Rajasab : రాజాసాబ్ విషయం లో ప్రభాస్ నిజంగానే తప్పు చేశాడా..?అసలు మ్యాటరెంటంటే..?

తెలుగు సినిమా ఖ్యాతి ని పెంచిన హీరోల్లో ప్రభాస్ ఒకరు. ప్రస్తుతం ఆయన ఏ సినిమా చేసిన కూడా మినిమం గ్యారంటీ కలెక్షన్స్ అయితే వస్తున్నాయి. ఇక ఇండియా మొత్తంలో నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న స్టార్ హీరో కూడా తనే కావడం విశేషం...

Written By: Gopi, Updated On : October 26, 2024 9:57 am

Did Prabhas really make a mistake in the matter of Rajasab? What is the real matter..?

Follow us on

Rajasab : పాన్ ఇండియాలో పెను ప్రభంజనాన్ని సృష్టిస్తున్న హీరోల్లో ప్రభాస్ ఒకరు. బాహుబలి సినిమాతో ఆయన స్టార్ డమ్ అనేది విస్తరిస్తూ పోతుంది. నిజానికి ఆయనలాంటి హీరో ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మరొకరు లేరనేది వాస్తవం. ఇప్పుడున్న బాలీవుడ్ హీరోలు సైతం వాళ్ళ సినిమాల్లో ప్రభాస్ తో గెస్ట్ అప్పిరియన్స్ ఇప్పించుకుంటే వాళ్ళ సినిమాలు భారీగా సక్సెస్ అవుతాయి అనే ఉద్దేశ్యం లో ఉన్నారు. అంటే మన ప్రభాస్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక మొత్తానికైతే ప్రభాస్ ని ఢీకొట్టే హీరో దరిదాపుల్లో లేడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇదిలా ఉంటే ఆయన ప్రస్తుతం స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తున్నప్పటికి మారుతి లాంటి మీడియం రేంజ్ డైరెక్టర్ తో కూడా రాజాసాబ్ అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా స్టార్ట్ అయి దాదాపు మూడు సంవత్సరాలు అవుతున్నప్పటికి ఈ సినిమాని పూర్తి చేయడంలో ప్రభాస్ చాలావరకు నెగ్లెట్ చేస్తున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి. నిజానికి మారుతి చేసే సినిమా అతనికి పెద్దగా నచ్చడం లేదట. కానీ అనుకోని పరిస్థితుల వల్ల ఒప్పుకున్నందుకు ఆ సినిమాని పూర్తి చేయాలని చూస్తున్నాడు. ఇక రీసెంట్ గా ప్రభాస్ బర్త్ డే సందర్భంగా రాజాసాబ్ సినిమా నుంచి మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇక ఇందులో అతని గెటప్ అయితే అసలు బాగాలేదు.
మరి అలాంటి ఒక పూర్ మోషన్ పోస్టర్ ని ఎందుకు క్రియేట్ చేశారు. దానివల్ల సినిమా మీద హైప్ రావడం కంటే సినిమా మీద విమర్శలైతే ఎక్కువగా వస్తున్నాయి. అంటూ కొంతమంది సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు. నిజానికి ప్రభాస్ లాంటి స్టార్ హీరో ఉన్నప్పుడు ఈ సినిమా నుంచి ఒక గ్లింప్స్ వదిలితే బాగుండేది. ఇలాంటి మోషన్ పోస్టర్ వల్ల ప్రభాస్ కి పెద్దగా ఒరిగేది అయితే ఏమీ లేదు.
ఇక సినిమాకి వచ్చే బజ్ కూడా పెద్దగా ఏమీ ఉండదు. మరి ఇలాంటి సందర్భంలో మారుతి లాంటి ఒక రాంగ్ డెసిజన్ ని ఎందుకు తీసుకున్నాడనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే మారుతి తో రాజాసాబ్ సినిమా చేస్తున్నందుకు ప్రభాస్ కొంత వరకు ఇబ్బందిగా ఫీలవుతున్నట్టుగా తెలుస్తోంది.
ఎందుకంటే ఇప్పటివరకు మారుతి ఏ స్టార్ హీరోని హ్యాండిల్ చేయలేదు. ప్రభాస్ లాంటి స్టార్ హీరో దొరికినప్పుడు సినిమాని చాలా జాగ్రత్తగా చేయాలి. అలా కాకుండా తనకు ఇష్టం వచ్చినట్టుగా చేస్తే దాని ఫలితం తేడా కొడుతే మాత్రం మారుతి భారీ విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది…