https://oktelugu.com/

Chiranjeevi : చిరంజీవి ఆ విషయం లో చాలా వీక్ అందుకే ఆయన మీద విమర్శలు వస్తుంటాయి..

తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం లో చాలామంది నటులు వాళ్ళను వాళ్ళు స్టార్లుగా ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా వారసత్వం నుంచి వచ్చిన హీరోలు వారిని వాళ్ళు స్టార్ హీరోలుగా ఎలివేట్ చేసుకోలేకపోతే మాత్రం వాళ్ళ ఫ్యామిలీకి బ్యాడ్ నేమ్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక ఏది ఏమైనా కూడా సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అనేది చాలా కీలకం కాబట్టి ప్రతి ఒక్కరు సక్సెస్ కొట్టిన తర్వాతే వాళ్లకి స్టార్ డమ్ అనేది స్టార్ట్ అవుతుంది...

Written By:
  • Gopi
  • , Updated On : November 6, 2024 / 03:41 PM IST

    Chiranjeevi is very weak in that matter and that is why he is criticized.

    Follow us on

    Chiranjeevi : తెలుగు సినిమా ఇండస్ట్రీని ఏకచత్రాధిపత్యంతో ఏలుతున్న ఒకే ఒక్క హీరో మెగాస్టార్ చిరంజీవి… ఆయన చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో మంచి విజయాలను సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును కూడా తీసుకొచ్చాయి. 45 సంవత్సరాల నుంచి నెంబర్ వన్ హీరోగా కొనసాగడం అంటే మామూలు విషయం కాదు. ఇక ఈ ఏజ్ లో కూడా ఆయన అలరించడానికి రిస్కీ షాట్స్ ని కూడా చేస్తూ ముందుకు సాగుతున్నాడనే విషయం సోషల్ మీడియాలో విపరీతంగా వినబడుతుంది.ఇక ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి సినిమాలతో ఎంత ఫేమస్ అయ్యాడో అంతకుమించి సమాజ కార్యక్రమాలను, సేవా కార్యక్రమాలను చేస్తూ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా చిరంజీవి మీదగాని ఆయన ఫ్యామిలీ మీద గాని చాలామంది చాలా విమర్శలు చేస్తూ ఉంటారు. మరి వాటికి చిరంజీవి పెద్దగా స్పందించడు ఎందుకంటే ప్రతి ఒక్కరికి స్పందించుకుంటూ వెళితే అలాంటి మూర్ఖులతో మనం వాదించలేం అనే ఉద్దేశ్యంతోనే చిరంజీవి సైలెంట్ గా ఉంటాడని మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు…

    చిరంజీవి ఎవరినైతే బాగా నమ్ముతాడో వాళ్లే అతన్ని మోసం చేస్తారు అంటూ కొంతమంది సినీ మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు. ఇక ఈ విషయాన్ని చిరంజీవి చాలాసార్లు గమనించినప్పటికి ఆయన మాత్రం ఎవరిని విమర్శించకుండా తన పని తాను చేసుకుంటూ ముందుకు వెళ్తాడు.

    కారణం ఏదైనా కూడా చిరంజీవి పక్కనే కొంతమంది గుంట నక్కల్ల ఉంటారని వారిని పసిగట్టి వారిని ముందుగా తన దగ్గర నుంచి క్లియర్ చేస్తే తప్ప చిరంజీవి ఇమేజ్ అయితే డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. ఇక నిజానికి ఆయన ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా తన పక్కనున్న కొంతమంది వల్ల ఆయన ఇమేజ్ అనేది భారీగా డ్యామేజ్ అయింది. ఇక ఏది ఏమైనా కూడా చిరంజీవి కొంతమంది మనుషులను క్యాలీక్లెట్ చేయడంలో చాలా వీక్…

    కాబట్టే ఆయన తన వారు అనుకున్న వాళ్ళే తనని మోసం చేస్తూ ఉంటారు. ఇక చిరంజీవి లాంటి స్టార్ హీరో ఇమేజ్ ను సొంతం చేసుకున్న ఆయన చాలా సెక్యూర్డ్ ఉండాలి. కానీ ఆయన మాత్రం చాలా ఓపెన్ హార్ట్ తో అందరూ మనవాళ్లే అన్నట్టుగా ముందుకు సాగుతూ ఉంటాడు. దానివల్ల ఆయనకి చాలా సార్లు మైనస్ కూడా అయిందనే విషయాన్ని చాలామంది సినీ మేధావులు సైతం అప్పుడప్పుడు చెప్పకనే చెబుతూ ఉంటారు…