Prabhas : ప్రభాస్ కి ఆ గాయం మళ్ళీ తిరగబెట్టిందా..?ఇంతకీ ఆయనకి తగిలిన దెబ్బలేంటి..? ఇది ఎప్పుడు జరిగింది..?

సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అనేది ఊరికే రాదు. ఇక్కడ నటులు చాలా రకాల కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక అందులోనూ నటులు తమకంటూ ఒక గుర్తింపు సంపాదించుకోవాలంటే మాత్రం ఏది ఏమైనా కష్టాన్ని భరించాల్సి ఉంటుంది. ఇక ఏది ఏమైనా కూడా ఒక్కసారి స్టార్ హీరో అనే ఇమేజ్ వచ్చింది అంటే మాత్రం వాళ్ల కష్టానికి ప్రతిఫలం దక్కుతుందనే చెప్పాలి...

Written By: Gopi, Updated On : November 1, 2024 6:00 pm

Did Prabhas get that injury again? When did this happen?

Follow us on

Prabhas : ఈశ్వర్ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన ప్రభాస్…వర్షం సినిమాతో హీరోగా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇక ఛత్రపతి సినిమాతో స్టార్ హీరోగా వెలుగొందాడు. ఇక ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ మంచి విజయాలను సాధించడంతో ఎప్పటికప్పుడు ఆయన స్టార్ హీరో ఇమేజ్ ని సంపాదించుకుంటూ ముందుకు సాగుతూ వచ్చాడు. ఇక ఎప్పుడైతే బాహుబలి సినిమా చేశాడో అప్పటినుంచి తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా వైడ్ గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక బాహుబలి సినిమా చేసినప్పటి నుంచి ఇప్పటివరకు ఆయనకు విపరీతమైన క్రేజ్ ఉండడమే కాకుండా ఇండస్ట్రీలో అతన్ని బీట్ చేసే హీరో మరొకరు లేరనేంతలా గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఆయన చేస్తున్న ప్రతి సినిమా ఏదో ఒక వైవిధ్యాన్ని సంతరించుకొని ముందుకు సాగుతుంది. మరి ఇలాంటి క్రమంలోనే ఆయన చేయబోయే సినిమాలు కూడా ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తాయి అంటూ వాళ్ళు పూర్తి కాన్ఫిడెంట్ తో ఉన్నారు… ఇక ప్రస్తుతం ఆయన హను రాఘవపూడి దర్శకత్వంలో చేస్తున్న ఫౌజీ సినిమా షూటింగ్ లో పాల్గొనడానికి సిద్ధమవుతున్నాడు. ఇక ఇదిలా ఉంటే బాహుబలి సినిమా సమయంలో ఆయనకు షోల్డర్ ఇంజూరైన విషయం మనకు తెలిసిందే…ఇక అనుకొని కారణాలవల్ల ఆ షోల్డర్ ఇంజ్యూరి మళ్లీ తిరగబెట్టినట్టుగా తెలుస్తుంద.

ఇక దాని సర్జరీ కోసం ఆయన విదేశాలకు వెళ్లడానికి సిద్ధమవుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా ప్రభాస్ లాంటి నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ స్థాయిని పెంచడమే కాకుండా తెలుగు వాళ్ళమన మనలో ఒక ఆత్మ గౌరవాన్ని కూడా పెంచాడు.

నిజానికి మన స్టార్ హీరోలతో బాలీవుడ్ దర్శకుడు సినిమాలు చేయడానికి క్యూ కడుతున్నారు అంటే మన వాళ్ళు సృష్టించిన ప్రభంజనం ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు… ఇక ఇప్పుడున్న హీరోలందరిలో ప్రభాస్ నెంబర్ వన్ పొజిషన్ లో కొనసాగుతున్నాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… ఇక తనను తాను మరొకసారి స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలంటే మాత్రం రాబోయే సినిమాలతో భారీ సక్సెస్ ను సాధించాల్సిన అవసరమైతే ఉంది… ఇక ప్రస్తుతం ఆయన వరుసగా మూడు సినిమాలను లైన్ లో పెట్టాడు.

ఇక ఈ మూడు సినిమాలు ఫినిష్ చేసిన తర్వాత మరికొన్ని సినిమాలకు కమిట్ అయ్యే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తోంది…ఇక ఇది ఏమైనా కూడా ప్రభాస్ లాంటి హీరో మన ఇండస్ట్రీ లో ఉండటం తెలుగు సినిమా ఇండస్ట్రీ కి వేయి ఏనుగుల బలాన్ని తీసుకువచ్చిందనే చెప్పాలి…