https://oktelugu.com/

Dil Raju : 2025 సంక్రాంతికి రెండు సినిమాలతో వస్తున్న దిల్ రాజు…ఇక థియేటర్ల పరిస్థితి ఏంటి..?

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న దర్శకులందరూ వైవిద్యభరితమైన సినిమాలను చేయడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. ముఖ్యంగా డిఫరెంట్ సినిమాలను చేసినప్పుడే వాళ్లకు ఒక భారీ గుర్తింపైతే వస్తుందని వారు నమ్ముతున్నట్టుగా తెలుస్తోంది...

Written By:
  • Gopi
  • , Updated On : November 2, 2024 / 09:14 AM IST

    Dil Raju is coming with two movies for Sankranti in 2025...what is the condition of theaters?

    Follow us on

    Dil Raju : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫెస్టివల్ సీజన్ వచ్చిందంటే చాలు స్టార్ హీరోలు తమ సినిమాలతో దర్శనమిస్తూ ఉంటారు. నిజానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సంక్రాంతి పండుగలు చాలా భారీగా జరుపుకుంటారు. కాబట్టి సంక్రాంతి సీజన్ ని క్యాష్ చేసుకోవడానికి చాలామంది హీరోలు వాళ్ల సినిమాలను రంగంలోకి దింపుతుంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే దిల్ రాజు లాంటి స్టార్ ప్రొడ్యూసర్ తప్పకుండా ప్రతి సంక్రాంతికి ఏదో ఒక సినిమాని రిలీజ్ చేస్తూ ఉంటాడు. ఇక ఇప్పుడు శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ హీరోగా వస్తున్న గేమ్ చేంజర్ సినిమాను జనవరి 10 వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఇక దాంతోపాటుగా వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న సినిమాని కూడా సంక్రాంతి బరిలో నిలపబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమా టైటిల్ కూడా ‘సంక్రాంతికి వస్తున్నాం’ అని పెట్టడంతో ఈ సినిమా తప్పకుండా సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నారు అంటూ ఒక అఫీషియల్ అనౌన్స్ మెంట్ అయితే ఇచ్చారు. మరి ఇలాంటి సందర్భంలో ఈ సంక్రాంతికి రెండు దిల్ రాజు సినిమాలే ఉండడం వల్ల థియేటర్లను సమపాలలో పంచాల్సిన అవసరమైతే ఉంది.

    ఎందుకు దిల్ రాదు ఈ సినిమాని సంక్రాంతి బరిలో నిలుపుతున్నాడనేది ఎవరికి అర్థం కావడం లేదు. మరి మొత్తానికైతే ఈ రెండు సినిమాలతో ఒక ఒక భారీ సక్సెస్ ను అందుకోవడానికి కసరత్తులైతే చేస్తున్నాడు. ఇక ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా సూపర్ సక్సెస్ అవుతుందనేది తెలియాల్సి ఉంది. ఇక ఇలా చేయడం వల్ల దిల్ రాజుకి భారీగా ప్రాఫిట్స్ అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక రెండు సినిమాల్లో ఏదో ఒక సినిమా కూడా దిల్ రాజు ఒక సినిమాకి మైనస్ అయిన మరొక సినిమాకి ప్లస్ అయ్యే అవకాశాలైతే పుష్కలంగా ఉన్నాయి.

    మరి దాని వల్లే దిల్ రాజు ఈ సినిమాలను బరిలోకి దింపి ఎలాగైనా సరే భారీ సక్సెస్ ను సాధించాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ఈ సంక్రాంతికి రావలసిన మిగతా సినిమాల పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు అగమ్య గోచరంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రెండు సినిమాలకే దిల్ రాజు టోటల్ థియేటర్స్ ని కేటాయించబోతున్నట్టుగా తెలుస్తుంది.

    ఇక మిగిలిన థియేటర్ల పరిస్థితి ఎలా ఉండబోతుందనేది తెలియాల్సి ఉంది… ఇక ఇప్పటికే దిల్ రాజు థియేటర్ లో అన్నింటిని తన ఆధీనంలో పెట్టుకున్నాడు అంటూ భారీ కామెంట్లు అయితే చేస్తూ ఉంటారు మరి ఈ దెబ్బతో ఆ న్యూస్ ఇక భారీ లెవల్లో వినిపించబోతున్నట్టుగా తెలుస్తోంది…