Women feel colder than Men: నైరుతి రుతుపవనాలు దాదాపు ముగింపు దశకు చేరుకున్నాయి. అల్పపీడనాలు, వాయుగుండాలు ఏర్పడుతున్నాయి కాబట్టి భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ ప్రభావం తగ్గిన తర్వాత వర్షాలు ఆగిపోతాయి. వర్షాకాలం ముగిసిన తర్వాత శీతాకాలం మొదలవుతుంది. సహజంగా శీతాకాలంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయి. పగటిపూట సమయం తక్కువగా ఉండి.. రాత్రి సమయం ఎక్కువగా ఉంటుంది. మంచు విపరీతంగా కురుస్తూ ఉంటుంది. దీనివల్ల సహజంగానే సీజనల్ వ్యాధులు వ్యాపిస్తుంటాయి. ముఖ్యంగా శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడే వారి సంఖ్య ఎక్కువ అవుతుంది. చిన్నారులు, పెద్దల్లో జలుబు, జ్వరం వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి.. ఆస్తమా సంబంధిత వ్యాధులు ఉన్నవారు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు.
చలికాలంలో ఉష్ణోగ్రతలు తగ్గుతాయి కాబట్టి వాతావరణం చల్లగా ఉంటుంది. ఆ సమయంలో అందరికీ వెచ్చటి దుస్తులు వేసుకోవాలనిపిస్తుంది. చలిని ఎదుర్కొంటూ శరీరాన్ని కాపాడుకోవాలనిపిస్తుంది. కానీ చలికాలంలో చలి ప్రభావం పురుషుల కంటే స్త్రీలకే అధికంగా ఉంటుందట. ఇదే విషయాన్ని అనేక సైన్స్ జర్నర్స్ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఎందుకంటే మగవారి కంటే మహిళలు సగటున 2.5 ఎక్కువ ఉష్ణోగ్రతలో అత్యంత సౌకర్యవంతంగా ఉంటారు. చలికాలం వల్ల వారిలో మెటబాలిక్ రేటు(నిర్దిష్ట సమయంలో శరీరం మొత్తం శక్తిని మెటబాలిక్ రేటుగా పేర్కొంటారు) తగ్గిపోతుంది. ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ విడుదల ఎక్కువగా ఉంటుంది. పీరియడ్స్ సమయంలో అండాల విడుదల కూడా ప్రభావితం అవుతుంది. ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటం వల్ల అంతర్గత ఆరోగ్యం కూడా అనేక లోటుపాట్లకు గురవుతుంది. అందువల్లే చలికాలంలో మహిళలు వెచ్చటి వాతావరణాన్ని కోరుకుంటారు. బయటికి రావడానికి అంతగా ఇష్టపడరు.
చలికాలంలో శరీరంలో ఉష్ణోగ్రతను పెంచే నువ్వులు, మినుములు, పెసలు, వేరుశనగలను ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు చెబుతుంటారు. బెల్లం, పచ్చికొబ్బరి వంటి వాటిని తీసుకోవడం ద్వారా ఎముకల్లో కాల్షియం పెరుగుతుందని.. తద్వారా మెటబాలిక్ రేటు ప్రభావితం కాదని వైద్యులు చెబుతున్నారు. సాధ్యమైనంతవరకు ఆడవారు చలికాలంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని.. వేడిగా ఉన్న ఆహారాన్ని తీసుకుంటేనే ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం వివిధ మార్గాల ద్వారా స్వీకరించి ఓకే తెలుగు రీడర్స్ కు అందించాం. వైద్యుల చికిత్సకు ఇది ప్రత్యామ్నాయం కాదు. ఈ విషయాన్ని ఓకే తెలుగు పాఠకులు గమనించాలి. కేవలం ఇది అవగాహన కోసం మాత్రమే రూపొందించాం. ఈ కథనానికి, చికిత్సకు ఎటువంటి సంబంధం ఉండదు.