https://oktelugu.com/

Allu Arjun & Prabhas : ప్రభాస్ ని దాటేసిన అల్లు అర్జున్, పక్కా ప్లాన్ తో వస్తున్న పుష్ప 2

విడుదలకు ముందే పుష్ప 2 రికార్డుల మోత మోగిస్తుంది. ఏకంగా ప్రభాస్ ని దాటేశాడు అల్లు అర్జున్. పుష్ప 2కి ఆయన తీసుకున్న రెమ్యునరేషన్ తెలిస్తే మైండ్ బ్లాక్ కావాల్సిందే. ఆ వివరాలు ఏమిటో చూద్దాం..

Written By:
  • S Reddy
  • , Updated On : October 26, 2024 / 10:51 AM IST

    Allu Arjun who passed Prabhas, Pushpa 2 is coming with a clear plan

    Follow us on

    Allu Arjun & Prabhas : అల్లు అర్జున్ ఇమేజ్ ని పుష్ప తారాస్థాయికి చేర్చింది. గతంలో అల్లు అర్జున్ కి తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళలో మాత్రమే మార్కెట్ ఉంది. పుష్ప తో నార్త్ లో ఎవరూ చేరుకోని స్థాయికి అల్లు అర్జున్ చేరాడు. హిందీ ఆడియన్స్ అల్లు అర్జున్ అంటే చొక్కాలు చించుకునే పరిస్థితి ఉంది. 2021లో విడుదలైన పుష్ప హిందీ వెర్షన్ రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. పుష్ప 2 హిందీ హక్కులు రూ. 200 కోట్లకు అమ్మారు. ఇది ప్రభాస్ కల్కి మూవీ హక్కుల కంటే ఎక్కువ. 
     
    థియేట్రికల్, నాన్ థియేట్రికల్ హక్కులతో పుష్ప 2 రూ. 1000 కోట్ల బిజినెస్ చేసింది. అంటే విడుదలకు ముందే నిర్మాతలు భారీగా లాభపడ్డారు. కాగా పుష్ప 2కి అల్లు అర్జున్ తీసుకున్న రెమ్యునరేషన్ హాట్ టాపిక్ గా మారింది. ఏకంగా ప్రభాస్ ని కూడా అల్లు అర్జున్ దాటేశాడట. ప్రస్తుతం టాలీవుడ్ లో ప్రభాస్ అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఆయన సినిమాకు రూ. 150 కోట్ల వరకు ఛార్జ్ చేస్తున్నారు. 
     
    అనూహ్యంగా అంతకు రెండు రెట్లు అల్లు అర్జున్ పుష్ప 2 చిత్రానికి రెమ్యూనరేషన్ రూపంలో ఆర్జించారట. ఈ చిత్రానికి అల్లు అర్జున్ లాభాల్లో వాటా అడిగారట. ఈ మేరకు నిర్మాతలతో ముందే ఒప్పందం అయ్యిందట. ఈ క్రమంలో రూ. 300 కోట్లు అల్లు అర్జున్ కి దక్కాయట. పుష్ప ముందు వరకు అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ రూ. 40 కోట్లు కూడా లేదు. మూడేళ్ళ వ్యవధిలో ఆయన వందల కోట్లు తీసుకునే స్థాయికి ఎదిగాడు. 
     
    నార్త్ లో కలెక్షన్స్ పరంగా ప్రభాస్ ని బీట్ చేయడమే లక్ష్యంగా అల్లు అర్జున్ ముందుకు వెళుతున్నాడు. ప్రభాస్ నటించిన బాహుబలి 2 హిందీ వెర్షన్ రూ. 500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. పుష్ప 2 ఈ మార్క్ చేరుకోవడం ఖాయమని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. మరి అదే జరిగితే టాలీవుడ్ నుండి ప్రభాస్ తర్వాత అతిపెద్ద స్టార్ గా అల్లు అర్జున్ అవతరిస్తాడు. 
     
    మరోవైపు పుష్ప 2 విడుదల తేదీ మరోసారి మారింది. డిసెంబర్ 6వ తేదీన విడుదల కావాల్సిన చిత్రాన్ని ఒకరోజు ముందే విడుదల చేస్తున్నారు. డిసెంబర్ 5న పుష్ప 2 విడుదల కానున్నట్లు నిర్మాతలు తెలియజేశారు. ఆగస్టు 15న విడుదల కావాల్సిన ఈ చిత్రం షూటింగ్ డిలే కావడంతో డిసెంబర్ కి పోస్ట్ ఫోన్ అయ్యింది. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ కి జంటగా రష్మిక మందాన నటిస్తుంది.