https://oktelugu.com/

Screenplay : బ్యాక్ అండ్ ఫోర్త్, అంథాలాజీ స్క్రీన్ ప్లే అనే ఏంటి..? వీటిని బేస్ చేసుకొని మన తెలుగులో ఏ సినిమాలు వచ్చాయి…

ఒక సినిమా సక్సెస్ సాధించాలంటే ముఖ్యంగా ఆ సినిమాలో ఉన్న ప్రతి ఒక్కరు చాలా అద్భుతంగా వాళ్ళ క్రాఫ్ట్ ను నిర్వర్తించాల్సిన అవసరమైతే ఉంది. ఇక అన్ని క్రాఫ్ట్స్ వాళ్ళు ది బెస్ట్ ఇస్తేనే సినిమా అనేది సూపర్ గా వస్తుంది. లేకపోతే మాత్రం సినిమా భారీగా డిస్సాపాయింట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి...

Written By:
  • Gopi
  • , Updated On : November 1, 2024 / 01:51 PM IST

    Back and forth, what is anthology screenplay..? Based on these, which movies have come out in our Telugu...

    Follow us on

    Screenplay : ఒక సినిమా సక్సెస్ అవ్వడం కోసం దర్శకులు చాలా రకాల ఇబ్బందులను ఎదుర్కొంటారు. నిజానికి ముందుగా వాళ్ళు ఒక కథ రాసుకొని అందులో ఒక హీరోని సెట్ చేసుకొని ప్రొడ్యూసర్ ను మ్యానేజ్ చేస్తూ ఎన్ని ప్రాబ్లమ్స్ ని అయిన సరే ఫేస్ చేస్తూ ముందుకు సాగుతున్న అంటారు. నిజానికి వాళ్ళ కెరియర్ అనేది ఒక సక్సెస్ సినిమా మీదనే ఆధారపడి ఉంటుందని చాలా మందికి తెలియదు. నిజానికి ఒక్క సినిమా సక్సెస్ అయితే డైరెక్టర్ స్టార్ డైరెక్టర్ గా వెలుగొందుతాడు. కానీ ఆ సినిమా ఫ్లాప్ అయితే మాత్రం తనకి నెక్స్ట్ సినిమా ఇచ్చే ప్రొడ్యూసర్లు కూడా ఉండరు. ఇక ఇదిలా ఉంటే కథ ఎలా రాసుకున్నా కూడా దర్శకుడు స్క్రీన్ ప్లే మీద చాలా వర్క్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇక ముఖ్యంగా స్క్రీన్ ప్లే లో బ్యాక్ అండ్ ఫోర్త్ స్క్రీన్ ప్లే, అంథాలాజీ స్క్రీన్ ప్లే అంటే ఏంటి అనే విషయాన్ని తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది. నిజానికి అయితే బ్యాక్ అండ్ ఫోర్త్ స్క్రీన్ ప్లే తో తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా సినిమాలు వచ్చాయి.

    ఇక పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన తీన్ మార్ సినిమా బ్యాక్ అండ్ ఫోర్త్ స్క్రీన్ ప్లే తోనే రన్ అవుతుంది. అంటే రెండు కథలను చూపిస్తూ అక్కడ ఇక్కడ పార్లర్ గా నడిపిస్తూ ఉంటారు. ఇక అంథాలాజీ స్క్రీన్ ప్లే అంటే ఏంటి అంటే ఒకే సమయంలో మూడు నాలుగు కథలు రన్ అవుతూ ఉండడం, వాటిని ఒకచోట కలపడం జరుగుతుంది. ఇక ఈ స్క్రీన్ ప్లే కి ఎగ్జాంపుల్ గా వేదం సినిమాను తీసుకోవచ్చు.

    మరి మొత్తానికైతే స్క్రీన్ ప్లే విషయంలో మన దర్శకులు ఈ మధ్యకాలంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన క సినిమా స్క్రీన్ ప్లే అయితే చాలా బెస్ట్ గా ఉందనే చెప్పాలి. నిజానికి ఒక సినిమా మీద స్క్రీన్ ప్లే అనేది విపరీతమైన ప్రభావాన్ని చూపిస్తుంది.

    కథ రొటీన్ గా ఉన్నా కూడా స్క్రీన్ ప్లే లో వైవిధ్యం ఉంటే మాత్రం ప్రేక్షకుడు ఎంగేజింగ్ ఆ సినిమాను చూడడానికి ఇష్టపడుతూ ఉంటారు. అందువల్లే సినిమా సక్సెస్ లో స్క్రీన్ ప్లే అనేది కీలకపాత్ర వహిస్తుందనే చెప్పాలి… అందుకే ప్రతి దర్శకుడు కూడా స్క్రీన్ ప్లే మీద ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటాడు. ఇక రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ కూడా స్క్రీన్ ప్లే మీదనే భారీ కసరత్తులు చేస్తూ ముందుకు సాగుతాడు…