https://oktelugu.com/

Anil Ravipudi : సంక్రాంతికి వస్తున్నాం’ అంటూ టైటిల్ రివిల్ చేసిన అనిల్ రావిపూడి…ఈ మూవీ ఎలా ఉండబోతుంది..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్లను వాళ్ళు స్టార్ హీరోలుగా ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక అందులో భాగంగానే వాళ్ళు సాధించిన విజయాలు కూడా చాలా గొప్ప విజయాలు కావడంతో ప్రేక్షకులు కూడా వాళ్లకు నీరాజనాలు పడుతున్నారు...

Written By:
  • Gopi
  • , Updated On : November 1, 2024 / 03:10 PM IST

    Anil Ravipudi who revealed the title as 'Sankranti Ayamanam'...how is this movie going to be..?

    Follow us on

    Anil Ravipudi : అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా వస్తున్న సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూట్ మరొక షెడ్యూల్ బ్యాలెన్స్ ఉండగా మిగతా షూట్ మొత్తం కంప్లీట్ అయింది. ఈ ఒక్క షెడ్యూల్ తో సినిమా మొత్తాన్ని కంప్లీట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది…అలాగే ఈ సినిమాను సంక్రాంతి కి తీసుకువరానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఇప్పటికే దిల్ రాజు రామ్ చరణ్ హీరోగా వస్తున్న గేమ్ చేంజర్ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇక ఈ సినిమాతో పాటుగా వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా టైటిల్ కూడా ‘సంక్రాంతికి వస్తున్నాం’ అని పెట్టారు. ఇక ఈ సినిమాను కూడా సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్టుగా అనిల్ రావిపూడి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ని పెట్టారు. ఇక మొత్తానికైతే ఈ సినిమాకి సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్ ని పెట్టడం అనేది ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

    ఇక ఈ సినిమాని కూడా సంక్రాంతికి రిలీజ్ చేయడం అనేది ఒక గొప్ప విషయం అనే చెప్పాలి. ఇక అనిల్ రావిపూడి మిత్రులు మొదటి నుంచి కూడా యాక్షన్ ఎంటర్ టైనర్ లనే చేస్తూ వస్తున్నాడు. ఈ సినిమా కూడా యాక్షన్ ఎంటర్ టైనర్ కావడం విశేషం…ఇక అనిల్ రావిపూడి సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా బాగా ఎంటర్ టైన్ చేస్తూ ఉంటాయి.

    ఇక ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే… ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో మరోసారి భారీ సక్సెస్ ని సాధించాలని అనిల్ రావిపూడి గట్టి ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా కూడా సూపర్ సక్సెస్ ని సాధించిన విషయం మనందరికీ తెలిసిందే…ఇక ఇంతకు ముందు బాలయ్య బాబు తో చేసిన భగవంత్ కేసరి సినిమా భారీ సక్సెస్ ను అందుకున్న ఆయన ఇప్పుడు వెంకటేష్ తో ‘సంక్రాంతికి వస్తున్నాం’. అనే సినిమాతో కూడా భారీ సక్సెస్ ని సాధించాలని చూస్తున్నాడు.

    ఇక అనిల్ రావిపూడి ఏది చేసినా కూడా చాలా ప్లాన్ ప్రకారం చేస్తాడనే విషయం మనకు తెలిసిందే. కాబట్టి ఈ సినిమాని కూడా సంక్రాంతికి రిలీజ్ చేసి సక్సెస్ సాధించాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక దిల్ రాజు ఈ సంక్రాంతికి రెండు సినిమాలను రిలీజ్ చేస్తూ థియేటర్స్ మొత్తాన్ని తనే అక్యుపై చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది…