https://oktelugu.com/

Devara : నెట్ ఫ్లిక్స్ లో ‘దేవర’ చిత్రానికి ఘోర అవమానం.. స్టార్ హీరోయిన్ మూవీ దెబ్బకి ట్రెండింగ్ నుండి అవుట్!

నెట్ ఫ్లిక్స్ లో 'దేవర' చిత్రానికి ఘోర అవమానం.. స్టార్ హీరోయిన్ మూవీ దెబ్బకి ట్రెండింగ్ నుండి అవుట్!

Written By: Vicky, Updated On : November 13, 2024 2:33 pm

'Devara' movie on Netflix is ​​a big shame.. star heroine movie is out of trending!

Follow us on

Devara : ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘దేవర’ ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళం భాషల్లో విడుదలై మంచి రెస్పాన్స్ ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. నవంబర్ 8వ తారీఖున విడుదలైన ఈ సినిమాకి ఇప్పటి వరకు 22 లక్షల వ్యూస్ వచ్చాయి. సలార్ చిత్రానికి మొదటి వారం లో 16 లక్షల వ్యూస్ వస్తే, ఎన్టీఆర్ దేవర కి వారం రోజులు కూడా పూర్తి కాకముందే 22 లక్షల వ్యూస్ వచ్చాయని, ఇది రీసెంట్ గా విడుదలైన అన్ని సినిమాలకంటే ఎక్కువ అని ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో చెప్పుకొచ్చారు. అయితే ‘దేవర’ చిత్రానికి నెట్ ఫ్లిక్స్ లో ఘోరమైన అవమానం జరిగింది. నెట్ ఫ్లిక్స్ హిస్టరీ లో ఇప్పటి వరకు ఒక టాప్ హీరో సినిమా విడుదలైన వారం రోజుల లోపే టాప్ 1 ట్రెండింగ్ నుండి క్రిందకి దిగిపోవడం ఇప్పటి వరకు మనం చూడలేదు. అది కేవలం దేవర విషయంలోనే చూస్తున్నాం.

పూర్తి వివరాల్లోకి వెళ్తే ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ ప్రధాన పాత్ర పోషించిన ‘ది బకింగ్హమ్ మర్డర్స్’ అనే హిందీ చిత్రం మొన్న విడుదలైంది. ఈ సినిమాకి ‘దేవర’ కంటే మంచి రెస్పాన్స్ రావడంతో టాప్ 1 స్థానం లో ట్రెండ్ అవుతుంది. దేవర చిత్రం కేవలం నాలుగు రోజులు మాత్రమే టాప్ 1 స్థానంలో ట్రెండ్ అయ్యింది. ప్రస్తుతం ‘దేవర’ రెండవ స్థానంలో కొనసాగుతుంది. ‘ది బకింగ్హమ్ మర్డర్స్’ కేవలం హిందీ వెర్షన్లో మాత్రమే విడుదలైంది. ‘దేవర’ చిత్రం హిందీ వెర్షన్ తప్ప, అన్ని భాషల్లోనూ విడుదలైంది. నాలుగు భాషలకు కలిపి కూడా దేవర చిత్రానికి ‘ది బకింగ్హమ్ మర్డర్స్’ సినిమా కంటే తక్కువ వ్యూస్ వచ్చాయా అని విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోతున్నారు. అయితే ‘దేవర’ చిత్రం హిందీ వెర్షన్ లో లేకపోవడం వల్లే ట్రెండింగ్ నుండి తొందరగా దిగిపోవాల్సి వచ్చిందని ట్రేడ్ పండితులు చెప్తున్న మాట.

కారణం నెట్ ఫ్లిక్స్ లో మన సౌత్ ఆడియన్స్ కంటే, నార్త్ ఆడియన్స్ ఎక్కువగా ఉంటారు. ఉదాహరణకు మన సౌత్ నుండి కోటి మంది యూజర్లు నెట్ ఫ్లిక్స్ లో ఉంటే,నార్త్ ఇండియా నుండి కనీసం నాలుగు కోట్ల మంది ఉంటారు. కేవలం ఇండియన్స్ మాత్రమే కాకుండా బాంగ్లాదేశ్, పాకిస్తాన్ మరియు ఇతర అరబ్ దేశాలతో పాటు, వెస్టర్న్ దేశాల ఆడియన్స్ కూడా ఉంటారు. అందుకే హిందీ సినిమాకి వచ్చే వ్యూస్ తెలుగు సినిమాలకు రావు. ‘దేవర’ చిత్రాన్ని హిందీ వెర్షన్ లో విడుదల చేసి ఉండుంటే #RRR తరహా రెస్పాన్స్ వచ్చి ఉండేదని, ఇలాంటి అవమానం జరిగి ఉండేది కాదని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అసలు హిందీ వెర్షన్ విడుదల ని ఎందుకు ఆపారు అనే దానిపై ఇప్పటి వరకు స్పష్టత రాలేదు.