https://oktelugu.com/

Ghati : ‘ఘాటి’ ఫస్ట్ లుక్ తో అరుంధతి మూవీ జ్ఞాపకాలను గుర్తు చేస్తున్న అనుష్క..

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోయిన్లు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్నప్పటికి అనుష్క లాంటి స్టార్ హీరోయిన్ మాత్రం తమదైన రీతిలో సినిమా చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తుంది...

Written By:
  • Gopi
  • , Updated On : November 7, 2024 / 10:56 AM IST

    Anushka reminiscing the memories of Arundhati movie with 'Ghati' first look..

    Follow us on

    పూరి జగన్నాధ్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా వచ్చిన ‘సూపర్ ‘ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ కి పరిచయం అయిన అనుష్క మొదటి సినిమాతోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది. ఇక ఈ సినిమాతో అనుష్క తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఈ అనుష్క ఇప్పుడు క్రిష్ డైరెక్షన్ లో ‘ఘాటి ‘ అనే సినిమా చేస్తుంది. ఈ సినిమాతో తనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటి ని క్రియేట్ చేసుకుంటుందనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాగా రాబోతున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా అనుష్క క్రిష్ కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా కావడంతో ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాతో అనుష్క తప్పకుండా సక్సెస్ కొట్టాలి అంటూ కొంతమంది వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి ఈరోజు అనుష్క బర్త్ డే సందర్భంగా ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. అందులో అనుష్క చాలా వైల్డ్ లుక్ లో కనిపిస్తుంది.

    గంజాయి కొడుతూ ఒక రాజసం ఉట్టిపడేలా దిగిన ఆ ఫోటోను చూస్తే దర్శకుడు సినిమా స్టోరీ కి తగ్గట్టుగానే ఆ పోస్టర్ ను చాలా వైల్డ్ గా డిజైన్ చేసి రిలీజ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక ఆ పోస్టర్ ను చూస్తుంటే ఇంతకు ముందు అనుష్క చేసిన ‘అరుంధతి’ సినిమా గుర్తుకు వస్తుంది…మరి ఈ పాత్ర కూడా అంతే పవర్ ఫుల్ గా ఉంటుందా లేదా అనేది తెలియాల్సి ఉంది…అయితే ఈ సినిమా నుంచి ఇవాళ్ళ నాలుగు గంటల ఐదు నిమిషాలకు గ్లింప్స్ కూడా రిలీజ్ కాబోతుందనే విషయాన్ని చిత్ర యూనిట్ అనౌన్స్ చేశారు. మరి మొత్తానికైతే ‘ఘాటి’ సినిమాతో అనుష్క మరోసారి ఒక పెను ప్రభంజనాన్ని సృష్టించడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా మాత్రం అనుష్కకి చాలా కీలకంగా మారబోతుంది.

    బాహుబలి సినిమా తర్వాత ఆమె చేసిన సినిమాలు ఏవి పెద్దగా సక్సెస్ లను సాధించడం లేదు. కాబట్టి ఈ సినిమాతో తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాల్సిన అవసరమైతే ఏర్పడనుంది. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో ఆమె ఒక మంచి గుర్తింపును సంపాదించుకుంటే మాత్రం మరికొన్ని సంవత్సరాలపాటు సినిమా ఇండస్ట్రీలో ఆమె కొనసాగుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడంలో ఆమె ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుంది…

    ఇక క్రిష్ ఇప్పటికే పవన్ కళ్యాణ్ తో చేస్తున్న హరి హర వీరమల్లుసినిమా నుంచి తప్పుకున్నాడు కాబట్టి ఆయన ఈ సినిమాతో సక్సెస్ ని సాధిస్తేనే మరోసారి లైన్ లోకి వస్తాడు లేకపోతే మాత్రం ఇండస్ట్రీ నుంచి ఫేయిడ్ అవుట్ అయిపోయే దశకు చేరుకోవాల్సిన పరిస్థితి అయితే రావచ్చు. మొత్తానికైతే క్రిష్ ఈ సినిమాతో ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు అంటూ సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేయడం విశేషం… మరి గ్లింప్స్ వస్తే ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనే దాని మీద పూర్తి క్లారిటీ వస్తుంది…