https://oktelugu.com/

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ చిత్రానికి సంగీతం అందించనున్న అకిరా నందన్..వైరల్ అవుతున్న థమన్ లేటెస్ట్ కామెంట్స్!

పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటుగా, ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం 'ఓజీ'. ఈ సినిమా ప్రారంభ దశ నుండే అంచనాలు ఎవ్వరూ ఊహించని రేంజ్ లో ఉండేవి. ఎప్పుడైతే ఈ చిత్రం నుండి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా గ్లిమ్స్ వీడియో ని విడుదల చేసారో, అప్పటి నుండి అంచనాలు పదింతలు ఎక్కువ అయ్యింది

Written By:
  • Vicky
  • , Updated On : November 16, 2024 / 04:58 PM IST

    Akira Nandan to compose music for Pawan Kalyan's 'Oji'.. Thaman's latest comments are going viral!

    Follow us on

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటుగా, ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘ఓజీ’. ఈ సినిమా ప్రారంభ దశ నుండే అంచనాలు ఎవ్వరూ ఊహించని రేంజ్ లో ఉండేవి. ఎప్పుడైతే ఈ చిత్రం నుండి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా గ్లిమ్స్ వీడియో ని విడుదల చేసారో, అప్పటి నుండి అంచనాలు పదింతలు ఎక్కువ అయ్యింది. పవన్ కళ్యాణ్ ప్లాన్ ప్రకారం వెళ్లుంటే ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ 27 న విడుదల అయ్యేది. కానీ సార్వత్రిక ఎన్నికల హడావుడిలో పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్స్ కి బ్రేక్ ఇచ్చాడు. దీంతో సెప్టెంబర్ 27 న విడుదల అవ్వాల్సిన ఈ సినిమా వచ్చే ఏడాదికి వాయిదా పడింది. వచ్చే ఏడాది మార్చి 27వ తారీఖున విడుదల చేయాలనీ మేకర్స్ పట్టుబడుతున్నారు. కానీ అదే తేదికి పవన్ కళ్యాణ్ మరో చిత్రం ‘హరి హర వీరమల్లు’ ని విడుదల చేయబోతున్నట్టు ఆ చిత్ర నిర్మాత ఏఎం రత్నం అధికారిక ప్రకటన చేసాడు.

    అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తి అవ్వడానికి చాలా సమయం పట్టేట్టు ఉందట, అంతే కాకుండా గ్రాఫిక్స్ వర్క్ మీద ఆధారపడిన సినిమా కాబట్టి, పోస్ట్ ప్రొడక్షన్ కి బాగా సమయం పట్టేట్టు ఉండడంతో ఈ సినిమా అనుకున్న సమయానికి రాకపోవచ్చు అని, అందుకే ఆ చిత్రం స్థానంలో ఓజీ విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ట్రేడ్ లో ఒక వార్త బలంగా వినిపిస్తుంది. ఇది వరకు నిజమో చూడాలి. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా సంగీత దర్శకుడు థమన్ పవన్ కళ్యాణ్ అభిమానులు పూనకాలు వచ్చి ఊగిపోయే అప్డేట్ ఒకటి ఇచ్చాడు. అదేమిటంటే పవన్ కళ్యాణ్ కెరీర్ ప్రారంభంలో ఆయన సినిమాల్లో ఎన్నో అద్భుతమైన పాటలు పాడిన రమణ గోగులతో ఒక పాట పాడించే ఆలోచనలో ఉన్నాడట థమన్. ఈ విషయాన్నీ ఆయన ఒక ఇంటర్వ్యూ లో ఇటీవలే తెలిపాడు.

    అదే విధంగా ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ కొడుకు అకిరా నందన్ ఒక చిన్న పాత్రలో కనిపిస్తాడని సోషల్ మీడియాలో గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. అది నిజమో కాదో తెలియదు కానీ, అకిరా ఈ సినిమాల్లోని పాటలకు పియానో ట్యూన్ వర్క్ అందించబోతున్నాడట. అకిరా పియానో ఎంత అద్భుతంగా వాయిస్తాడో మన అందరికీ తెలిసిందే. సంగీతం పై విపరీతమైన ఇష్టమున్న అకిరా నందన్, థమన్ తో కలిసి ఎన్నో మ్యూజిక్ సెషన్స్ లో పాల్గొన్నాడట. త్వరలోనే అకిరా ఈ సినిమాకి పలు ట్యూన్స్ ఇవ్వబోతున్నాడని థమన్ స్వయంగా తెలిపాడు. ఓజీ లాంటి చిత్రం ఇప్పటి వరకు ఇండియన్ సినిమా హిస్టరీ లో రాలేదని, కచ్చితంగా ఈ సినిమాకి ఇండియా లోనే నెంబర్ 1 ఓపెనింగ్స్ వస్తాయని థమన్ చెప్పుకొచ్చాడు.