https://oktelugu.com/

War 2 NTR : వార్ 2 లో ఎన్టీయార్ ఇంట్రడక్షన్ సీన్ కోసం అన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారా..?తారక్ బాలీవుడ్ ఎంట్రీ మామూలుగా లేదుగా..?

ప్రస్తుత జనరేషన్ లో ఉన్న చాలా మందికి సినిమా అంటే ఇష్టం ఉంటుంది. నిజానికి చాలామంది సినిమా మీద ఆధారపడి బతుకుతూ ఉంటారు. మరి కొంతమంది మాత్రం సినిమాని ఎంటర్టైన్మెంట్ గా భావించి తమ బాధను మర్చిపోవడానికి సినిమాలను చూస్తూ ఉంటారు. ఇక ఏది ఏమైనా కూడా సినిమా అనేది ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకంగా వినోదాన్ని పంచుతూనే ఉంటుంది...

Written By: , Updated On : October 25, 2024 / 04:40 PM IST
Are you spending all the crores for NTR's introduction scene in War 2? Tarak's Bollywood entry is not normal..?

Are you spending all the crores for NTR's introduction scene in War 2? Tarak's Bollywood entry is not normal..?

Follow us on

War 2 NTR : తెలుగు సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ కి చాలా మంచి గుర్తింపు అయితే ఉంది. ఆయన చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో తనదైన రీతిలో గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా తనను మించిన నటుడు మరొకరు లేరు అనేంతలా కూడా పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నాడు. ఇక రీసెంట్ గా ‘దేవర’ సినిమాతో సక్సెస్ ని అందుకున్న ఆయన ఇప్పుడు బాలీవుడ్ లో హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 అనే సినిమాలో నటిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో ఆయన చాలా పవర్ ఫుల్ పాత్రలో నటించబోతున్నాడు అంటూ సినిమా యూనిట్ నుంచి కొన్ని వార్తలైతే వస్తున్నాయి. మరి ఏది ఏమైనా కూడా ఆయన ఈ సినిమాతో భారీ సక్సెస్ ని సాధిస్తానని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఇక దానికి తగ్గట్టుగానే దర్శకుడు కూడా ఎన్టీఆర్ క్యారెక్టర్ మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఆయన ఇంట్రడక్షన్ సీన్ షూట్ చేయడానికి దాదాపు పది రోజులపాటు ఒక షెడ్యూల్ ను ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. ఇక దీనికోసం దాదాపు 10 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక మొత్తానికైతే కేవలం జూనియర్ ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీన్ కోసమే 10 కోట్ల రూపాయలను ఖర్చు చేయడం అంటే మామూలు విషయం కాదు.

ఇక అది ఏ రేంజ్ లో ఉండబోతుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక మొత్తానికైతే జూనియర్ ఎన్టీఆర్ లాంటి నటులు తెలుగు సినిమా ఇండస్ట్రీని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లడం లో చాలా వరకు కృషి చేస్తున్నాడు. ఇక రీసెంట్ గా ఆయన చేసిన సినిమాలన్నీ మంచి సక్సెస్ లను సాధిస్తూ ఉండడంతో బాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఎన్టీఆర్ సినిమాల మీద ఆసక్తి చూపిస్తున్నారు.

నిజానికి ఆయన చేస్తున్న ప్రతి సినిమా డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కడమే కాకుండా ఆయనలోని నటన ప్రతిభను బయటకు తీసిన సినిమాలు కూడా కావడం విశేషం… ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళుతున్న జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ లో మొదటి సినిమాలోని ఇంట్రడక్షన్ సీన్ చాలా భారీగా ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటున్నాడు అంటే మామూలు విషయం కాదు.

ఇక మొత్తానికైతే జూనియర్ ఎన్టీఆర్ నటించిన ప్రతి సినిమాలో ఆయనకు భారీ యాక్షన్ ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఇక ఈ సినిమాలో కూడా చాలా వరకు ఆయన చేయనటువంటి భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ని దీంట్లో ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది…