Allu Arjun : ఎట్టకేలకు ఆ రాజకీయ పార్టీ తో నాకు సంబంధం లేదని ఒప్పుకున్న అల్లు అర్జున్…

ప్రస్తుతం తనదైన రీతిలో సినిమాలను చేస్తున్న హీరోలలో అల్లు అర్జున్ ఒకరు. ఇంతకు ముందు పుష్ప సినిమాతో పాన్ ఇండియాలో భారీ సక్సెస్ ని అందుకున్న ఆయన ఇప్పుడు పుష్ప 2 తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. డిసెంబర్ 6వ తేదీన ఈ సినిమాని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న ఫిలిం మేకర్స్ ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ ని అందుకుంటామని చాలా కాన్ఫిడెంట్ ని వ్యక్తం చేస్తున్నారు...

Written By: Gopi, Updated On : October 24, 2024 8:46 am

Allu Arjun finally admitted that he has nothing to do with that political party

Follow us on

Allu Arjun : తెలుగు సినిమా ఇండస్ట్రీలో అల్లు అర్జున్ కి చాలా ప్రత్యేకమైన గుర్తింపైతే ఉంది. ఆర్య సినిమాతో తనకంటూ ఒక రేంజ్ ను సెట్ చేసుకున్న ఆయన యూత్ లో మంచి ఫాలోయింగ్ అయితే ఏర్పాటు చేసుకున్నాడు. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు వెను తిరిగి చూడకుండా ప్రతి ఒక్క సినిమాతో తనను తాను డిఫరెంట్ గా ప్రజెంట్ చేసుకుంటూ ఒక్కో మెట్టు పైకెక్కుతూ వచ్చాడు. మొత్తానికైతే ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. అలాగే ఐకాన్ స్టార్ గా తనను తాను రిప్రజెంట్ చేసుకున్న విధానం కూడా చాలా అద్భుతంగా ఉందని బాలీవుడ్ ప్రేక్షకులు సైతం ఆయన సినిమాలను చూడడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ ఖ్యాతిని పెంచడంలో చాలావరకు కృషి చేస్తున్నాడు. మరి ఇలాంటి అల్లు అర్జున్ ఇంతకుముందు ఒక వివాదంలో ఇరుక్కున్న విషయం మనకు తెలిసిందే. నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి ని సపోర్ట్ చేయడానికి వెళ్లి 144 సెక్షన్ ని ఉల్లంఘించాడనే ఉద్దేశ్యంతోనే అక్కడ ఆయన మీద ఒక కేసు అయితే నమోదైంది. మరి ఇప్పుడు ఆ కేసు మీద అల్లు అర్జున్ కొంత సీరియస్ గా వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తోంది.
అది ఏంటి అంటే ఆ కేసు తో నాకు సంబంధం లేదు నేను ఊరికే ఎమ్మెల్యే క్యాండిడేట్ ని కలవడానికి వెళ్లాను కానీ అక్కడ అనుకోకుండా క్రౌడ్ అనేది రావడం జరిగింది. దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు ఈ కేసును కొట్టివేయాలంటూ ఏపీ హైకోర్టులో ఆయన పిటిషన్ ని దాఖలు చేశాడు.
మరి మొత్తానికైతే అల్లు అర్జున్ తన మీద ఏ కేసు ఉండకూడదనే ఉద్దేశంతోనే ఇలాంటి ఒక నిర్ణయానికి వచ్చాడంటు చర్చలైతే జరుగుతున్నాయి. మరి అతని కేసుని పరిగణలోకి తీసుకున్న కోర్టు అతనికి జరిమానా వేసి కేసు క్లోజ్ చేస్తుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది… ఇక మొత్తానికైతే ఐకాన్ బాబు తనదైన రీతిలో సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్ళడం అనేది అతని అభిమానులను ఆనందానికి గురిచేస్తుంది.
ఇక పుష్ప 2 సినిమాతో పెను ప్రభంజనాన్ని సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకొని తను బరిలోకి దిగుతున్నాడు… ఇక దానికోసమే ఆయన మీద ఎలాంటి కేసులు ఉండకూడదని ఎలాంటి వివాదాల్లో తను ఇరుక్కోకూడదనే ఉద్దేశ్యంతోనేప్పుడు ఆచితూచి అడుగులు వేస్తున్నాడు…