https://oktelugu.com/

Varun Tej : వరుణ్ తేజ్ ‘మట్కా’ కి దారుణమైన ఓపెనింగ్స్..హైదరాబాద్ సిటీ మొత్తానికి ఎన్ని టికెట్స్ అమ్ముడుపోయాయో తెలుసా?

మెగా ఫ్యామిలీ నుండి విభిన్నమైన కథాంశాలను ఎంచుకుంటూ ప్రేక్షకులను థ్రిల్ కి గురి చేయాలనీ తాపత్రయం పడే హీరో వరుణ్ తేజ్

Written By: Vicky, Updated On : November 14, 2024 4:19 pm
Bad openings for Varun Tej's 'Matka'..Do you know how many tickets were sold for the entire city of Hyderabad?

Bad openings for Varun Tej's 'Matka'..Do you know how many tickets were sold for the entire city of Hyderabad?

Follow us on

Varun Tej :  మెగా ఫ్యామిలీ నుండి విభిన్నమైన కథాంశాలను ఎంచుకుంటూ ప్రేక్షకులను థ్రిల్ కి గురి చేయాలనీ తాపత్రయం పడే హీరో వరుణ్ తేజ్. ముకుంద సినిమాతో వెండితెర అరంగేట్రం చేసిన ఈయన, ఆ తర్వాత ఫిదా, తొలిప్రేమ, ఎఫ్2 , గడ్డలకొండ గణేష్, ఎఫ్3 వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకొని తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ని ఏర్పాటు చేసుకున్నాడు కానీ, దాని కొనసాగిస్తూ ముందుకు తీసుకెళ్లడం లో మాత్రం విఫలం అయ్యాడు. వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ రావడంతో వరుణ్ తేజ్ మార్కెట్ మొత్తం పోయింది. నేడు ఆయన నటించిన ‘మట్కా’ చిత్రం వరుణ్ తేజ్ మార్కెట్ ని ఎంత దెబ్బ తీసిందో ఒక ఉదాహరణ లాగ నిల్చింది. ఈ సినిమాకి సూర్య ‘కంగువ’ కంటే మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ కలెక్షన్స్ మాత్రం నిల్. బుక్ మై షో యాప్ లో కనీసం గంటకి వెయ్యి టికెట్స్ కూడా ఈ చిత్రానికి అమ్ముడుపోవడం లేదంటే ఓపెనింగ్స్ ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

హైదరాబాద్ లో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లాంటి సెంటర్ లో సుదర్శన్ 35 ఎంఎం లాంటి పాపులర్ థియేటర్ లో మార్నింగ్ షోకి కనీసం 20 శాతం ఆక్యుపెన్సీ కూడా రాలేదట. దీనిని బట్టీ ఈ చిత్రాన్ని మెగా అభిమానులు ఎంత రిజెక్ట్ చేసారో అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి వరుణ్ తేజ్ సినిమాల మీద ఈమధ్య ఆడియన్స్ కి అసలు ఆసక్తి రావడం లేదు. ఆయనకీ ఉన్నటువంటి కటౌట్ కి మంచి లవ్ స్టోరీ కానీ, మాస్ సినిమాలు చేస్తాడనుకుంటే, ఆడియన్స్ అసలు ఏమాత్రం ఆసక్తి చూపించని జానర్స్ ని ఎంచుకొని మెగా అభిమానులను టార్చర్ చేస్తున్నాడు. ఇదే విధంగా ఆయన సినిమాలు చేస్తూ పోతే మరో అల్లు శిరీష్ లాగా మారిపోతాడు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. మెగా ఫ్యామిలీ నుండి అడుగుపెట్టి స్టార్స్ గా ఎదగడం లో విఫలమైన హీరోలు నాగ బాబు, అల్లు శిరీష్ వంటి వారు. వరుణ్ తేజ్ కూడా ఇప్పుడు ఆ జాబితాలోకి చేరిపోయే ప్రమాదం ఉంది.

ఇదంతా పక్కన పెడితే బుక్ మై షో లో ఎన్ని టికెట్స్ అమ్ముడుపోయాయి అనేది ఈమధ్య తెలిసిపోతున్నాయి. కానీ కనీసం ఇండియా వైడ్ గా 5 వేల టికెట్స్ అయినా అమ్ముడుపోవాలి. అప్పుడే బుక్ మై షో యాప్ లో 24 గంటల్లో ఎన్ని టికెట్స్ అమ్ముడుపోయాయి తెలుస్తుంది. వరుణ్ తేజ్ మట్కా చిత్రం ఇప్పటి వరకు ట్రెండింగ్ లోనే రాలేదు. దీనిని బట్టి ఈ సినిమాకి మొదటి రోజు 5 వేల టికెట్స్ కంటే తక్కువ అమ్ముడుపోయాయని అనుకోవచ్చు. హైదరాబాద్ లో అయితే వెయ్యి టికెట్స్ లోపే అమ్ముడుపోయాయట. ఇది మెగా ఫ్యామిలీ కి ఘోరమైన అవమానం అనే చెప్పాలి. ఇలాంటి నీరసపు సినిమాలు చేసేదానికంటే మెగా ఫ్యామిలీ పరువు కోసం అసలు సినిమాలు మానేయమని కొంతమంది మెగా ఫ్యాన్స్ వరుణ్ తేజ్ ని ట్యాగ్ చేసి తిడుతున్నారు.