https://oktelugu.com/

Vijay Devarakonda : విజయ్ దేవరకొండ కి కెజీఎఫ్ కి ఉన్న సంబంధం ఏంటో తెలుసా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళని వాళ్ళు స్టార్ హీరోలుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. కొంతమంది హీరోలు వాళ్ళని వాళ్ళు ఎలివేట్ చేసుకుంటూ ముందుకు సాగుతుంటే మరి కొంతమంది మాత్రం సక్సెస్ సాధించలేక ఢీలా పడిపోతున్నారు... ఇక ఏది ఏమైనా కూడా వాళ్ళని వాళ్ళు స్టార్ హీరోలుగా ఎస్టాబ్లిష్ చేసుకున్నప్పుడే సినిమా ఇండస్ట్రీలో వాళ్లు నిలబడగలుగుతారు లేకపోతే మాత్రం చాలా కష్టమనే చెప్పాలి...

Written By:
  • Gopi
  • , Updated On : November 5, 2024 / 08:33 AM IST

    Do you know the relationship of Vijay Devarakonda with KGF..?

    Follow us on

    Vijay Devarakonda : తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు విజయ్ దేవరకొండ… అర్జున్ రెడ్డి సినిమాతో తనకంటూ ఉన్న ఇమేజ్ ను ఒక్కసారిగా పెంచుకున్న ఈయన తనదైన రీతిలో సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఎప్పుడైతే అర్జున్ రెడ్డి సినిమా వచ్చిందో అప్పటినుంచి ఈయన ఇమేజ్ తారా స్థాయికి వెళ్లిపోయిందనే చెప్పాలి…అప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం ఒక మూస ధోరణిలో వెళ్తుంటే అర్జున్ రెడ్డి సినిమాతో బోల్డ్ కంటెంట్ తో కూడా సూపర్ హిట్ సాధించవచ్చని ప్రూవ్ చేసిన విజయ్ దేవరకొండ లాంటి నటుడు ఇండస్ట్రీలో మరొకరు లేరనే చెప్పాలి… ఇక ఇప్పటికే ఆయన చాలా సినిమాల్లో తనకంటూ ఒక పర్ఫామెన్స్ ని అందిస్తూ తనను తాను సినిమా ఇండస్ట్రీలో ఎలివేట్ చేసుకుంటూ వస్తున్నాడు. లైగర్ సినిమాతో పాన్ ఇండియా సబ్జెక్టును ఎంచుకున్న ఆయన ఆ సినిమా డిజాస్టర్ అవ్వడంతో ఒకసారిగా పాతాళానికి పడిపోయాడు. మరి మొత్తానికైతే ఇప్పుడు వరుసగా ప్లాప్ లను మూటగట్టుకుంటున్న విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో చేస్తున్న సినిమాతో భారీ సక్సెస్ ని సాధించాలని చూస్తున్నాడు…

    రీసెంట్ గా ఈ సినిమా ప్రొడ్యూసర్ అయిన నాగ వంశీ మాట్లాడుతూ విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి కాంబోలో వస్తున్న సినిమా ఒక కేజీఎఫ్ లాంటిదని చెప్పాడు. అంటే కే జి ఎఫ్ కథ నే మళ్లీ తీస్తున్నామని కాదు. గౌతమ్ తిన్ననూరి తన స్టైల్ లో కేజిఎఫ్ టైప్ ఆఫ్ స్టోరీని చేస్తే ఎలా ఉంటుందో అలాంటి సబ్జెక్టుతో విజయ్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు అంటూ సినిమా మీద హైప్ ని పెంచుతున్నాడు.

    మరి మొత్తానికైతే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ లుక్ కూడా చాలా రా గా ఉండడంతో ఈ సినిమా మీద విజయ్ దేవరకొండ అభిమానులు చాలా అంచనాలైతే పెట్టుకున్నారు. మరి మొత్తానికైతే ఈ సినిమాతో విజయ్ తనదైన రీతిలో సత్తా చాటుతాడా లేదా అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ఇక ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తేనే విజయ్ కి మంచి మార్కెట్ అయితే క్రియేట్ అవుతుంది.

    లేకపోతే మాత్రం పాన్ ఇండియా మార్కెట్ అనేది తనకు అందని ద్రాక్ష గానే మిగులుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… ఇక ఇప్పటికే స్టార్ హీరోలు ముందుకు దూసుకెళ్తున్న క్రమంలో విజయ్ చాలా వరకు వెనుకబడిపోయాడు. కాబట్టి ఈ సినిమా సక్సెస్ అనేది ఆయనకి చాలా కీలకంగా మారుతుందనే చెప్పాలి…