https://oktelugu.com/

Chiranjeevi : నటనలో చిరంజీవి ప్లేస్ ను రీప్లేస్ చేసే నటుడు ఎవరో తెలుసా..?

టాలీవుడ్ ఇండస్ట్రీని దాదాపు 50 సంవత్సరాలుగా ఏకఛత్రాధిపత్యంతో ఎలుతున్న ఒకే ఒక్కడు చిరంజీవి... ఆయన లాంటి నటులు ఇండస్ట్రీలో కొంతమంది ఉన్నప్పటికి ఆయన స్టార్ డమ్ ని, ఆయన చరిష్మాని టచ్ చేసే హీరోలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు లేరనే చెప్పాలి. ఆయన నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ఇప్పటికి ప్రేక్షకుల్లో విపరీతమైన అటెన్షన్ అయితే క్రియేట్ అవుతుంది. ఇక అలాంటి ఒక గొప్ప నటుడు చిరంజీవి...

Written By:
  • Gopi
  • , Updated On : November 2, 2024 / 10:29 AM IST

    Do you know an actor who can replace Chiranjeevi's role in acting..?

    Follow us on

    Chiranjeevi :  తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి చాలా ప్రత్యేకమైన గుర్తింపు అయితే ఉంది. ఆయన చేసిన ప్రతి సినిమా ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా ఆయనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ ని సంపాదించి పెట్టడంలో కూడా ఈ సినిమాలు భారీగా హెల్ప్ అయ్యాయి. ఆయనలాంటి నటుడు దాదాపు 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి తనదైన రీతిలో సేవలు చేస్తూనే ఉన్నాడు. ఇక ఇప్పుడు కూడా ఆయనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకోవడానికి ఆయన చాలా రకాలుగా ప్రయత్నాలైతే చేస్తున్నాడు. ఇక ఈ ఏజ్ లో కూడా విశ్వంభర లాంటి హై గ్రాఫిక్స్ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ తనకు సినిమా అంటే ఎంత ఇష్టమో తెలిసేలా చేస్తున్నాడు… ఇక ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి యాక్టివ్ గా సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఆయనే నెంబర్ వన్ హీరోగా ఉండేవాడు..కానీ ప్రజారాజ్యం పార్టీని పెట్టి రాజకీయాల వైపు వెళ్లిపోయిన తర్వాత ఆయన ప్లేస్ ని ఆక్యుపై చేసే హీరోలు ఎవరు అంటూ అప్పటినుంచి ఇప్పటివరకు తీవ్రమైన చర్చలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఆ ప్లేస్ ని ఆక్యుపై చేసే హీరో ఎవరు అనేది ఇప్పటివరకు క్లారిటీ అయితే రాలేదు. దాదాపు 15 సంవత్సరాల నుంచి మెగాస్టార్ హోదాని అందుకోవడానికి ప్రతి ఒక్క హీరో శత విధాలుగా ప్రయత్నం చేస్తున్నప్పటికి ఎవరు కూడా ఆయనలా నటించి ఆయన రేంజ్ ను టచ్ చేసే పొజిషన్ కి వెళ్లడం లేదనే చెప్పాలి…

    ఇక స్టార్ డమ్ విషయాన్ని పక్కన పెడితే చిరంజీవి లాంటి హీరో వైవిధ్యమైన పాత్రల్లో ఒదిగిపోయి నటిస్తూ తన నట విశ్వరూపాన్ని చూపించగలిగే సత్తా ఉన్న నటుడనే విషయం మనందరికి తెలిసిందే…మరి ఇప్పుడున్న హీరోల్లో నటనలో చిరంజీవిని రీప్లేస్ చేసే నటుడు ఎవరు అంటూ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ విపరీతంగా వైరల్ అవుతుంది…

    ఇక అతని ప్లేస్ ని రీప్లేస్ చేసే నటుడు ఇండస్ట్రీలో ఎవరున్నారనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది. ప్రస్తుతం ఉన్న హీరోలందరూ ఒక్కొక్క రసాన్ని పండించడంలో ఘనులు అయినప్పటికి చిరంజీవిలా అన్ని పాత్రలను ఏకకాలంలో పోషించగలిగే హీరోలు ఇండస్ట్రీలో లేరనే చెప్పాలి.

    మరి ఇకమీదటైనా మన స్టార్ హీరోల్లో ఎవరైనా ఒకరు వైవిధ్యభరితమైన కథాంశాలను ఎంచుకొని డిఫరెంట్ పాత్రాలను పోషించినప్పుడు మాత్రమే చిరంజీవిని రీప్లేస్ చేసే నటులు అవుతారు అంటూ కొంతమంది సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేయడం విశేషం…