https://oktelugu.com/

Shobhita Dhulipalla : నాగ చైతన్య కంటే ముందు శోభిత దూళిపాళ్ల ఆ యంగ్ హీరోతో డేటింగ్ చేసిందా.? పూర్తి వివరాలు చూస్తే ఆశ్చర్యపోతారు!

ఇక అప్పటి నుండి ఈ జంట సోషల్ మీడియా లో నేషనల్ వైడ్ గా ట్రెండ్ అవుతూనే ఉంది. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా శోభిత గురించి సోషల్ మీడియా లో జరుగుతున్నా ఒక ప్రచారం ఇప్పుడు సెన్సేషనల్ టాపిక్ గా మారింది.

Written By:
  • Vicky
  • , Updated On : November 12, 2024 / 01:16 PM IST

    Did Shobhita Dhulipalla date that young hero before Naga Chaitanya? You will be surprised to see the complete details!

    Follow us on

    Shobhita Dhulipalla :వచ్చే నెల 4వ తేదీన అన్నపూర్ణ స్టూడియోస్ లో నాగ చైతన్య, శోభిత దూళిపాళ్ల వివాహం గ్రాండ్ గా జరగబోతుంది. ఈ విషయం ఇంకా అధికారిక ప్రకటన చేయనప్పటికీ, పెళ్లి పనులు ఆ తేదీన నిర్వహించేందుకు చకచకా జరిగిపోతున్నాయి. ఆగష్టు 8వ తేదీన జరిగిన వీళ్లిద్దరి నిశ్చితార్థం ఫ్యాన్స్ కి ఊహించని సర్ప్రైజ్ గా అనిపించింది. అప్పటి వరకు కేవలం వీళ్లిద్దరి మధ్య ఉన్న రిలేషన్ గురించి సోషల్ మీడియా లో ప్రసారం అయ్యేది రూమర్స్ మాత్రమే అని అందరూ అనుకున్నారు. కానీ అది రూమర్స్ కాదు నిజమే అని ఆరోజే తెలిసింది. ఇక అప్పటి నుండి ఈ జంట సోషల్ మీడియా లో నేషనల్ వైడ్ గా ట్రెండ్ అవుతూనే ఉంది. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా శోభిత గురించి సోషల్ మీడియా లో జరుగుతున్నా ఒక ప్రచారం ఇప్పుడు సెన్సేషనల్ టాపిక్ గా మారింది.

    పూర్తి వివరాల్లోకి వెళ్తే శోభిత అచ్చ తెలుగు అమ్మాయి అయినప్పటికీ, ఆమెకు తెలుగులో కంటే ఎక్కువగా హిందీ లోనే ఆఫర్స్ వస్తుండేవి. అయితే గతం లో ఆమె ఇచ్చిన ఒక బాలీవుడ్ ఇంటర్వ్యూ లో ఆమె జీవితంలో జరిగిన కొన్ని చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకొని కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె మాట్లాడుతూ ‘ అప్పట్లో చదువు పూర్తి చేసి మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టాలని అనుకున్నప్పుడు అందరూ నేను నల్లగా ఉన్నానని వెక్కిరించారు. మోడల్ కాదు కదా, మోడల్ కి అసిస్టెంట్ కూడా అవ్వలేవు అని అవహేళన చేసేవారు. నేను ఇంటికి వెళ్లి అద్దంలో నా ముఖాన్ని చూసుకొని ఏడ్చేదానిని. ఆ తర్వాత నాకు నేను ధైర్యం చెప్పుకొని, ముందుకు సాగాను. ఏదైనా రంగం లో సక్సెస్ అవ్వాలంటే అందం ఒక్కటే ఉంటే సరిపోదు, టాలెంట్ కూడా ఉండాలి అనేది నిరూపించి చూపించాను’ అంటూ చెప్పుకొచ్చింది.

    అదే విధంగా తన మొదటి ప్రేమ గురించి కూడా చెప్పుకొచ్చింది శోభిత. సినిమాల్లోకి వచ్చిన కొత్తల్లో ఒక అతన్ని గాఢంగా ప్రేమించానని, కానీ అతనికి నేనంటే ఇష్టం లేదని, ఎంత ప్రయత్నం చేసిన అతను నా ప్రేమని అంగీకరించలేదని, ఆ సమయంలో నేను చాలా మానసిక క్షోభకి గురయ్యాను అంటూ చెప్పుకొచ్చింది శోభిత. ఇంతకీ అతను ఎవరో మాత్రం పేరు చెప్పలేదు. ఇంత అందమైన అమ్మాయి స్వయంగా వచ్చి ప్రపోజ్ చేస్తే ఏ అబ్బాయి అయినా రిజెక్ట్ చేస్తాడా?, అలాంటిది శోభిత ని రిజెక్ట్ చేసిన ఆ మహానుభావుడు ఎవరు అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే శోభిత ప్రస్తుతం తన చేతుల్లో ఉన్న సినిమాలు, వెబ్ సిరీస్ లను పూర్తి చేసింది. పెళ్లి తర్వాత ఈమె మళ్ళీ సినిమాల్లో నటిస్తుందో లేదో చూడాలి. ఈమె లాగానే పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ అందరూ సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్స్ అందుకోవడం వంటి ఘటనలు మనం చాలానే చూసాము.