https://oktelugu.com/

Sai Pallavi : సాయి పల్లవి రెమ్యూనరేషన్ మళ్ళీ పెంచేసిందా..? ఇంతకీ ఆమె ఎంత తీసుకుంటుంది…?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు ఉన్నప్పటికీ కొంతమందికి మాత్రమే ఇక్కడ చాలా మంచి గుర్తింపు అయితే లభిస్తుంది. ముఖ్యంగా సాయిపల్లవి లాంటి హీరోయిన్ తనదైన రీతిలో సినిమాలు చేస్తూ ముందుకు సాగడమే కాకుండా ప్రేక్షకులందరిని మెస్మరైజ్ చేస్తుందనే చెప్పాలి. ఇక ఇలాంటి హీరోయిన్ కి తెలుగులో చాలా మంచి క్రేజ్ దక్కుతుంది. ఇక ప్రస్తుతం ఆమె మంచి సినిమాలు చేయడమే కాకుండా ప్రేక్షకులందరిని తన పాత్రతో మెప్పించే ప్రయత్నం చేస్తుంది...

Written By:
  • Gopi
  • , Updated On : November 1, 2024 / 11:28 AM IST

    Did Sai Pallavi's remuneration increase again? So how much does she take...?

    Follow us on

    Sai Pallavi : ఫిదా సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయిన హీరోయిన్ సాయి పల్లవి…ఈ సినిమాతో ఒక్కసారిగా ప్రేక్షకులందరిని తన వైపు తిప్పుకుంది. ఇక ఒక రకంగా చెప్పాలి. అంటే ఈ సినిమాతో ఆమె ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపును సంపాదించుకుందనే చెప్పాలి. కెరియర్ మొదటి నుంచి కూడా ఆమె మంచి పాత్రలను చేస్తూ తన పాత్రకి ప్రాధాన్యం ఉంటే తప్ప ఆ సినిమాను ఓకే చేయడం లేదు. ఇక అందులో భాగంగానే ఆమె చేస్తున్న ప్రతి పాత్రకి ఒక ఐడెంటిటీ అయితే ఉంటుంది. గ్లామర్ షోస్ చేయడం, పేరుకు మాత్రమే హీరోయిన్ గా ఉండడం లాంటి పాత్రలను ఆమె ఎంకరేజ్ చేయదు. అందువల్లే తన దగ్గరికి వెళ్లేటప్పుడు దర్శకనిర్మాతలు ఒక మంచి కథను తీసుకొని వెళ్తేనే ఆమె ఓకే చేస్తుంది. ఇక ఇప్పుడు ఆమె పాన్ ఇండియా సబ్జెక్టులను కూడా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక రన్బీర్ కపూర్ హీరోగా వస్తున్నా ‘రామాయన్’ సినిమాలో సీతగా నటిస్తుంది. ఇక ఇప్పుడు శివ కార్తికేయన్ హీరోగా వచ్చిన ‘అమరన్ ‘ సినిమాలో కూడా హీరోయిన్ గా నటించి తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక ఏది ఏమైనా కూడా సాయి పల్లవి గతంలో చాలా తక్కువ రెమ్యూనరేషన్ తీసుకునేది.

    కానీ ఈ మధ్యకాలంలో మాత్రం వరుసగా రెమ్యూనరేషన్ పెంచుతూ వస్తుంది. ప్రస్తుతం ఆమె క్రేజ్ తారా స్థాయిలో ఉండడం వల్లే ఆమె తన రెమ్యూనరేషన్ ను పెంచుతుంది అంటూ చాలామంది సినీ మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఆమె ఒక సినిమాకి 10 కోట్ల వరకు రెమ్యూనరేషన్ ని డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

    అయితే కథ నచ్చితే మాత్రం అందులో కొంతవరకు తన రెమ్యూనరేషన్ ను తగ్గించే అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక మొత్తానికైతే ఒక స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న సాయి పల్లవి పది కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకోవడం అనేది మామూలు విషయం కాదు.

    ఇక ఇదిలా ఉంటే ఆమె చేస్తున్న సినిమాలన్నీ మంచి విజయాలు సాధిస్తూ ఉండడంతో ఆమెకు సక్సెస్ రేట్ కూడా ఎక్కువగానే ఉంది. అందువల్లే ఆమెను లక్కీ హ్యాండ్ గా భావించి ప్రొడ్యూసర్లు దర్శకులు ఆమెను తమ సినిమాలో నటింపజేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్టుగా తెలుస్తుంది…ఇక ఏది ఏమైనా కూడా సాయి పల్లవి తన పంథా లో ముందుకు దూసుకెళ్తుంది…