https://oktelugu.com/

Hamous actor : సొంత ఇల్లు కూడా లేని ప్రముఖ నటుడు..

బాలీవుడ్ ఇండస్ట్రీలోని దిగ్గజ నటులలో ఈయన కూడా తన అనుపమ్ ఖేర్ కూడా ఒకరు. మరి ఇలాంటి పాపులారిటీ ఉండి, దాదాపుగా 40 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉంటూ హిట్ సినిమాల్లో నటిస్తూ అద్దె ఇంట్లో ఉంటున్నారు అంటే నమ్ముతారా? మరి ఓ సారి ఈ విషయం తెలుసుకోండి.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : November 12, 2024 / 02:02 PM IST

    A famous actor who doesn't even have his own house..

    Follow us on

    famous actor :ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ గురించి పరిచయం అవసరం లేదు. ఈయన బాలీవుడ్ నటుడు అయినా సరే తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. ఈయన నటించిన చాలా సినిమాలు మంచి హిట్ ను సొంతం చేసుకున్నాయి. అయితే ఈయన గురించి వచ్చిన రీసెంట్ వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈయన ఇప్పటికీ కూడా రెంట్ ఇంట్లోనే ఉంటున్నారట. బాలీవుడ్ ఇండస్ట్రీలోని దిగ్గజ నటులలో ఈయన కూడా తన అనుపమ్ ఖేర్ కూడా ఒకరు. మరి ఇలాంటి పాపులారిటీ ఉండి, దాదాపుగా 40 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉంటూ హిట్ సినిమాల్లో నటిస్తూ అద్దె ఇంట్లో ఉంటున్నారు అంటే నమ్ముతారా? మరి ఓ సారి ఈ విషయం తెలుసుకోండి.

    ‘కార్తికేయ 2’, ‘టైగర్ నాగేశ్వర రావు’ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు అనుపమ్ ఖేర్. హంగు ఆర్భాటాలు లేకుండా సింపుల్ లైఫ్ జీవిస్తుంటారు. ఆయనకు అలా ఉండటమే ఇష్టం అని రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అంతేకాదు తను సొంతంగా ఇంటిని కొనుగోలు చేయకూడదు అని నిర్ణయించుకున్నారట కూడా. అందుకే ఇప్పటికి తాను అద్దె ఇంట్లోనే ఉంటున్నాను అని చెప్పడంలో నెటిజన్లు షాక్ అవుతున్నారు. దీని గురించి పూర్తి క్లారిటీ ఇస్తూ..అసలు ఇంటిని ఎవరి కోసం కొనాలి? ఆ ఇంటికి ఖర్చు పెట్టే డబ్బులు బ్యాంకులో దాచుకుని, ప్రతినెలా అద్దె కట్టుకుంటే బెటర్ అంటూ తెలిపారు.

    ఆస్తుల పంపకం విషయంలో పిల్లల మధ్య కచ్చితంగా భవిష్యత్తులో గొడవలు వస్తుంటాయి. అందుకే ఆస్తులను కొనుగోలు చేసే డబ్బును బ్యాంకులో దాచి పెట్టడం బెటర్ అంటూ ఆయన ఒపీనియన్ తెలిపారు. ఆస్తులు పంపకం విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు అంటూ హితవు పలికారు అనుపమ్ ఖేర్. సొంత ఇంటి గురించి ఎంతో మంది కలలు కంటారు. కానీ ఈ గ్రేట్ నటుడు మాత్రం అలాంటి పని తనకు ఇష్టం ఉండదు అంటున్నారు. ఇక వరుస సక్సెస్ లతో బిజీగా ఉన్న సమయంలో తనకోసం ఒక ఇల్లు కొనివ్వమని తన తల్లి కోరిందట. తల్లి కోసం ఇంటిని కొని తనకు మాత్రం ఆ ఇల్లును ఇచ్చారట ఈ నటుడు.

    తండ్రి బతికి ఉన్నప్పుడు అదే ఇంట్లో ఉన్నారట. ఆ ప్రాంతంలో చాలా తక్కువగా ఉన్నారట. దీంతో ఆ ఇల్లును ఒక సెంటిమెంట్ గా తన తల్లి భావించిందట. సిమ్లాలో ఇల్లు కావాలని కోరిందట. అయితే ఆమె ఏదో బంగ్లా కాకుండా కేవలం సింగిల్ బెడ్ రూమ్ మాత్రమే అడిగిందట. కానీ తల్లి కోసం ఎనిమిది పడకలున్న ఒక ఇంటిని బహుమతిగా ఇచ్చానని ఆనందం వ్యక్తం చేశారు.

    అయితే రతన్ టాటా లాంటి గొప్ప మనుషుల నుంచి స్ఫూర్తి పొందారట అనుపమ్ ఖేర్. రతన్ టాటాకు కోట్లాది ఆస్తి ఉన్నప్పటికీ సింపుల్ గా జీవించేవారని తెలిపారు. ఇల్లు, చిన్న కారు మాత్రమే రతన్ టాటాకు ఉండేవని, ఆయనను చూసే తాను అదే విధంగా బతకాలి అనుకున్నారట.