directors : సౌత్ లో టాప్ 5 స్టార్ కమర్షియల్ డైరెక్టర్స్ వీళ్లేనా..?
సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలను చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు. ఇక ఒక్కసారి సక్సెస్ సాధిస్తే వాళ్ళకి పాన్ ఇండియాలో మార్కెట్ పెరగడమే కాకుండా తమకంటూ ఒక సెపరేట్ ఐడెంటిటీ ని కూడా క్రియేట్ చేసుకుంటారు...
directors : ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో సౌత్ సినిమా ఇండస్ట్రీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఎందుకంటే ఇక్కడి నుంచి సినిమాలు చేస్తున్న ప్రతి దర్శకుడు కూడా పాన్ ఇండియాలో సక్సెస్ సాధిస్తున్నారు. ముఖ్యంగా కమర్షియల్ డైరెక్టర్ గా గుర్తింపు సంపాదించుకున్న టాప్ 5 దర్శకులు ఎవరో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
రాజమౌళి
తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన ప్రస్తానాన్ని మొదలు పెట్టిన రాజమౌళి బాహుబలి సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. ఇక కమర్షియల్ డైరెక్టర్ గా గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో తనను మించిన దర్శకుడు మరొకరు లేరు అనేంతల పెను సంచలనాలను సృష్టిస్తున్నాడు…
సందీప్ రెడ్డి వంగ
అర్జున్ రెడ్డి సినిమాతో ఒక డిఫరెంట్ అటెంప్ట్ ని అందించిన ఆయన అనిమల్ సినిమాతో కమర్షియల్ డైరెక్టర్ గా మారిపోయాడు. ఈ సినిమా దాదాపు 900 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టిందంటే మామూలు విషయం కాదు. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో ఆయన కమర్షియల్ గా సూపర్ సక్సెస్ అయ్యాడు…
అట్లీ
తమిళ్ సినిమా దర్శకుడు అయినప్పటికీ ఈయనకి ఇండియా వైడ్ గా మంచి మార్కెట్ అయితే ఉంది. ఆయన మొదటగా చేసిన రాజా రాణి సినిమాతో ప్రేక్షకుల్లో ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఈయన ఆ తర్వాత చేసిన అన్ని సినిమాలతో కమర్షియల్ డైరెక్టర్ గా తనని తాను ఎలివేట్ చేసుకునే ప్రయత్నం అయితే చేశాడు… ఇక ఏది ఏమైనా కూడా ప్రస్తుతం ఆయన ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే టాప్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు…
ప్రశాంత్ నీల్
కేజీఎఫ్ సినిమాతో తనకంటూ భారీ మార్కెట్ ని క్రియేట్ చేసుకున్న ఈయన ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు. ఇక కమర్షియల్ సినిమాలను తీయడంలో ఈయనకు సపరేట్ స్టైల్ ఉంది. అందులో భాగంగానే ఆయన చేసిన ప్రతి సినిమా డార్క్ మోడ్ లో ఉండడమే కాకుండా భారీ కలెక్షన్స్ ను కూడా సంపాదించి పెడుతున్నాయి. ఇక ప్రభాస్ తో చేసిన సలార్ సినిమా కమర్షియల్ గా సూపర్ సక్సెస్ సాధించింది. ఈ సినిమాతో దాదాపు 800 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ కూడా క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ తో డ్రాగన్ అనే సినిమా చేస్తున్నాడు…
సుకుమార్
సుకుమార్ మొదట్లో డిఫరెంట్ సినిమాలను తెరకెక్కించాడు. కానీ రంగస్థలం సినిమాతో కమర్షియల్ డైరెక్టర్ గా మారిపోయాడు. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు చేస్తున్న అన్ని సినిమాలు కమర్షియల్ ఎలిమెంట్స్ తోనే ముందుకు సాగుతున్నాయి. ప్రస్తుతం ఆయన ‘పుష్ప 2’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు…