https://oktelugu.com/

Amaran & Kangua : ‘అమరన్’ 16వ రోజు వసూళ్లు > ‘కంగువా’ 2వ రోజు వసూళ్లు..సూర్య కి ఇంతకంటే అవమానం మరొకటి ఉండదు!

సుమారుగా మూడేళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత తమిళ హీరో సూర్య మన ముందుకి 'కంగువా' చిత్రంతో వచ్చిన సంగతి తెలిసిందే. గత కోనేళ్ళుగా సరైన బ్లాక్ బస్టర్ హిట్ లేక ఇబ్బంది పడుతున్న సూర్య, ఈ చిత్రంతో భారీ కం బ్యాక్ ఇస్తాడని అందరూ ఆశించారు

Written By:
  • Vicky
  • , Updated On : November 16, 2024 / 04:10 PM IST

    'Amaran' 16th day collections > 'Kangua' 2nd day collections..Suriya can't have any more shame than this!

    Follow us on

    Amaran & Kangua :  సుమారుగా మూడేళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత తమిళ హీరో సూర్య మన ముందుకి ‘కంగువా’ చిత్రంతో వచ్చిన సంగతి తెలిసిందే. గత కోనేళ్ళుగా సరైన బ్లాక్ బస్టర్ హిట్ లేక ఇబ్బంది పడుతున్న సూర్య, ఈ చిత్రంతో భారీ కం బ్యాక్ ఇస్తాడని అందరూ ఆశించారు. కానీ అది జరగలేదు. విడుదలైన మొదటి ఆట నుండే ఈ సినిమాకి డిజాస్టర్ టాక్ వచ్చింది. సినిమా ప్రారంభం నుండి చివరి వరకు అరుపులు తప్ప స్టోరీ లేదని, ఇంతటి చెత్త సినిమాని ఇప్పటి వరకు ఎప్పుడూ చూడలేదని సూర్య అభిమానులు సైతం సోషల్ మీడియా లో పోస్టులు పెట్టారు. ఈ టాక్ ఒక రేంజ్ లో వ్యాప్తి చెందడంతో సినిమా వసూళ్లపై ఘోరమైన ప్రభావం చూపించింది. రెండవ రోజు అయితే ఈ సినిమాకి తమిళనాడు లో 16 రోజుల క్రితం విడుదలైన శివ కార్తికేయన్ ‘అమరన్’ కంటే తక్కువ వసూళ్లు వచ్చాయి.

    అమరన్ చిత్రానికి 16వ రోజు తమిళనాడు లో 5 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, కంగువా చిత్రానికి రెండవ రోజు కేవలం 4 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. ఇది సూర్య కి ఘోరమైన అవమానం అనే చెప్పాలి. 150 కోట్ల రూపాయలకు పైగా భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఒక సినిమాకి రెండవ రోజు ఈ స్థాయి డిజాస్టర్ వసూళ్లు రావడం అనేది సూర్య దురదృష్టం అనే చెప్పాలి. డైరెక్టర్ శివ ని నమ్మి మూడేళ్ళ విలువైన సమయాన్ని ఇవ్వడమే సూర్య చేసిన అతి పెద్ద తప్పు. ప్రపంచవ్యాప్తంగా రెండవ రోజు 14 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమాకి, రెండు రోజులకు కలిపి ప్రాంతాలవారీగా ఎంత వసూళ్లు వచ్చాయో ఒకసారి చూద్దాం.

    తమిళనాడు లో రెండు రోజులకు కలిపి 16 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, తెలుగు రాష్ట్రాల్లో 8 కోట్ల 65 లక్షల రూపాయిలు, కర్ణాటకలో మూడు కోట్ల రూపాయిలు, కేరళలో 4 కోట్ల 65 లక్షల రూపాయిలు, రెస్ట్ ఆఫ్ ఇండియా లో 7 కోట్ల 50 లక్షల రూపాయిలు, ఓవర్సీస్ లో 15 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా రెండు రోజులకు కలిపి ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి 55 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. మొదటి రోజు వంద కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టేంత సత్తా ఉన్న ఈ సినిమాకి, రెండు రోజులకు కలిపి అందులో సగం గ్రాస్ వసూళ్లు రాబట్టడం దురదృష్టకరం. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 180 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టాలి. ఇప్పటి వరకు కేవలం 26 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఫుల్ రన్ లో 60 కోట్ల రూపాయిల షేర్ కూడా వచ్చేలా లేదు, దీనిని బట్టి ఈ సినిమా ఏ రేంజ్ డిజాస్టర్ అనేది అర్థం చేసుకోవచ్చు.