Directors : తెలుగు సినిమా డైరెక్టర్లకు పోటీ ఇస్తాను అంటున్న తమిళ్ స్టార్ డైరెక్టర్

సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అనేది అందరికీ రాదు కొందరికి మాత్రమే సక్సెసులు దక్కుతూ ఉంటాయి. మరి ఇలాంటి సందర్భంలో వాళ్లు చేసే సినిమాలు ఎలాంటి సక్సెస్ లను సాధిస్తాయి అనేది వాళ్ళు ఎంచుకున్న కాన్సెప్ట్ మీద గాని వాళ్ళు చేసే డైరెక్షన్ మీద ఆధారపడి ఉంటుంది...

Written By: Gopi, Updated On : November 8, 2024 10:55 am

A Tamil star director who says he will give competition to Telugu film directors

Follow us on

Directors : తమిళ్ ఇండస్ట్రీ లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకోవడమే కాకుండా ఆయన చేసిన విక్రమ్ సినిమా పాన్ ఇండియాలో భారీ సక్సెస్ ని సాధించింది. ఇక ఒక్కసారిగా పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిన ఆయన తనదైన రీతిలో సినిమాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా ఆయన చేసే ప్రతి సినిమా మీద భారీ హైపైతే క్రియేట్ అవుతుంది. ఇక తనదైన రీతిలో సినిమాలు చేయడానికి ఆయన ఎప్పుడు ముందు వరుసలో నిలుస్తున్నాడు. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఆయన లాంటి దర్శకుడు ఇండస్ట్రీలో మరొకరు ఉండరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక స్టైలిష్ మేకింగ్ తో తనదైన రీతిలో సినిమాలు చేయడానికి ఆయన ఎప్పుడూ ఆరాటపడుతూ ఉంటాడు…ఇక ప్రస్తుతం కూలీ సినిమా చేస్తున్న ఆయన ఆ తర్వాత విక్రమ్ 2, ఖైదీ 2 సినిమాలను పట్టాలెక్కించే పనిలో బిజీగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక దాంతో పాటుగా సూర్యతో కూడా మరొక సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడట. మరి ఈ సినిమా ఎప్పుడు పూర్తి చేస్తాడు అనే విషయంలో క్లారిటీ లేదు.

కానీ లోకేష్ యూనివర్స్ కింద ఈ హీరోలందరిని ఒకటి చేసి భారీ ఎలివేషన్స్ ఇవ్వడానికి కూడా తను సిద్ధమవుతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఇక తనదైన రీతిలో నటించి మెప్పించగలిగే నటులతో యాక్షన్ ఎపిసోడ్స్ ని కూడా చేయించగలిగే సత్తా ఉన్న లోకేష్ కనకరాజ్ తమిళ్ సినిమా ఇండస్ట్రీని పాన్ ఇండియా కి తీసుకెళ్లడంలో తన వంతు కృషి అయితే చేస్తున్నాడు.

ఇక ప్రస్తుతం రజనీకాంత్ తో చేస్తున్న కూలీ సినిమాను నెక్స్ట్ లెవెల్లో నిలపాలనే ప్రయత్నంలో ఉన్నాడు. అందుకోసమే రజనీకాంత్ మేనియా మొత్తాన్ని వాడడానికి తను సిద్ధం అవుతున్నట్టుగా తెలుస్తోంది… ఇక ఎలాగైనా సరే ఈ సినిమాను భారీ సక్సెస్ గా నిలిపితే లోకేష్ కనకరాజు తన పేరు ను నిలబెట్టుకున్న వాడు అవుతాడు. లియో సినిమాతో కొంతవరకు ఆయన క్రేజ్ తగ్గినప్పటికి ఇప్పుడు కూలీ సినిమాతో మాత్రం ఆయన తన సత్తా చూపించడానికి సిద్ధమవుతున్నాడు…

ఇక ఏది ఏమైనా కూడా లోకేష్ కనకరాజ్ మన తెలుగు డైరెక్టర్లందరూ పాన్ ఇండియాలో మంచి మార్కెట్ ను క్రియేట్ చేసుకుంటున్నారు. ఇక లోకేష్ కనకరాజ్ కూడా దానికి అతీతుడు కాదని నిరూపించుకోవడానికి సిద్దమవుతున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా తెలుగు సినిమా దర్శకులకు పోటీ ఇస్తాను అంటూ ఆయన కొన్ని కామెంట్స్ కూడా చేశాడు. మరి మన దర్శకులు నెలకొల్పిన రికార్డులను బ్రేక్ చేయగలుగుతాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…