https://oktelugu.com/

Ghajini : గజిని సినిమాను బాలీవుడ్ లో సూపర్ హిట్ చేయడానికి అల్లు అరవింద్ ఏం చేశాడో తెలుసా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న నటులు చాలామంది ఉన్నారు. ఇక ప్రొడ్యూసర్లు తమదైన రీతిలో సినిమాలు చేస్తూ సక్సెస్ లను సాధించిన వారు ఉన్నారు. అలాగే టాప్ ప్రొడ్యూసర్లుగా ఎదిగిన వారు ఉన్నారు. ఇండస్ట్రీ కలిసి రాక ఇండస్ట్రీ నుంచి ఫెయిడ్ ఔట్ అయిపోయిన ప్రొడ్యూసర్లు కూడా ఉన్నారు...

Written By:
  • Gopi
  • , Updated On : November 9, 2024 / 09:10 AM IST

    Do you know what Allu Aravind did to make Ghajini a super hit in Bollywood?

    Follow us on

    Ghajini : తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నిర్మాత అల్లు అరవింద్… ఈయన తెలుగులో చిరంజీవితో భారీ సినిమాలను నిర్మించి సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక తమిళ్ సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అయిన సినిమాలను తెలుగులో డబ్ చేసి మంచి విజయాలుగా మార్చిన ఘనత కూడా ఇతనికే దక్కుతుంది. ముఖ్యంగా సూర్య హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన ‘గజినీ’ సినిమాని తెలుగులో డబ్ చేసి భారీ లాభాలను మూటగట్టుకున్నాడు. అలాగే ఈ సినిమాని తమిళంలో ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో అమీర్ ఖాన్ ను హీరోగా పెట్టి గజినీ పేరుతోనే రీమేక్ చేసి సూపర్ సక్సెస్ ని అందుకోవడమే కాకుండా భారీ లాభాలను కూడా కొల్లగొట్టాడు. ఈ సినిమా ను సక్సెస్ చేయడానికి అల్లు అరవింద్ చాలా రకాలుగా ప్రయత్నాలైతే చేసినట్టుగా తెలుస్తోంది. అవి ఏంటి అంటే ముందుగా ఈ సినిమా కథని అనుకున్నప్పుడు ఇందులో షారుఖాన్ని తీసుకోవాలని దర్శకుడు ఏఆర్ మురుదాస్ అనుకున్నారట.

    కానీ షారుక్ ఖాన్ అయితే ఈ కథ ఆయనకి సరిగ్గా సరిపోదని అనేర్ ఖాన్ అయితేనే ఈ కథ అతనికి చాలా బాగా సెట్ అవుతుందని ఆయన అయితేనే చాలా డెడికేటెడ్ గా వర్క్ చేస్తారనే ఉద్దేశ్యంతో అల్లు అరవింద్ పట్టుబట్టి మరి అమీర్ ఖాన్ తో ఈ సినిమా చేయించాడు. ఇక మొత్తానికైతే అమీర్ ఖాన్ ఒక క్యారెక్టర్ ని ఒప్పుకున్నాడు అంటే ఆ క్యారెక్టర్ కోసం ఎంత వరకైనా వెళ్తాడు.

    అంత డెడికేషన్ తో వర్క్ చేస్తాడు కాబట్టే ఆయనకు ప్రేక్షకుల్లో అంత మంచి గుర్తింపు అయితే ఉంటుంది. అల్లు అరవింద్ హీరోని సెట్ చేయడమే కాకుండా ఆ సినిమాకు సంబంధించిన కొన్ని మార్పులు చేర్పులను కూడా తనే సూచించినట్టుగా తెలుస్తోంది. మరి ఆ మార్పులు చేసిన మురుగదాస్ ఈ సినిమాను చేసి సక్సెస్ ఫుల్ గా నిలపడంలో తను కూడా చాలా కీలకపాత్ర వహించాడు.

    ఇక మొత్తానికైతే భారీ లాభాలను మూటగట్టుకున్న అల్లు అరవింద్ ఈ సినిమాతో డబ్బులు ఎక్కువగా సంపాదించి ఆ డబ్బులతో రామ్ చరణ్ హీరోగా వచ్చిన మగధీర సినిమా మీద పెట్టుబడులు పెట్టాడు. ఈ సినిమా కూడా దాదాపు 100 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. కాబట్టి అతనికి వరుసగా బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ ఫుల్ సినిమాలు రావడంతో మరోసారి తనను తాను టాప్ ప్రొడ్యూసర్ గా ఎలివేట్ చేసుకున్నాడు…