Mahesh Babu : తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న హీరో మహేష్ బాబు… సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈయన తక్కువ సమయంలోనే సూపర్ సక్సెస్ లను అందుకొని సూపర్ స్టార్ గా ఎదిగాడు. ఇక ప్రస్తుతం రాజమౌళితో చేయబోతున్న సినిమా కోసం తీవ్రమైన కసరత్తులైతే చేస్తున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా ఆయన లాంటి నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ చాలా అరుదుగా ఉంటారు. నిజానికి ఆయన చేసిన సినిమాలన్నింటిలో ఆయన నటన ఒక డిఫరెంట్ వేరియేషన్ లో ఉంటుందనే చెప్పాలి. తెలుగులో ఎవరికి సాధ్యం కానీ రీతిలో మాస్ హీరోగా ఎదగడమే కాకుండా నటన పరంగా కూడా ఆయన చాలా వరకు తన వైవిధ్యాన్ని చూపిస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం ఇప్పుడు చేస్తున్న సినిమాతో పాన్ వరల్డ్ లోకి అడుగుపెడుతున్న మహేష్ బాబు ఇకమీదట తీయబోయే సినిమాలు మొత్తం భారీ లెవెల్లో ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. ఆయన చేసే ప్రతి సినిమా సూపర్ సక్సెస్ సాధించడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని కూడా క్రియేట్ చేస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే మహేష్ బాబు కెరియర్ స్టార్టింగ్ లో ఒక స్టార్ డైరెక్టర్ ఆయనతో సినిమా చేస్తానని చెప్పి చివరికి హ్యాండ్ ఇచ్చారట.
ఇంతకీ ఆ స్టార్ డైరెక్టర్ ఎవరు అంటే దాసరి నారాయణరావు అని తెలుస్తోంది. మహేష్ బాబు రాజకుమారుడు సినిమాని రాఘవేంద్రరావు డైరెక్షన్ లో చేసిన తర్వాత సూపర్ స్టార్ కృష్ణ మహేష్ బాబు తదుపరి సినిమాను దాసరి నారాయణరావు గారి కాంబినేషన్ లో చేయించాలని ప్రణాళికలు రూపొందించాడు.
కానీ అప్పటికే దాసరి గారు అటు పాలిటిక్స్, ఇటు సినిమాల్లో బిజీగా ఉండడం వల్ల ఈ సినిమా పట్టాలెక్కలేకపోయింది. నిజానికి మహేష్ బాబు ఎర్లీ స్టేజ్ లో దాసరి గారితో సినిమా చేసి ఉంటే అతనికి కెరియర్ పరంగా కూడా చాలా మంచి గ్రోత్ వచ్చేదని అప్పట్లో సినీ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేశారు.
ఇక ప్రస్తుతం దాసరి గారు ఇండస్ట్రీలో లేకపోవడం అందరికీ బాధను కలిగించే విషయమనే చెప్పాలి. ఎందుకంటే ఆయన సినిమాలు చేయడమే కాకుండా చాలా సినిమాల పంచాయతీలను కూడా సాల్వ్ చేసేవాడు. దానివల్ల చిన్న సినిమాలు ఎక్కువగా బతికేవి. ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసే వాలు లేకపోవడంతో సినిమా ఇండస్ట్రీ చాలా వరకు చిన్న డీలా పడుతున్నాయనే చెప్పాలి…