https://oktelugu.com/

Dil Raju : దిల్ రాజు కి ‘గేమ్ చేంజర్’ సినిమా మీద నమ్మకం లేదా..? అందుకే సంక్రాంతి కి వెంకటేష్ సినిమాను కూడా రంగం లోకి దింపుతున్నాడా..?

సినిమా ఇండస్ట్రీ అనగానే అందరికీ స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు. ఎందుకంటే వాళ్ళు చేసిన సినిమాలు మాత్రమే ఎక్కువ ప్రేక్షకాదరణ పొందుతూ ఉంటాయి. నిజానికి చిన్న హీరోలను మీడియం రేంజ్ హీరోలను పట్టించుకునే రేంజ్ లో ఆడియన్స్ అయితే లేరు. ఒకవేళ వాళ్ళు చేసిన సినిమాలకు సక్సెస్ వస్తే తప్ప ఆ సినిమాలను చూడడానికి ఎవరు పెద్దగా ఇష్టపడడం లేదు...

Written By:
  • Gopi
  • , Updated On : November 5, 2024 / 09:42 AM IST

    Dil Raju doesn't believe in 'Game Changer' movie..? That's why Venkatesh is releasing the film for Sankranti..?

    Follow us on

    Dil Raju : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం దిల్ రాదు టాప్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్నాడు. ఇక తనదైన రీతిలో సినిమాలను నిర్మించడమే కాకుండా ఆయా సినిమాలను సక్సెస్ తీరాలకు చేర్చడంలో దిల్ రాజు కూడా చాలా కీలకపాత్ర వహిస్తున్నాడనే చెప్పాలి. ఎందుకంటే ఆయన సినిమాలకి తనే చాలా ప్రమోషన్స్ చేసి ఆ సినిమా మీద భారీ హైప్ ను క్రియేట్ చేయడమే కాకుండా ఆ సినిమాలను సక్సెస్ తీరాలకు చేర్చడంలో తన వంతు కృషి అయితే చేస్తాడు. ఇక ఇదిలా ఉంటే ప్రతి సంక్రాంతి సీజన్ ని క్యాష్ చేసుకోవడానికి దిల్ రాజు ప్రొడ్యూస్ చేసే ఏదో ఒక సినిమాని రిలీజ్ చేస్తూ ఉంటాడు. ఇక తను ప్రొడ్యూస్ చేసిన సినిమాలు అందుబాటు లేకపోతే ఇతర భాషల సినిమాలను ఇక్కడ భారీ మొత్తంలో రిలీజ్ చేసి ఎక్కువ డబ్బులను సంపాదించాలని చూస్తుంటాడు. మరి ఇలాంటి క్రమంలోనే ఇంతకుముందే శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ హీరోగా వస్తున్న గేమ్ చేంజర్ సినిమాని జనవరి పదోవ తేదీన సంక్రాంతి కానుక ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాం అంటూ అనౌన్స్ చేశాడు. ఇక సంక్రాంతి రేస్ లో దిల్ రాజు ముందు వరుస లో ఉన్నాడని అందరూ అనుకున్నారు.

    ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాతో పాటుగా వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే సినిమాని కూడా రిలీజ్ చేస్తుండడం విశేషం… గేమ్ చేంజర్ సినిమాకి పోటీగా ఈ సినిమాని ఎందుకు రిలీజ్ చేస్తున్నాడు. రెండు తన సినిమాలే అయినప్పుడు రెండింటి కలెక్షన్స్ మీద భారీగా ఎఫెక్ట్ పడే అవకాశాలు కూడా ఉన్నాయి కదా అని చాలామంది సినీ విమర్శకులు సైతం దిల్ రాజుని ప్రశ్నిస్తున్నారు.

    ఇక దీనికి కొంతమంది సినీ మేధావులు చెప్తున్న సమాధానం ఏంటంటే దిల్ రాజుకి గేమ్ చేంజర్ సినిమా మీద అంత మంచి ఒపీనియన్ లేదని ఆ సినిమా వచ్చిన ఆడుద్దో లేదో తెలియదు. కాబట్టి వఆయన ఈ సంక్రాంతి సీజన్ కి ఏదో ఒక సినిమాతో భారీ కలెక్షన్స్ ను క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశ్యంతో వెంకటేష్ అనిల్ రావిపూడి సినిమాని కూడా బరిలోకి దింపుతున్నట్టుగా తెలుస్తోంది.

    నిజానికి వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కాబట్టి సంక్రాంతికి ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేస్తారు అనే ఉద్దేశ్యం తోనే ఈ సినిమాను తీసుకువస్తున్నారు. ఇక రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’, వెంకటేష్ ‘సంక్రాంతి కి వస్తున్నాం ‘ అనే ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా సక్సెస్ సాధిస్తుందనేది తెలియాల్సి ఉంది…