Telugu News » Photos » Cinema Photos » Dana karnudu mahesh babus secret donations is he spending all the crores per year mind blowing details
Mahesh Babu : దాన కర్ణుడు.. మహేష్ బాబు సీక్రెట్ డొనేషన్స్, ఏడాదికి అన్ని కోట్లు ఖర్చు చేస్తున్నాడా? మైండ్ బ్లోయింగ్ డిటైల్స్
మహేష్ బాబు చాలా రిజర్వ్డ్ గా ఉంటారు. కేవలం తన సినిమా ప్రమోషన్స్, ఇతర ముఖ్యమైన కార్యక్రమాల కోసమే బయటకు వస్తారు. ఇక మహేష్ బాబు అత్యధిక సంపాదన ఉన్న హీరో. మహేష్ బాబు సినిమాకు రూ. 70-80 కోట్లు తీసుకుంటారు. ఆయనకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇండియా వైడ్ పాపులారిటీ ఉన్న హీరో. అందుకే పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు సైతం ఆయన్ని ప్రచార కర్తగా ఎంచుకున్నాయి. పదికి పైగా ఉత్పత్తులకు మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు.
Mahesh Babu : మహేష్ బాబుకు అనేక వ్యాపారాలు ఉన్నాయి. ఏఎంబి సినిమాస్ తో పాటు ఓ గార్మెంట్ ఆన్లైన్ బ్రాండ్ ఉంది. అలాగే జిఎంబి ఎంటర్టైన్మెంట్ పేరుతో సొంత నిర్మాణ సంస్థ కలిగి ఉన్నారు. ఏడాదికి వందల కోట్ల సంపాదన ఆయన కలిగి ఉన్నారు. అయితే మహేష్ బాబుకు సామాజిక స్పృహ ఎక్కువే. ఆయన సామాజిక సేవ కూడా గోప్యంగా చేస్తారు. దాదాపు రెండు దశాబ్దాలుగా మహేష్ బాబు చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్ చేయిస్తున్నాడు.
ఈ సంఖ్య 3 వేలకు పైగా ఉంది. వేల మంది చిన్నారులు మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా వైద్య సహాయం పొందారు. గౌతమ్ పుట్టినప్పుడు మహేష్ బాబుకు ఈ ఆలోచన వచ్చిందట. నెలలు నిండకుండానే గౌతమ్ పుట్టాడట. దాంతో ఖరీదైన వైద్యంతో గౌతమ్ ని మహేష్ బాబు దక్కించుకున్నారట. మనకు డబ్బులు ఉన్నాయి కాబట్టి పిల్లాడిని కాపాడుకున్నాం, మరి లేనివారి పరిస్థితి ఏమిటనే ఆలోచన ఆయన మదిలో మొదలైందట.
అప్పటి నుండి గుండె జబ్బుల బారినపడిన చిన్నారులకు ఉచిత ఆపరేషన్స్ చేయిస్తున్నాడు. అలాగే ఏపీ/తెలంగాణాలలో మహేష్ బాబు రెండు గ్రామాలను దత్తత తీసుకుని మౌలిక సదుపాయాలు కల్పించారు. ఆ రెండు గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నాడు. అలాగే పేద విద్యార్థులకు ఆయన సహాయం చేస్తున్నారు. విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలను తన ఫౌండేషన్ ద్వారా మహేష్ బాబు అందిస్తున్నారు.
ఒక అంచనా ప్రకారం మహేష్ బాబు ఏడాదికి రూ. 30 కోట్లు సామాజిక సేవకు ఖర్చు చేస్తున్నారట. మహేష్ బాబు తాను చేసే ఈ సేవకు ప్రచారం కోరుకోరు. అందుకే ఆయన చేసే చాలా మంచి పనుల గురించి సమాజానికి తెలియదు. మహేష్ దానకర్ణుడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. కుడి చేత్తో దానం చేస్తే ఎడమ చేతికి తెలియకూడదు అంటారు. మహేష్ బాబు ఇదే ఫాలో అవుతున్నాడు.
మరోవైపు ఆయన ఎస్ఎస్ఎంబి 29కి సిద్ధం అవుతున్నారు. ప్రీ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ మూవీ జనవరిలో సెట్స్ పైకి వెళ్లనుంది. రాజమౌళి దాదాపు రూ. 800 కోట్ల బడ్జెట్ తో ఇది నిర్మిస్తున్నారు. ఎస్ఎస్ఎంబి 29 జంగిల్ యాక్షన్ అడ్వెంచర్ గా రాజమౌళి రూపొందించనున్నారు.