https://oktelugu.com/

Pushpa 2 : పుష్ప 2 లో ఐటెం సాంగ్ చేయడానికి శ్రీలీలా ఎంత రెమ్యూనరేషన్ తీసుకుందో తెలుసా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్ హీరోలుగా ప్రూవ్ చేసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే... పుష్ప సినిమాతో పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ ని అందుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో మరొకసారి ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమవుతున్నాడు...ఇక ఈ సినిమాతో కనక సూపర్ సక్సెస్ సాధిస్తే ఆయనకి నటుడు గానే కాకుండా స్టార్ డమ్ ప్రకారం కూడా ఆయనకు భారీ గుర్తింపైతే వస్తుంది...

Written By:
  • Gopi
  • , Updated On : November 5, 2024 / 08:14 AM IST

    Do you know how much remuneration Srileela took to sing an item song in Pushpa 2..?

    Follow us on

    Pushpa 2 :సుకుమార్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా వస్తున్న పుష్ప 2 సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. మరి ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమాని భారీ రేంజ్ లో చిత్రీకరిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక దానికి అనుగుణంగానే ఈ సినిమాలో ప్రతి ఒక్క ఎలిమెంట్ ను చాలా దగ్గరుండి మరి సుకుమార్ అబ్జర్వ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అలాగే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో కూడా ఎవరైనా ఏదైనా మిస్టేక్ చేస్తున్నారా అనే ధోరణిలో ప్రతి ఒక్క విషయాన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలించి మరి సుకుమార్ ఈ సినిమాని ముందుకు తీసుకెళ్తున్నాడు. ఇక ఇప్పటికే సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిన నేపధ్యంలో ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఈ సినిమా బిజీగా ఉంది. ఇక ఈ సినిమా రిలీజ్ కి మరొక నెల రోజులు సమయం మాత్రమే ఉండడంతో సినిమా మీద రోజు రోజుకి భారీ అంచనాలైతే పెరుగుతున్నాయి. మరి ఈ సినిమాతో అటు సుకుమార్, ఇటు అల్లు అర్జున్ ఇద్దరు వాళ్ళని వాళ్ళు ఏ రకంగా ప్రూవ్ చేసుకుంటారనే విషయాల పట్ల సర్వత్ర ఆసక్తి అయితే నెలకొంటుంది.

    ఇక ఇదిలా ఉంటే పుష్ప మొదటి పార్ట్ లో సమంత ఐటెం సాంగ్ చేసి మెప్పించిన విషయం మనకు తెలిసిందే. ఇక ఇప్పుడు శ్రీలీలా ఐటెం సాంగ్ చేయబోతుంది నిజానికి శ్రీలీలా మంచి డాన్సర్… అల్లు అర్జున్ కూడా బెస్ట్ డాన్సర్…వీళ్లిద్దరి మధ్య రాబోయే సాంగ్ లో ఇద్దరు భారీ స్టెప్పులు వేసి ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నారుట.

    ఇక ఈ సినిమాలో ఐటెం సాంగ్ చేసినందుకు గాను శ్రీలీలా భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ ను తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా మీద మంచి నమ్మకాన్ని పెట్టుకున్న ప్రేక్షకులు ఈ సినిమాలో శ్రిలీలా ఐటమ్ సాంగ్ చేస్తుందని తెలియగానే వాళ్ల అంచనాలు రెట్టింపు స్థాయిలోకి పెరిగిపోయాయనే చెప్పాలి. ఎందుకంటే డాన్స్ విషయంలో అల్లు అర్జున్ కి పోటీ ఇచ్చే డాన్సర్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరు లేరు. కానీ శ్రీలీలా మాత్రం తన స్టెప్పులతో ఒక ఊపు ఊపేస్తుంది.

    మరి ఇలాంటి సందర్భంలో వీళ్ళ కాంబినేషన్ లో రాబోతున్న ఐటెం సాంగ్ మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. అయితే ఈ సినిమాలో ఐటెం సాంగ్ చేసినందుకు గాని శ్రీలీలా 5 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది…