Homeవింతలు-విశేషాలుManish Dhameja Guinness record: ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌ గా ఉన్నావు

Manish Dhameja Guinness record: ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌ గా ఉన్నావు

Manish Dhameja Guinness record: టాలెంట్‌.. ఎవడబ్బ సొత్తు కాదు. పుట్టిన ప్రతీ ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్‌ ఉంటుంది. అవసరమైనప్పుడు.. కొందరు బయటపెడతారు. కొందరు టాలెంట్‌ నిరూపించుకోవాలని శ్రమిస్తారు. సాధన చేస్తారు. నిరూపించుకుంటారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన మనీశ్‌ ధమేజా ఈ కోవకు చెందిన వాడే తన టాలెంట్‌తో క్రెడిట్‌ కార్డులకు వచ్చే రివార్డులతో తన అవసరాలు తీర్చుకుంటూ ఏకంగా గిన్నిస్‌ రికార్డు సృష్టించాడు.

ఉత్తరప్రదేశ్‌లోని లఖీంపూర్‌ఖేరీకి చెందిన మనీశ్‌ ధమేజా క్రెడిట్‌ కార్డులు కేవలం బిల్లులు చెల్లించడానికి కాదు, వాటి ద్వారా వచ్చిన రివార్డులు, క్యాష్బ్యాక్, ఎయిౖర్‌ స్టైల్స్, హోటల్‌ వోచర్లను ఆశ్రయించి తన అవసరాలు తీర్చుకుంటున్నారు. 2021 ఏప్రిల్‌ 30న గిన్నెస్‌ ప్రపంచ రికార్డు లోకి నిలిచిన ఆయన దగ్గర ప్రస్తుతం 1,700కు పైగా చెల్లుబాటు అయ్యే క్రెడిట్‌ కార్డు ఉన్నాయి.

స్మార్ట్‌ ఫైనాన్స్‌ విజయం
మనీశ్‌ని ప్రత్యేకంగా నిలబెట్టిన విషయం ఏమంటే.. ఆయన్ను క్రెడిట్‌ కార్డుల ద్వారా కొలవడం అనే కాదు, వాటిని స్మార్ట్‌ గా ఉపయోగించి ఎప్పుడూ డబ్బులు లేకుండా ప్రయోజనాలు పొందడం. విమానాలు, రైళ్లలో ఉచిత ప్రయాణం, హోటళ్లలో సౌకర్యాలు, స్పా, గోల్ఫ్‌ వంటి విందులు.. ఖర్చు చేయకుండానే జీవితాన్ని సుఖసంతోషాలతో నింపుకుంటున్నారు.

విద్య, ఉద్యోగం.. ఇతర ఆసక్తులు
బీసీఏ, ఎంసీఏ, సోషల్‌ వర్క్‌లో మాస్టర్స్‌ చేసిన మనీశ్‌ టెలీకమ్యూనికేషన్స్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌లో అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌గా పనిచేశాడు. 2019–22 వరకు హైదరాబాద్‌లో ఉన్నాడు. నాణేలు సేకరణలో వున్న ఆసక్తితో గిన్నెస్‌ వరల్డ్‌ రికార్డు సంస్థలో మరో రికార్డు కూడా సాధించారు. ప్రస్తుతం పీహెచ్‌డీ చేస్తున్నాడు. ఎప్పుడైనా ఒక మ్యూజియం ఏర్పాటు చేయాలని కలలాడుతున్నారు.

దక్షిణాది నగరంలో విశేష ప్రాక్టీస్‌
2016 డీమొనెటైజేషన్‌ సమయంలో నగదు లోపం ఉన్నప్పటికీ, మనీశ్‌ డిజిటల్‌ పేగ్మెంట్స్‌ ద్వారా సులభంగా వ్యవహరించగలిగారు. ఇది క్రెడిట్‌ కార్డుల సూత్రాన్ని అర్థం చేసుకుని, సద్వినియోగం చేసే వారి జీవితానికే మార్గదర్శకం. ఆదాయం లేకుండా ఉచిత ప్రయాణాలు, విందులు పొందగలిగే విధానం అతని ప్రత్యేకతగా నిలిచింది.

మనీశ్‌ ధమేజా కథ మనకు క్రెడిట్‌ కార్డులు కేవలం ఆర్థిక పరికరాలు మాత్రమే కాదని, వాటిని స్మార్ట్‌ గా ఎలా వినియోగించుకోవాలో సూచిస్తోంది. ఇది ఆర్థిక విజ్ఞానం, ప్రమాణాలతో కూడిన ఒక స్ఫూర్తిదాయక ప్రయాణం.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular