https://oktelugu.com/

Allu Arjun : అల్లు అర్జున్ మొదటి రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..?సీరియల్ ఆర్టిస్ట్ కంటే దారుణంగా ఇచ్చారుగా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ప్రత్యేకతను చాటుకుంటూ ముందుకు సాగుతున్నారు. అందులో కొంతమంది స్టార్ హీరోలుగా మారుతుంటే, మరి కొంతమంది మాత్రం సక్సెస్ లను సాధించలేక డీలాపడిపోతున్నారు...ఇక ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోల్లో ఒకరైన అల్లు అర్జున్ మాత్రం ఇండియాలోనే వన్ ఆఫ్ ది టాప్ హీరోగా ఎదిగాడు...

Written By:
  • Gopi
  • , Updated On : October 26, 2024 / 05:31 PM IST

    Allu Arjun will be shocked if he knows the first remuneration..?Was worse than a serial artist..?

    Follow us on

    Allu Arjun : అల్లు అరవింద్ కొడుకుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ముఖ్యంగా కే రాఘవేందర్రావు దర్శకత్వంలో తెరకెక్కిన గంగోత్రి సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన ఆయన ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా వెలుగొందుతున్నాడు. మొదట్లో మెగా ఫ్యామిలీ హీరోగా చెప్పుకుంటూ సక్సెస్ లను అందుకున్న ఈయన ఇప్పుడు మాత్రం అల్లు ఫ్యామిలీ హీరో గానే గుర్తింపబడుతున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా ‘పుష్ప 2’ సినిమాతో మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టించడానికి రెడీ అవుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక ప్రస్తుతం భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ఆయన తన మొదటి సినిమా కోసం తీసుకున్న రెమ్యూనరేషన్  ఎంత అనేదాని మీద ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతమైన చర్చలైతే నడుస్తున్నాయి. నిజానికైతే ఆయన మొదటి సినిమాకి చాలా తక్కువ  రెమ్యూనరేషన్ తీసుకున్నారట.
    సినిమా ఇండస్ట్రీ కి తను ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయితే చాలు అనుకున్నారట అందుకే ఆయన రెమ్యూనరేషన్ గురించి పెద్దగా పట్టించుకోకుండా ఆ సినిమాని పూర్తి చేశారట. గంగోత్రి మొత్తం సినిమాకి గాని ఆయన ఒక కేవలం 3 లక్షల రూపాయలు మాత్రమే రెమ్యూనరేషన్ గా తీసుకున్నారట. నిజానికి సీరియల్ ఆర్టిస్ట్ పకు కూడా అంతకంటే ఎక్కువ అమౌంట్ ఇస్తారని అప్పట్లో అల్లు అర్జున్ ను హేళన చేశారట.
    ఇక ఏది ఏమైనా కూడా ఆయన ఎక్కడ నుంచి ఏ స్థాయికి ఎదిగాడో దాన్ని మనం అబ్జర్వ్ చేసినట్లైతే ఆయన టాలెంట్ ఏంటో మనకు ఈజీగా అర్థమవుతుంది. అందుకే అల్లు అర్జున్ తనదైన రీతిలో సినిమాలు చేయడానికి ఎప్పుడు ఆసక్తి చూపిస్తూ ఉంటాడు. ఒక్కసారి ఆయన ఒక సినిమాకి కమిట్ అయ్యాడు అంటే ఆ సినిమా మీద చాలా డెడికేషన్ తో వర్క్ చేస్తూ ఉంటాడు. ఇక కెరియర్ మొదట్లో లక్షల్లో రెమ్యూనరేషన్ తీసుకున్న ఆయన ఇప్పుడు ఏకంగా వందల కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే స్థాయికి ఎదగడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి. ఇక ఈ సినిమాతో ఏకంగా 1500 కోట్ల వరకు కలెక్షన్లను రాబట్టాలనే లక్ష్యంతో ముందుకు దూసుకెళుతున్నట్టుగా తెలుస్తోంది.
    ఇది కనక సక్సెస్ అయితే మాత్రం అల్లు అర్జున్ కెరియర్ టాప్ గేర్ లో దూసుకుపోతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…ప్రస్తుతం ఆయన ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నాడు. డిసెంబర్ 5వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యం లో ఈ సినిమా కోసం భారీ ప్రమోషన్స్ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు…