https://oktelugu.com/

Amaran : అమరన్ డైరెక్టర్ తో ధనుష్ సినిమా కమిట్ అవ్వడానికి రామ్ చరణ్ కారణం అనే విషయం మీకు తెలుసా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న డైరెక్టర్లు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ తమకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతారు. ఇక ఒక హీరోతో సక్సెస్ సాధిస్తే అంతకుమించిన హీరోతో సినిమా చేయాలని కోరుకుంటారు. తద్వారా వాళ్లు సక్సెస్ లను కొలమానంగా చూసుకొని ముందుకు సాగుతూ ఉంటారు... ఇక ఇదే రీతిలో ఇప్పుడున్న చాలామంది యంగ్ డైరెక్టర్లు సైతం పాన్ ఇండియా హీరోలతో సినిమాలు చేస్తున్నారు...

Written By:
  • Gopi
  • , Updated On : November 9, 2024 / 08:10 AM IST

    Do you know that Ram Charan is the reason for Dhanush's film commitment with Amaran director..?

    Follow us on

    Amaran : శివ కార్తికేయన్ హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా వచ్చిన ‘అమరన్’ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఆర్మీ మేజర్ ‘ముకుంద్ వరదరాజన్’ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా భారీ సక్సెస్ ని సాధించింది. నిజానికి ఒక ఆర్మీ ఆఫీసర్స్ ఎలా ఉంటారు. వాళ్ళ బాధలు ఎలా ఉంటాయి. వాళ్ళ ఫ్యామిలీలు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటారు. అనే విషయాలను చాలా క్లియర్ కట్ గా ఈ సినిమాలో చూపించారు. ఇక దర్శకుడు ఈ సినిమాని విజయ తీరాలకు చేర్చడంలో సక్సెస్ అయ్యాడు. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాను చూడడానికి ప్రేక్షకులందరు విపరీతంగా ఉత్సాహన్ని చూపిస్తున్నారు అంటే ఈ సినిమా ప్రేక్షకుల్లో ఎలాంటి ఇంపాక్ట్ ను క్రియేట్ చేసిందో మనం అర్థం చేసుకోవచ్చు… ఇక ఇదిలా ఉంటే ఈ దర్శకుడు ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ తో ఒక సినిమా చేయడానికి అతనికి ఒక కథను కూడా వినిపించారట.

    అయితే ఈ కథ విన్న రామ్ చరణ్ ఇది నాకంటే ధనుష్ కి బాగుంటుందని అప్పుడే ధనుష్ కి ఫోన్ చేసి తన కథను వినమని చెప్పారట. దాంతో రాజ్ కుమార్ పెరియ స్వామి ధనుష్ కి కథను వినిపించాడు. ప్రస్తుతం ‘ధనుష్ 55’ సినిమాగా ఈ సినిమాకి సంబంధించిన ముహూర్తం కూడా రీసెంట్ గా జరగడం విశేషం.

    మరి రాజ్ కుమార్ ఈ సినిమాని సక్సెస్ ఫుల్ గా నిలపడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడట… ఇక ఏది ఏమైనా కూడా రామ్ చరణ్ వల్లే ధనుష్ ఒక మంచి కథని చేయబోతున్నాడు అంటూ కొన్ని వార్తలైతే వినిపిస్తున్నాయి. నిజానికి రాజ్ కుమార్ మొదట రామ్ చరణ్ ను సంప్రదించడం అనేది నిజంగా ఒక మంచి విషయమనే చెప్పాలి.

    తను కూడా దర్శకుడిగా తన కెరియర్ చాలా వైల్డ్ గా ఉండాలని ఊహించుకొని రామ్ చరణ్ అయితేనే తను ఒక భారీ సక్సెస్ ని కొట్టగలననే ఉద్దేశ్యంతో అతని దగ్గరికి వచ్చాడు. కానీ రామ్ చరణ్ ఆ సినిమాని ధనుష్ దగ్గరికి పంపించడంతో రాజకుమార్ పెరియసామి ఆ రకంగా కూడా చాలా సంతోషంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాని సక్సెస్ చేస్తేనే రాజకుమార్ పేరు మరొకసారి ఇండియా వైడ్ గా వినిపిస్తుంది. లేకపోతే మాత్రం చాలా కష్టమవుతుందనే చెప్పాలి…