https://oktelugu.com/

viral Video : బిడ్డ చనిపోయిందన్న విషయం తల్లికి తెలియదు.. కన్నీరు పెట్టిస్తున్న వీడియో

అది దట్టమైన అడవి.. చుట్టూ విస్తారంగా చెట్లు ఉన్నాయి. కొండకోనలు.. వాగులు వంకలతో ఆ ప్రాంతం అద్భుతంగా ఉంది. అలాంటి ప్రాంతంలో ఓ ఏనుగు కన్నీటి పర్యంతమవుతోంది. ఏంటా అని చూస్తే.. దాని బాధ మామూలుగా లేదు. దాని ఆవేదన ఒక పట్టాన అంతు పట్టడం లేదు. ఇంతకీ ఏం జరిగిందంటే..

Written By:
  • NARESH
  • , Updated On : November 23, 2024 / 09:48 PM IST
    Follow us on

    సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్న ఓ వీడియోలో ఓ భారీ ఏనుగు కనిపిస్తోంది. అది దిట్టంగా, బలిష్టంగా ఉంది. ఆ ఏనుగు ఓ చిన్న ఏనుగులు లేపడానికి ప్రయత్నిస్తోంది. కానీ అ బుల్లి ఏనుగు లేవలేక పోతోంది. దీంతో ఈ భారీ ఏనుగు కన్నీటి పర్యంతమవుతోంది. అటు ఇటు తిరుగుతోంది. అయినప్పటికీ ఉపయోగం లేకుండా పోతోంది. ఈ వీడియోను ఎవరు తీశారో తెలియదు గాని.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో అది లక్షల్లో వ్యూస్ సొంతం చేసుకుంది. అయితే ఆ ఏనుగు తల్లి అని.. కింద అచేతనంగా పడిపోయిన బుల్లి ఏనుగు తన పిల్ల అని.. ఆ బుల్లి ఏనుగు చనిపోయిందని.. ఆ విషయం తెలియక తల్లి ఏనుగు తట్టి లేపుతోందని.. అయినప్పటికీ అది లేవకపోవడంతో కన్నీటి పర్యంతమవుతున్నదని నెటిజన్లు పేర్కొంటున్నారు..

    జంతువులకు కూడా మనసు ఉంటుంది

    సాధారణంగా జంతువులు క్రూరంగా ఉంటాయని.. విపరీతమైన మానసత్వాన్ని కలిగి ఉంటాయని.. చాలామంది అనుకుంటారు. కానీ జంతువులకు కూడా మనసు ఉంటుంది. అవి కూడా మనుషుల మాదిరే ఆలోచిస్తాయి. బాధ కలిగితే దుఃఖిస్తాయి. సంతోషం కలిగితే నవ్వుతాయి. తమ జంతువుల్లో ఏదైనా చనిపోతే కన్నీరు కారుస్తాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వీడియోలు ఆ ఏనుగు పిల్ల చనిపోయిందని.. దాని మరణాన్ని తట్టుకోలేక తల్లి ఏనుగు విలపిస్తోందని నెటిజన్లు చెబుతున్నారు.. ఇలాంటి దృశ్యాలు జంతువుల్లో ఉన్న ప్రేమను, ఆప్యాయతను బయటికి వెల్లడిస్తాయని వారు పేర్కొంటున్నారు. ” ఆ తల్లి ఏనుగు కు తన పిల్ల చనిపోయిందని తెలియదు. అయినప్పటికీ అది తన పిల్లకు ఏదో జరిగి ఉంటుందని భావించి.. లేపడానికి ప్రయత్నిస్తోంది. మాటలు రాకపోయినప్పటికీ.. తన చేతల ద్వారా ఏదో చేయడానికి యత్నిస్తోంది. ఇలాంటప్పుడే మనుషులు జంతువుల నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందని అనిపిస్తుంది. మనలో చాలామందికి జంతువులను వేటాడడం ఒక అలవాటు. ఇలాంటివి చూసైనా అలాంటి వాటిని మానుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే భూమి మనుషులకు మాత్రమే సొంతం కాదు. అది జంతువులది కూడా అని” నెటిజన్లు పేర్కొంటున్నారు. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు. ఆ ఏనుగు అలా ఎందుకు చనిపోయిందో తెలియదు. కాకపోతే ఈ వీడియో హృదయాలను ద్రవింపజేస్తోంది. తల్లి ప్రేమను ప్రపంచానికి చాటుతోంది.. బిడ్డ అచేతనంగా పడి ఉంటే తల్లి మనసు ఎలా బాధపడుతుందో చెబుతోంది. తల్లి అంటే త్యాగానికి ప్రతీక అని.. బిడ్డ చనిపోతే ఆ బాధ మామూలుగా ఉండదని తెలియజేస్తోంది.