https://oktelugu.com/

Prabhas Rajasaab : ప్రభాస్ రాజాసాబ్ సినిమాలో దెయ్యం గా ఎంత సేపు కనిపిస్తాడో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నా నటుడు ప్రభాస్...ప్రస్తుతం ఆయన తనదైన రీతిలో సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నాడు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా భారీ సక్సెస్ ని అందుకున్న ఆయన అప్పట్నుంచి ఇప్పటివరకు తనదైన రీతిలో సినిమాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు...చూడాలి మరి ప్రభాస్ ఇకమీదట చేయబోయే సినిమాలతో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు అనేది...

Written By:
  • Gopi
  • , Updated On : November 5, 2024 / 10:25 AM IST

    Do you know how long Prabhas will appear as a ghost in Rajasaab's movie..?

    Follow us on

    Prabhas Rajasaab : ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ని ఏక ఛత్రాధిపత్యంతో ఎలుతున్న ఒకే ఒక్క హీరో రెబల్ స్టార్ ప్రభాస్…ఆయన చేస్తున్న సినిమాలన్నీ వరుసగా మంచి విజయాలను సాధించడమే కాకుండా చాలా తక్కువ రోజుల్లోనే పాన్ ఇండియా సినిమాలను చేసి ప్రొడ్యూసర్లకు భారీ లాభాలను కట్టబెడుతున్నాడు. అందుకే ప్రభాస్ తో సినిమా చేయడానికి ప్రొడ్యూసర్లు చాలా ఆసక్తి చూపిస్తున్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్ తన లైనప్ తో మిగతా హీరోలందరికి చెమటలు పట్టిస్తున్నాడు. ఇక సినిమా సినిమాకి వేరియేషన్స్ ని చూపిస్తూ తన స్టామినా ఏంటో చూపించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక ఇప్పటికే మారుతి డైరెక్షన్ లో వస్తున్న రాజాసాబ్ సినిమా 20% షూట్ బ్యాలెన్స్ ఉండగా తొందర్లోనే ఈ సినిమాని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక రీసెంట్ గా ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి ఒక మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇక ఆ పోస్టర్ ను కనక మనం చూసినట్లయితే ఈ సినిమాలో ప్రభాస్ దెయ్యం గా కనిపించబోతున్నట్టుగా తెలుస్తోంది.

    ఇక ఈ సినిమాలో చంద్రముఖి సినిమా ఫ్లేవర్ కనిపించినప్పటికి ప్రభాస్ లాంటి స్టార్ హీరో దెయ్యం పాత్రను పోషిస్తే ఎలా ఉంటుందో చూడడానికి ఆయన అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిజానికైతే ఆయన ఈ సినిమాలో ఒక 15 నిమిషాల పాటు దెయ్యం పాత్రను పోషించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి అలాంటి పాత్రలో మెస్మరైజింగ్ పర్ఫామెన్స్ ని ఇస్తాడా?

    తను ఈ సినిమాని సక్సెస్ ఫుల్ గా నిలుపుతాడా లేదా అనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో సక్సెస్ ని సాధిస్తే ప్రభాస్ ఒక డిఫరెంట్ అటెంప్ట్ తో కూడా భారీ సక్సెస్ ని సాధించినట్లుగా అవుతుంది. అలాగే మారుతీ కూడా స్టార్ డైరెక్టర్ల లిస్టులోకి చేరుతాడు. పాన్ ఇండియాలో తనకు మంచి మార్కెట్ కూడా క్రియేట్ అవుతుంది.

    ఈ సినిమా సక్సెస్ అనేది అటు ప్రభాస్ కి, ఇటు మారుతికి చాలా వరకు హెల్ప్ అవుతుందనే చెప్పాలి. మరి వీళ్ళిద్దరూ కూడా ఈ సినిమా మీద తీవ్రమైన కసరత్తులైతే చేస్తున్నారట. ఇక ఈ సినిమా సక్సెస్ ఎలా ఉండబోతుంది అనేది తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే…