Malayalam star hero : తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్ళని వాళ్ళు స్టార్ హీరోలుగా ఎలివేట్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక దానికి అనుగుణంగానే వాళ్ళు చేస్తున్న ప్రతి సినిమా ప్రేక్షకుల్లో మంచి అంచనాలను రేకెత్తిస్తున్నాయి. ఇక మలయాళం హీరో అయిన దుల్కర్ సల్మాన్ తెలుగులో వరుసగా మూడు సినిమాలను చేసి మంచి విజయాలను అందుకున్నాడు.ఈయన వల్ల ముగ్గురు స్టార్ డైరెక్టర్లు లైమ్ లైట్లోకి వచ్చారనే చెప్పాలి. ముఖ్యంగా ‘మహానటి’ సినిమాతో నాగ్ అశ్విన్ దర్శకుడిగా భారీ గుర్తింపు ను సంపాదించుకోవడమే కాకుండా ఆ సినిమాతో ప్రభాస్ ను సైతం డైరెక్షన్ చేసే స్థాయికి ఎదిగిపోయాడు. ఇక ఆ తర్వాత ఆయన ప్రభాస్ తో కల్కి సినిమా చేసి సూపర్ సక్సెస్ ని అందుకున్న విషయం మనకు తెలిసిందే…ఇక ఆ తర్వాత దుల్కర్ సల్మాన్ మరోసారి వైజయంతి మూవీస్ బ్యానర్ పైనే హను రాఘవపూడి దర్శకత్వంలో ‘సీతారామం’ సినిమా చేశాడు. ఈ సినిమాతో తనను తాను మరొకసారి స్టార్ హీరోగా ప్రూవ్ చేసుకున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో హను రాఘవపూడి భారీ సక్సెస్ ని అందుకొని ప్రస్తుతం ఆయన కూడా ప్రభాస్ ను డైరెక్షన్ చేసే స్థాయికి ఎదిగిపోయాడు. ఇక ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో ప్రభాస్ తో ఫౌజీ అనే ఒక భారీ హై ఓల్టేజ్ సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. ఇక ఇదిలా ఉంటే వెంకీ అట్లూరి లాంటి డైరెక్టర్ కూడా ప్రస్తుతం ‘లక్కీ భాస్కర్’ సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకొని స్టార్ హీరోతో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.
మొత్తానికైతే దుల్కర్ సల్మాన్ తెలుగులో హ్యాట్రిక్ విజయాలను అందుకోవడమే కాకుండా తెలుగులో ఉన్న దర్శకులను స్టార్ట్ డైరెక్టర్లుగా మార్చడంలో తను కీలకపాత్ర వహిస్తున్నాడు. ఇక కాన్సెప్ట్ ఏదైనా కూడా అతనికి నచ్చితే మాత్రం ఆ సినిమాను చేయడానికి దుల్కర్ సల్మాన్ చాలా వరకు ఆసక్తి చూపిస్తాడు. అందువల్లే ఆయనకి సినిమా ఇండస్ట్రీలో చాలా మంచి క్రేజ్ అయితే దక్కుతుంది…
ఇక ఇదే రీతిలో ఆయన కనక ముందుకు సాగితే మాత్రం ఆయనకు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు అయితే దక్కుతుంది. అలాగే స్టార్ హీరో స్టేటస్ ని కూడా అనుభవించే అవకాశాలైతే ఉన్నాయి. ప్రస్తుతం ఆయనకి తెలుగులో స్టార్ హీరోలకి ఎలాగైతే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అంతటి క్రెజ్ ను సంపాదించుకొని ముందుకు సాగుతున్నాడు…
ఇక ఇలాంటి క్రమంలోనే దుల్కర్ సల్మాన్ మలయాళం సినిమాల కంటే కూడా తెలుగు సినిమాల మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే తెలుగులో భారీ మార్కెట్ ని క్రియేట్ చేసుకుంటే ఆయన క్రేజ్ తారా స్థాయిలో పెరిగిపోతుందనే చెప్పాలి…