న యాక్టింగ్ అంటే ప్రభాస్ కి చాలా ఇష్టమని చాలా సందర్భాల్లో తెలియజేశాడు. అలాగే కృష్ణం రాజు గారే తన అభిమాన హీరో అని కూడా చాలా సందర్భాల్లో తెలియజేశాడు.. అందువల్లే ఆయన సినిమాలు చూస్తు ఆక్టీవ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. అలాగే ఆయన సినిమాలు చూసినంత సేపు ప్రభాస్ పులకించి పోతాడంటూ చెప్పడం విశేషం…
ఇక ఏది ఏమైనా కూడా ప్రభాస్ లాంటి ఒక స్టార్ హీరో ప్రస్తుతం వరుస సినిమాలు చేయడం తద్వారా భారీ సక్సెస్ ని సాధించడం అనేది నిజంగా చాలా మంచి విషయమనే చెప్పాలి. మరి ఇప్పుడు ఆయన చేస్తున్న రాజాసాబ్, ఫౌజీ, స్పిరిట్ సినిమాలు వరుసగా సక్సెస్ లను అందుకోవడానికి బాక్సాఫీస్ మీద దండయాత్ర చేయడానికి సిద్ధమవుతున్నాయి…